Home / SLIDER / లై డిటెక్ట‌ర్ టెస్టుల‌కు రేవంత్ సిద్ధ‌మా-మంత్రి KTR

లై డిటెక్ట‌ర్ టెస్టుల‌కు రేవంత్ సిద్ధ‌మా-మంత్రి KTR

కావాలనే కొంత మంది ఉద్దేశ‌పూర్వ‌కంగా త‌న‌పై దుష్ప్ర‌చారం చేస్తున్నారు అని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు కోర్టును ఆశ్ర‌యిస్తున్నాన‌ని పేర్కొన్నారు. న్యాయ‌స్థానంలో ప‌రువు న‌ష్టం దావా దాఖ‌లు చేశాన‌ని తెలిపారు. దుష్ప్ర‌చారం చేస్తున్న వారిపై కోర్టు చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని విశ్వ‌సిస్తున్నాన‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్‌పై కేటీఆర్ ఘాటుగా స్పందించిన విష‌యం విదిత‌మే. తాను ఎలాంటి టెస్టుల‌కైనా సిద్ధంగా ఉన్నాను. రాహుల్ గాంధీ కూడా డ్ర‌గ్స్ టెస్టుకు సిద్ధ‌మైతే.. తానే ఢిల్లీ ఎయిమ్స్‌కు వెళ్తాన‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. చ‌ర్ల‌ప‌ల్లి జైలుకు వెళ్లొచ్చిన వారితో టెస్టులు చేయించుకునే స్థాయి త‌న‌ది కాదు అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఒక వేళ తాను టెస్టులు చేయించుకుని, క్లీన్‌చీట్‌తో వ‌స్తే రేవంత్ రెడ్డి త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పి, ప‌ద‌వులు వ‌దులుకుంటారా? అని కేటీఆర్ సూటిగా అడిగారు. ఓటుకు నోటు కేసులో లై డిటెక్ట‌ర్ టెస్టుల‌కు రేవంత్ సిద్ధ‌మా? అని కేటీఆర్ అడిగారు.