rameshbabu
September 21, 2021 SLIDER, TELANGANA
419
తెలంగాణ రాష్ట్రంలో గత 24గంటల్లో 45,274 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 208 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,63,662కు పెరిగింది. మహమ్మారి వల్ల ఇద్దరు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 3,906కు చేరింది. కొవిడ్ నుంచి 220 మంది బాధితులు కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 6,54,765కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,991 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »
rameshbabu
September 21, 2021 SLIDER, TELANGANA
429
యువతను ఆవిష్కరణల వైపు మళ్లించేందుకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్‌ఐసీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, డిజైన్ థింకింగ్, ప్రాబ్లం సాల్వింగ్ నైపుణ్యాలను పెంపొందిస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సొంతంగా ఎదిగేందుకు స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ ఎంతగానో ఉపయోగపడుతున్నదన్నారు. సెకండ్ ఎడిషన్‌లో భాగం గా టీఎస్‌ఐసీ, విద్యాశాఖ, యునిసెఫ్, యువా, ఇంక్విల్యాబ్ సంయుక్తంగా 50వేల మంది విద్యార్థుల ఆలోచనలను …
Read More »
rameshbabu
September 21, 2021 HYDERBAAD, SLIDER, TELANGANA
631
ఐటీ ఉద్యోగం కావాలంటే గతంలో టెకీలు బెంగళూరు, పుణె, చెన్నై, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్), ముంబై లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఐటీ శిక్షణతోపాటు నియామకాల్లోనూ హైదరాబాద్ గణనీయ అభివృద్ధి సాధించింది. కరోనా వల్ల తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశంలో ఈ ఏడాది మార్చి-ఆగస్టు మధ్యకాలంలో జరిగిన ఐటీ ఉద్యోగుల నియామకాల్లో హైదరాబాద్, పుణె నగరాలు చెరో 18 శాతంతో …
Read More »
rameshbabu
September 21, 2021 MOVIES, SLIDER
555
నటుడిగా, కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా సత్తా చాటిన ప్రభుదేవా.. తెలుగు, తమిళం, హిందీ ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. ఇండియన్ మైకేల్ జాన్సన్‌గా పేరొందిన ఆయన తెలుగులో ఎమ్మెస్ రాజు బ్యానర్లో రెండు సినిమాలు చేశారు. ఇక ఇక్కడి సినిమాలను హిందీలో రీమేక్ చేసి మంచి విజయం అందుకున్నారు. కొన్నాళ్లుగా ప్రభుదేవాకి పెద్దగా సక్సెస్‌లు రావడం లేదు. సల్మాన్ ఖాన్‌తో చివరగా చేసిన రాధే సినిమా అభిమానులను దారుణంగా నిరాశపరిచింది. దాంతో ప్రభుదేవా …
Read More »
rameshbabu
September 20, 2021 SLIDER, TELANGANA
709
కావాలనే కొంత మంది ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారు అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. చట్టపరమైన చర్యలకు కోర్టును ఆశ్రయిస్తున్నానని పేర్కొన్నారు. న్యాయస్థానంలో పరువు నష్టం దావా దాఖలు చేశానని తెలిపారు. దుష్ప్రచారం చేస్తున్న వారిపై కోర్టు చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్‌పై కేటీఆర్ ఘాటుగా స్పందించిన విషయం విదితమే. తాను ఎలాంటి …
Read More »
rameshbabu
September 20, 2021 LIFE STYLE, SLIDER
2,192
వాముతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. పొట్ట ఉబ్బరం తగ్గించుకోవడానికి చక్కగా పనిచేస్తుంది. వాముని దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ప్రతి రోజు భోజనం చేసేటప్పుడు వేడి అన్నంలో మొదటి ముద్దలో పావు టీస్పూన్ పొడి వేసుకుని తినాలి. ఇలా చేస్తే కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది. అలాగే వామును నిప్పులపై వేసి పొగ పీలిస్తే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.
Read More »
rameshbabu
September 20, 2021 LIFE STYLE, SLIDER
2,269
బరువు తగ్గేందుకు చాలా మంది గ్రీన్ టీ తాగుతారు. అయితే ఎన్నిసార్లు తాగుతున్నారనేదే పాయింట్. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్తో పాటు కెఫిన్ కూడా ఉంటుంది. అందుకే రోజుకు మూడుసార్ల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగకూడదు. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి. అలాగే శరీరంలోని పోషక విలువలు ద్రవాల రూపంలో బయటికి వెళ్తాయి. భోజన సమయంలో గ్రీన్ టీ తాగడం వల్ల అధిక …
Read More »
rameshbabu
September 20, 2021 LIFE STYLE, SLIDER
2,537
సాధారణంగానే కాకరకాయ తినడం చాలా మంచిది. అయితే వర్షాకాలంలో తీసుకుంటే ఇంకా ఎన్నో ప్రయోజనాలుంటాయి. దీన్ని కూరలా వండినా, ఫ్రై చేసినా, జ్యూస్ రూపంలో తాగినా పుష్కలంగా పోషకాలు అందుతాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది. వానాకాలంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి రక్షణ కల్పించి వ్యాధులను దరిచేరనివ్వవు.
Read More »
rameshbabu
September 20, 2021 SLIDER, SPORTS
1,010
డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ కు చెన్నై సూపర్ కింగ్స్ ఝలక్ ఇచ్చింది. IPL-2021 రెండో విడత తొలి మ్యాచ్ ధోనీ సేన 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై బౌలర్ల ధాటికి ముంబై బ్యాట్స్మన్ పెవిలియన్కు క్యూ కట్టారు. 157 పరుగుల లక్ష్య ఛేదనలో 136/8 రన్స్ మాత్రమే చేశారు. తివారీ (50*) ఒక్కడే రాణించాడు. బ్రావో 3, దీపక్ చాహర్ 2, హేజిల్వుడ్, ఠాకూర్ ఒక్కో …
Read More »
rameshbabu
September 20, 2021 NATIONAL, SLIDER
1,027
పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్నీ సోమవారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ మద్దతు తెలిపారని చరణ్జిత్ సింగ్ తెలిపారు. అటు కొత్త సీఎంకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కంగ్రాట్స్ చెప్పారు. పంజాబ్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. ప్రజల విశ్వాసాన్ని కొనసాగించడం చాలా ముఖ్యమని సూచించారు.
Read More »