హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్, శ్రీనివాస కాలనీల్లో మొత్తం 9 బైకులు మంటల్లో కాలిబూడిదయ్యాయి. గుర్తించిన స్థానికులు మంటలు ఆర్పి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనలో దాదుపు రూ.7 లక్షల ఆస్తి నష్టం జరిగింది.
Read More »బుట్టబొమ్మ సొగసు చూస్తే ఆగతరమా!
మెగాఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్: గాడ్ ఫాదర్ “నజభజ” రిలీజ్ ఈరోజే!
మెగా అభిమానులకు గుడ్‌న్యూస్ తెలిపింది గాడ్‌ఫాదర్ టీమ్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీలోని సెకండ్ సాంగ్ ఈరోజు సాయంత్రం 5.04కు విడుదల చేయనుంది చిత్రబృందం. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది యూనిట్. నజభజ పేరుతో ఉన్న ఈ పాటలో చిరు లుక్ పంచుకోగా ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. మెగాస్టార్ లుక్ చూస్తే ఈ పాట కూడా ఫస్ట్ సాంగ్ తార్‌మార్ తక్కర్ మార్‌లా …
Read More »హైటెక్ సిటీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదారాబాద్ లోని హైటెక్ సిటీలోని మైదాన్ ఎక్స్ పో సెంటర్ లో మామిడి దీప్తి గారి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. తెలంగాణ అడబిడ్డలు ఎంతో ఇష్టంగా.. అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ బతుకమ్మను తొమ్మిది రోజులు పాటు సాగుతాయి. ఈ నేపథ్యంలో నగరంలోని మెటల్ చార్మీనార్ దగ్గర హైటెక్ లో మన బతుకమ్మ సంబరాలు పేరుతో దీప్తి మామిడి గారు ఘన …
Read More »డబ్బు నగల కోసం బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి..!
వైయస్‌ఆర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాసుల కోసం కన్నకూతుర్ని 40 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేశారు తల్లిదండ్రులు. దీంతో ఆ వ్యక్తితో కాపురం చేయడం ఇష్టం లేని బాలిక ఇంట్లో వారికి తెలియకుండా స్పందనలో ఫిర్యాదు చేసింది. కడప నగరానికి చెందిన 16 ఏళ్ల బాలిక 9వ తరగతి చదువుతుంది. ఆమె ఓ వ్యక్తిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ బాలికకు ప్రొద్దుటూరుకు చెందిన 40 ఏళ్ల వ్యక్తితో …
Read More »తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తొలితరం ఉద్యమ నాయకులు.. మాజీ మంత్రి దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హైదరాబాద్ నగరంలోని కొండా లక్ష్మణ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆయన.. ‘ఏ జలదృశ్యంలో అయితే …
Read More »ఫోన్ కాల్ కే భయపడుతున్న బుట్టబొమ్మ.. ఎందుకంటే..?
వరుస మూవీలతో దక్షిణాదిన అగ్ర కథానాయికగా చలామణీ అవుతోంది బుట్టబొమ్మ.. పొడుగు కాళ్ల సుందరి .. యువతకు కలల రాకూమరి పూజా హెగ్డే. బాలీవుడ్‌లోనూ తనకు అవకాశాలు వస్తున్నాయి. మిగిలిన వారితో పోలిస్తే పూజా పారితోషికం ఎక్కువే అని టాక్. ఈ సందర్భంగా ఓ ప్రముఖ మీడియాకిచ్చిన ఇంటర్వూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ నా అదృష్టం కొద్దీ చిత్రసీమలోకి వచ్చాను. ఇక్కడ నా ప్రతిభతోనే నిలదొక్కుకొన్నా. హిట్లూ, ఫ్లాపులూ ఎప్పుడు …
Read More »గులాం నబీ అజాద్ కొత్త పార్టీ ఇదే..?
గతంలో దాదాపు యాబై ఏండ్ల పాటు అనేక పదవులను అనుభవించిన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ జమ్ము కశ్మీర్‌లో డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ పేరుతో నిన్న సోమవారంఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన నూతన పార్టీని ప్రకటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడు తాను ప్రకటించిన సరికొత్త పార్టీ స్వతంత్ర ఆలోచనలు, సిద్ధాంతాలతో ప్రజాస్వామిక పునాదులపై వేళ్లూనుకుంటుందని తెలిపారు. అయితే తాను ప్రకటించనున్న …
Read More »కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ గర్వించే గొప్ప నేత
అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల కోసం, తెలంగాణ సాధన కోసం తన జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ గర్వించే గొప్ప నేత అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొనియాడారు. కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి (సెప్టెంబర్ 27) సందర్భంగా ఆయనకు సీఎం కేసీఆర్ ఘన నివాళులర్పించారు. ఉద్యమకారుడిగా, ప్రజాస్వామికవాదిగా, పీడిత ప్రజల పక్షపాతిగా, నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడుగా పలుపార్శ్వాలతో కూడిన కొండా లక్ష్మణ్ …
Read More »ఆదిలాబాద్ జిల్లాలో త్వరలోనే ఐటీ పార్కు
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు నిన్న సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ బీడీ ఎన్టీ ల్యాబ్‌ను సందర్శించారు.అనంతరం మంత్రి కేటీఆర్ ఐటీ ఉద్యోగులతో కేటీఆర్ మాట్లాడారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో త్వరలోనే ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు..ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న …
Read More »