సాధారణంగానే కాకరకాయ తినడం చాలా మంచిది. అయితే వర్షాకాలంలో తీసుకుంటే ఇంకా ఎన్నో ప్రయోజనాలుంటాయి. దీన్ని కూరలా వండినా, ఫ్రై చేసినా, జ్యూస్ రూపంలో తాగినా పుష్కలంగా పోషకాలు అందుతాయి.
ఇది రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది. వానాకాలంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి రక్షణ కల్పించి వ్యాధులను దరిచేరనివ్వవు.