Classic Layout

భాగ్య నగర ప్రజలకు సీఎం కేసీఆర్ భరోసా

భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌ ప్రజలను ఆదుకునేందుకు రూ.550 కోట్లు కేటాయిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో భరోసా దక్కిందని ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. మంగళవారం ట్విట్టర్‌ వేదికగా హర్షం వ్యక్తంచేశారు. వరదలతో ప్రజలు అవస్థ పడుతున్న ప్రస్తుత పరిస్థితిలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చర్యలు చేపట్టడంపై హైదరాబాద్‌వాసుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

Read More »

రైతు సంక్షేమమే సర్కారు లక్ష్యం

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం చిన్నరావిరాల గ్రామానికి చెందిన కొలన్‌ సుధాకర్‌రెడ్డి ఇటీవల మరణించాడు. ఆయన భార్య కొలన్‌ విజయలక్ష్మికి రూ. 5లక్షల రైతుబీమా మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏడీ సత్యనారాయణ, రైతుబంధు …

Read More »

కాంగ్రెస్సోళ్ల మాటలను నమ్మే స్థితిలో దుబ్బాక ప్రజలు లేరు

దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు ప్రజలను ఏమని ఓట్లు అడుగుతారు?.. రైతులకు కరెంట్‌ ఇవ్వక మోసం చేసినందుకా.. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దని కోర్టులో కేసులు వేసినందుకా?.. కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు ఇచ్చినందుకా?.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రూపాయి ఇవ్వనందుకా?’ అని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మంచి పనైనా చేశారా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి?.. మీ మాటలు కాయకొరుకుడు మాటలు.. మీ …

Read More »

దుమ్ము దులిపిన ఆర్ఆర్

అబూధాబీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. చెన్నై ఇచ్చిన 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 15 బంతులు ఉండగానే చేధించి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్లేఆఫ్ బరిలో నిలిచేందుకు రెండు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కావడంతో ఇరు జట్ల మధ్య పోరు రసవత్తరంగా ఉంటుందని ప్రేక్షకులు భావించారు. కానీ.. టాస్ గెలిసి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు పేలవంగా …

Read More »

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు మంత్రి హరీష్ దిమ్మతిరిగే షాక్

బీడీ కార్మికులకు ఇచ్చే రూ.2వేల పింఛన్‌లో కేంద్రప్రభుత్వమే రూ.1,600 ఇస్తున్నదంటూ కమలనాథులు గోబెల్స్‌ను మించి ప్రచారం చేస్తున్నారని ఆర్థికమంత్రి టీ హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రప్రభుత్వం అందించే పింఛన్లతోపాటు, కేసీఆర్‌ కిట్లకిచ్చే డబ్బంతా కేంద్రానిదే అన్నట్టు వారు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దుబ్బాకలో ఎన్నికల పేరుతో బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. ‘బీజేపీనేతలు చేస్తున్న ప్రచారం వాస్తవమైతే, వారు దుబ్బాక బస్టాండ్‌ సెంటర్‌కు వచ్చి ప్రజల మధ్య నిరూపిస్తే మంత్రి, ఎమ్మెల్యే …

Read More »

మాజీ మంత్రి నాయినికి మంత్రి కేటీఆర్ పరామర్శ

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత నాయిని నర్సింహారెడ్డిని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారక రామారావు పరామర్శించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని అపోలో దవాఖానకు జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలిసి వెళ్లి నాయినిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్సను అందించాలని కేటీఆర్‌ డాక్టర్లను కోరారు.

Read More »

గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త

వారం రోజులుగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు, ముంచెత్తుతున్న వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తుండటంతో బాధితులను ఆదుకొనేందుకు నేనున్నానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభయమి చ్చారు. భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్‌ నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన సోమవారం తెలిపారు. వరద ప్రభావానికి గురైన కుటుంబాలకు ఇంటికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. వర్షాలు, వరదల …

Read More »

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణ

తెలుగుదేశం పార్టీ కమిటీలను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సోమవారం ప్రకటించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ప్రస్తుత అధ్యక్షుడు ఎల్. రమణను కొనసాగిస్తూ చంద్రబాబు తుది నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే రమణను తొలగించి, మరొకరిని అవకాశం ఇవ్వాలంటూ పలువురు టీడీపీ నేతలు బహిరంగంగానే చంద్రబాబును డిమాండ్ చేశారు. దీంతో టీటీడీపీలో కాస్త అలజడి రేగింది. కానీ… ఎల్. రమణ బలమైన బీసీ నేత కావడం…. తెలంగాణలో పార్టీ కష్టకాలంలో …

Read More »

టాలీవుడ్ హాట్ భామకు సరికొత్త అవకాశం

అనూ ఇమ్మాన్యుయేల్‌కి మరో అవకాశం వచ్చింది. ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వం వహించనున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’లో ఆమె ఓ కథానాయికగా ఎంపికయ్యారు. ఇంతకు ముందు అదితీరావ్‌ హైదరిని కథానాయికగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కథలో ఇద్దరు నాయికల పాత్రలకూ ప్రాముఖ్యం ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఇంటెన్స్‌ లవ్‌ అండ్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రంలో శర్వానంద్‌, సిద్ధార్థ్‌ కథానాయకులు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై …

Read More »

యువహీరోతో అనుపమ

యువహీరో నిఖిల్‌ హీరోగా పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వం వహిస్తున్న ‘18 పేజీస్‌’ సినిమాలో అనుపమా పరమేశ్వరన్‌ కథానాయికగా ఎంపికయ్యారు. త్వరలో అనుపమ షూటింగ్‌లో చేరనున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సోమవారం అధికారికంగా ప్రకటించింది. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాత. దర్శకుడు మాట్లాడుతూ ‘‘కథ విని ఎగ్జైట్‌ అయ్యి అనుపమా ఈ సినిమా అంగీకరించారు. హీరోహీరోయిన్ల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat