మీరు చదివిన వార్త నిజమే. చందమామను అణుబాంబులతో పేల్చేయాలని ప్రపంచంలోనే అగ్రదేశమైన అమెరికా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. చందమామను అణుబాంబులతో పేల్చేయాలని.. అక్కడ ఉన్న ఖనిజ సంపదను దోచుకోవాలని అమెరికా ప్రయత్నాలు మమ్మురం చేసింది. ఇందులో భాగంగా రహస్యంగా ఓ ప్రభుత్వ విభాగాన్ని సైతం అమెరికా ఏర్పాటు చేసినట్లు సమాచారం. చంద్రుడ్ని ఎలా పేల్చివేయాలనే దానిపై పరిశోధనలకు దాదాపు వందల కోట్లు ఖర్చు చేసినట్లు గుసగుసలు. ఆ రహస్య విభాగం …
Read More »RJD నేత తేజ్ ప్రతాప్ సంచలన ప్రకటన
బీహార్ రాష్ట్ర మాజీ మంత్రి,ఆర్జేడీ పార్టీకి చెందిన సీనియర్ ప్రముఖ నేత తేజ్ ప్రతాప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా త్వరలోనే ఆర్జేడీ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే దీని గురించి తన తండ్రి.. మాజీ ముఖ్యమంత్రి లాల్ ప్రసాద్ యాదవ్ తో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. చర్చించిన తర్వాత తన రాజీనామా పత్రాన్ని ఆయనకు ఇవ్వనున్నట్లు కూడా ఈ …
Read More »దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ వస్తుందా…?
దేశంలో మళ్లీ కరోనా ఉద్ధృతి కలవరపెడుతున్నాదా..?. గతంలో మాదిరిగా మళ్లీ కరోనా ఫోర్త్ వేవ్ రానున్నదా..? అంటే ప్రస్తుతం దేశ రాజధాని మహానగరం ఢిల్లీతో సహా పన్నెండు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను బట్టి అవుననే చెప్పాలి. ఈ వారం వ్యవధిలోనే కేసుల సంఖ్య రెట్టింపవ్వడం కలవరపెడుతుంది.మొన్న ఆదివారం ఒక్క రోజే దేశ వ్యాప్తంగా కొత్తగా 2,541మందికి కరోనా పాజిటీవ్ అని నిర్ధారణ అయింది.దీంతో సోమవారం నాటికి కరోనా …
Read More »సీపీఎస్ రద్దుపై ఏపీ ప్రభుత్వం కమిటీ
సీపీఎస్‌రద్దు అంశంపై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం ముగ్గురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారు, సీఎస్‌లతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీపీఎస్ రద్దు కోరుతూ సీఎంవో ముట్టడికి యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగడం.. పలుచోట్ల నిరసనలు తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆర్థిక మంత్రి బుగ్గన, విద్యాశాఖ మంత్రి బొత్స, పురపాలక శాఖ మంత్రి …
Read More »పెళ్లి అయిన నెలరోజులకే బ్లేడ్‌తో భర్త గొంతు కోసేసింది!
హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబకలహాల నేపథ్యంలో భార్య బ్లేడుతో భర్త గొంతు కోసింది. ఈ ఘటన దామెర మండలం పస్రగొండలో చోటుచేసుకుంది. భర్తకు తీవ్రగాయాలు కావడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పస్రగొండ గ్రామానికి చెందిన మాడిశెట్టి రాజు, అర్చనకు మార్చి 25నే పెళ్లి అయింది. నెలరోజులు పూర్తికాకుండా భర్తపై భార్య ఈ దారుణానికి పాల్పడింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రస్తుతం భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు …
Read More »హైకోర్టు సీజేతో సీఎం జగన్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రతో సీఎం జగన్ భేటీ అయ్యారు. విజయవాడలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో వీరి సమావేశం జరిగింది. సీజేను సీఎం మర్యాదపూర్వకంగా కలిశారు. సీజేగా జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం జగన్ భేటీ కావడంతో ఇదే మొదటిసారి. హైకోర్టుకు కొత్త భవనాల నిర్మాణ పనులతో పాటు ఇతర అంశాలపైనా వీరిద్దరూ చర్చించినట్లు తెలిసింది. దీంతో పాటు రాష్ట్రంలో కోర్టుల్లో …
Read More »అదిరిపోయే గుడ్ న్యూస్.. పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఆగయా
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో కానిస్టేబుల్, ఎస్సై పోస్టులు ఉన్నాయి. పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో వీటిని భర్తీ చేయనున్నారు. 16,027 కానిస్టేబుల్, 587 ఎస్సై, 414 సివిల్ ఎస్సై, 66 ఏఆర్‌ఎస్సై, 5 రిజర్వ్ ఎస్సై, 23 టీఎస్‌ఎస్‌పీ ఎస్సై, 12 ఎస్పీసీఎఫ్ ఎస్సై పోస్టులతో పాటు అగ్నిమాపకశాఖలో 26 …
Read More »తెలంగాణ వైద్యరంగ చరిత్రలో మరో అద్భుత ఘట్టం రేపు ఆవిష్కారం
గత ఎనిమిదేండ్లుగా సంక్షేమాభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం తాజాగా వైద్యరంగంలో నెంబర్ వన్ గా నిలవడానికి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే కరోనా లాంటి మహమ్మారిని కట్టడీలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ వైద్యరంగ చరిత్రలో మరో అద్భుత ఘట్టం రేపు ఆవిష్కారం కాబోతున్నది. కొన్ని దశాబ్దాల తరువాత రాజధాని హైదరాబాద్ నలువైపులా అత్యాధునిక దవాఖానల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అల్వాల్ (బొల్లారం), సనత్‌నగర్ (ఎర్రగడ్డ ఛాతి దవాఖాన), …
Read More »దేశంలో కొత్తగా 2,541 కరోనా కేసులు
గడిచిన ఇరవై నాలుగంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 2,541 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,60,086కు చేరాయి. ఇందులో 4,25,21,341 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,22,223 మంది మృతిచెందగా, 16,522 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక కొత్తగా 30 మంది మహమ్మారికి బలవగా, 1862 మంది వైరస్ నుంచి బయటపడ్డారు.
Read More »