ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘హైవే’ ట్రైలర్ హీరో నాగశౌర్య రిలీజ్ చేశారు. ఈ నెల 19న ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ ఆహాలో విడుదలకానుంది. కేవి గుహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఆనంద్ సరసన మానస నటిస్తుంది. అభిషేక్ బెనర్జీ కీలక పాత్ర పోషించారు. వెంకట తలారి నిర్మాత. సైకో థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను అంచనాలను పెంచుతోంది. మూవీలో ఆనంద్ ఓ ఫొటోగ్రాఫర్‌గా నటించారు.
Read More »ప్రెగ్నెంట్ పై బిపాషా బసు ప్రకటన
తాను ప్రెగ్నెంట్ అయినట్లు బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు ప్రకటించింది. తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి బేబీ బంప్ తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘మాకు ఇది కొత్త దశ. జీవితంలోకి సరికొత్త వెలుగు వచ్చింది’ అని బిపాషా పేర్కొంది. 2015లో వచ్చిన హర్రర్ డ్రామా ‘ఎలోన్’లో నటించినప్పుడు బిపాషా, కరణ్ మధ్య ప్రేమ చిగురించింది. 2016లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
Read More »వైట్ అండ్ వైట్ లో రెచ్చిపోయిన అనన్య
కోహ్లీకి మద్ధతుగా గంగూలీ
గత కొన్ని రోజులుగా ఫామ్ లేమితో విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి మద్దతుగా నిలిచాడు. ‘కోహ్లి గొప్ప ఆటగాడు. ఇప్పటికే వేలాది పరుగులు చేశాడు. అతడు త్వరలోనే పుంజుకుంటాడు. ఆసియా కప్ లో మునుపటి కోహ్లిని చూస్తామనే విశ్వాసం నాకు ఉంది” అని దాదా వ్యాఖ్యానించాడు. 2019 నవంబరు తర్వాత నుంచి కోహ్లి ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఆగస్టు …
Read More »జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. సైనికుల మృతి
జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమర్‌నాథ్ యాత్ర విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది ప్రయాణిస్తోన్న బస్సు నదిలో బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. పలువురు గాయాలపాలయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 39 మంది సైనికులు ఉన్నారు. వీరిలో 37 మంది ఇండో – టిబెటెన్ బోర్డర్ పోలీసులు (ఐటీబీపీ), ఇద్దరు జమ్ముకశ్మీర్ పోలీసులు ఉన్నారు. బ్రేక్ ఫెయిల్ కావడం వల్ల ప్రమాదం జరిగిందని ఐటీబీపీ …
Read More »సింగర్ రాహుల్ జైన్ పై అత్యాచారం కేసు
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సింగర్ రాహుల్ జైన్ పై అత్యాచారం కేసు నమోదైంది. తనపై రాహుల్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ కాస్ట్యూమ్ స్టైలిస్ట్ మహరాష్ట్రలోని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పర్సనల్ స్టైలిస్ట్గా నియమించుకుంటానని.. ఫ్లాట్ కు వచ్చి కలవాలని రాహుల్ ఇన్స్టాలో మెసేజ్ చేశాడని బాధిత యువతి చెప్పింది. ప్లాట్ కు వెళ్లిన తనపై రాహుల్ అత్యాచారం జరిపాడని పోలీసులకు తెలిపింది. కాగా గతంలోనూ రాహుల్ …
Read More »బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయిన రీతాభరి చక్రవర్తి అందాలు
ఉద్యోగులకు గూగుల్ షాక్
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్.. ఉద్యోగుల తొలగింపునకు సిద్దమైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల క్యూ2 వార్షిక ఫలితాల్లో సంస్థ ఆదాయం తగ్గడంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగుల పనితీరును ప్రశ్నించారు. దీంతో వచ్చే వార్షిక ఫలితాల నాటికి పర్ఫార్మెన్స్ బాగాలేని ఉద్యోగులను గూగుల్ తొలగిస్తుందని పలు పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ప్రస్తుతం గూగుల్ నియామకాలను నిలిపివేసింది.
Read More »డీజీపీ మహేందర్ రెడ్డికి కరోనా
తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కరోనా బారినపడ్డారు. గత ఐదు రోజులుగా ఆయన విధులకు హాజరుకావడం లేదు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. గోల్కొండలో నిన్న నిర్వహించిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో కరోనా కారణంగానే ఆయన పాల్గొనలేదు. దీంతో అడిషనల్ డీజీ జితేందర్ నిన్న జరిగిన కార్యక్రమాన్ని పర్య వేక్షించారు.
Read More »టీఆర్‌ఎస్ కు షాక్
తెలంగాణలోని కొమురం భీం జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ కు పెద్ద షాక్ తగిలింది. బెజ్జూరు జెడ్పీటీసీ పుష్పలత , ఎంపీటీసీ సాయన్న , ముగ్గురు సర్పంచులు, మరో ఇద్దరు ప్రజాప్రతినిధులు పార్టీకి రాజీనామా చేశారు. రహదారులు, వంతెనలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన చెందారు. 12 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నా పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా ఆరోపించారు. తమ రాజీనామాను ఆమోదించాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు, …
Read More »