కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని వెంకట్ రామ్ రెడ్డి నగర్ లో నివాసం ఉంటున్న సుహూర్ అనే వ్యక్తి రేకుల ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్ నిన్న అర్ధరాత్రి ప్రమాదవశాత్తు కూలడంతో అతని భార్యకు స్వల్ప గాయాలయ్యాయి.
నిరుపేదలు కావడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ఈరోజు అక్కడికి వెళ్లి ఘటన స్థలాన్ని పరిశీలించారు. మానవతాదృక్పథంతో స్పందించి తక్షణమే రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందజేసి అండగా నిలిచారు.
ప్రభుత్వం ద్వారా సాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జయరాం, మాజీ కౌన్సిలర్ సాగర్ రావు, డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు ఏర్వ శంకరయ్య, కాలనీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ సతీష్ గట్టోజీ, వార్డు మెంబర్ అబ్దుల్ ఖాదర్, నాయకులు జల్దా లక్ష్మీనాథ్, కుండ శ్రీను, రషీద్, అన్సర్, రామకృష్ణ, మోహన్ రెడ్డి, రామిరెడ్డి, రాజిరెడ్డి, యాదగిరి, అన్వర్, బాల్ రాజ్, సాధక్, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.