తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు నిన్న సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ బీడీ ఎన్టీ ల్యాబ్‌ను సందర్శించారు.అనంతరం మంత్రి కేటీఆర్ ఐటీ ఉద్యోగులతో కేటీఆర్ మాట్లాడారు.
ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో త్వరలోనే ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు..ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న రూరల్ టెక్నాలజీ పాలసీ వల్ల ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి.
రాష్ట్రంలో ఉమ్మడి జిల్లా కేంద్రాలైన ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్ లాంటి నగరాల్లో ఇప్పటికే ఐటీ పార్కులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఐటీ రంగం వేగంగా విస్తరిస్తోందన్నారు. ఆదిలాబాద్ లాంటి పట్టణాలకు ఐటీ విస్తరించడం సంతోషకరమైన విషయమన్నారు. ఇక్కడి ఉద్యోగులు అమెరికా కంపెనీలతో పని చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న బీడీ ఎన్టీ ల్యాబ్ భవనం కోసం రూ. 1.50 కోట్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు.