దేశంలో కరోనా కలవరం
దేశంలో గత రెండు వారాలుగా కరోనా కేసులు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుండటంతో పెద్దసంఖ్యలో యాక్టివ్ పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న గురువారం ఒక్కరోజే 13 వేల మంది కరోనా బారినపడ్డారు. తాజాగా నేడు శుక్రవారం కొత్తగా 17,336 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,33,62,294కు చేరాయి. ఇందులో 4,27,49,056 మంది కరోనా వైరస్ బాధితులు …
Read More »ఏపీలో కరోనా కలవరం
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకి చెందిన ఎస్‌కేఆర్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం సృష్టిస్తోంది. పాఠశాలలోని 40 మంది ఎన్‌సీసీ విద్యార్థులకు కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. దీంతో అధికారులు విద్యార్థులను ఐసోలేషన్ వార్డులో ఉంచారు. ఈనెల 18 నుంచి పాఠశాలలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 317 మంది ఎన్‌సీసీ క్యాడెట్లతో క్యాంపు నిర్వహిస్తున్నారు.వీరు స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో పరీక్షించిన వైద్యులు 40 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు …
Read More »తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన TRS Mps
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన నమస్తే తెలంగాణ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదర్‌రావు, హెటిరో ఫార్మా వ్యవస్థాపకుడు బండి పార్థసారథిరెడ్డి ఇవాళ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు సమక్షంలో దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు ఎంపీలూ తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేశారు.
Read More »సాయి చరణ్ కుటుంబ సభ్యులకు గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్ష
అమెరికాలోని మేరీల్యాండ్‌లో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాకు చెందిన నక్క సాయి చరణ్ కుటుంబ సభ్యులను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ రోజు శుక్రవారం పరామర్శించారు. నల్గొండలోని చరణ్ నివాసంలో కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. దైర్యంగా ఉండాలంటూ కుటుంబ సభ్యులను ఓదార్పు . మృతదేహం తరలించడంపై ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని …
Read More »తెలంగాణ రాష్ట్రంలో రూ.1,000 కోట్ల పెట్టుబడులకు ఫ్రెష్ టు హోమ్ సిద్ధం
తెలంగాణ రాష్ట్రంలో రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్టు ఆన్‌లైన్‌లో మాంసం విక్రయాలు జరిపే ప్రముఖ ఫ్రెష్‌టుహోమ్ (ఎఫ్‌టీహెచ్).. ప్రకటించింది. ఈ క్రమంలో రాబోయే ఐదేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా చేయబోయే వ్యాపార విస్తరణకు ఈ నిధులను వినియోగించనున్నది.తాజా మాంసం, చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తులకు ప్రపంచంలోనే అతిపెద్ద పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్ ఈ-కామర్స్ వేదికగా ఎఫ్‌టీహెచ్ పేరుగాంచిన విషయం తెలిసిందే. రాష్ట్ర జనాభాలో 98 శాతానికిపైగా మంది మాంసాహార ప్రియులే. నెలకు …
Read More »మరోసారి మంచి మనసు చాటుకున్న సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ తనలో ఉన్న మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. తిరుపతి జిల్లాలో వకులామాత ఆలయ సంప్రోక్షణ సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. పర్యటన ముగించుకుని తిరిగి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్న సమయంలో రోడ్డుపై అర్జీతో నిలుచుకున్న యువకుడు మహేశ్‌ని చూసి కాన్వాయ్ ఆపారు. సెక్యూరిటీ స్టాఫ్‌ని ఆ యువకుడి వద్దకు పంపి అర్జీని తీసుకున్నారు. మహేష్‌కి 2019లో యాక్సిడెంట్ కావడంతో ఎడమ చేయి విరిగిపోయింది. అంగవైకల్యం కలగడంతో …
Read More »కంటిన్యూగా షూటింగ్‌లు ఆపడానికైనా సిద్ధం: సి.కల్యాణ్
షూటింగ్‌లు ప్రారంభమైతేనే సినీకార్మికుల వేతనాలపై చర్చిస్తామని ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. సినీ కార్మికులు వేతనాలు పెంచాలంటూ కార్మికులు గత రెండు రోజులుగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. దీనివల్ల చాలా సినిమాల షూటింగ్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో సినీ కార్మికుల సంఘం, నిర్మాతల సంఘం నేతలు వేర్వేరుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిశారు. అనంతరం నిర్మాత సి.కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. కార్మికులు షూటింగ్‌లకు రాకుంటే నిర్మాతలంతా …
Read More »స్టార్ డైరెక్టర్‌కు సారీ చెప్పిన హీరో రామ్..
హీరో రామ్ కోలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ డైరెక్టర్‌కు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. ప్రముఖ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ సినిమాలో రామ్ నటిస్తున్నాడు. దీనిలో విజిల్ అంటూ సాగే ఓ పాటను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై స్పీచ్ ఇచ్చిన రామ్ డైరెక్టర్ గురించి మాట్లాడలేదు. ఇదే విషయాన్ని ట్విట్టర్‌లో పంచుకుంటూ లింగుస్వామికి క్షమాపణలు చెప్పాడు. ఈ సినిమా తెరకెక్కడంలో ముఖ్య పాత్ర …
Read More »శివసేనకు కొత్త ఏమి కాదు-గతంలో ఎన్ని సార్లు అంటే..?
మహారాష్ట్ర అధికార పార్టీ శివసేనలో రోజురోజుకూ మారుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. శివసేనకి చెందిన నేత, ఆ రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం తిరుగుబావుటాతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంకీర్ణ ప్రభుత్వం మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి కూలిపోయే ప్రమాదంలో ఉంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం తనపై చర్యల నుంచి తప్పించుకోవాలంటే షిండే వెంట పార్టీకి చెందిన మొత్తం ఎమ్మెల్యేల్లో 2/3 వంతు (37 …
Read More »