కరోనా కష్టకాలంలోనూ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మామిడి ఎగుమతులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో 3,76,495 హెక్టార్లలో మామిడి సాగవుతుండగా.. ఈ ఏడాది 56.47 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా. బంగినపల్లి, సువర్ణ రేఖ, తోతాపురి, చిన్న రసాలకు దేశీయంగానే కాకుండా విదేశాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. సువర్ణ రేఖ మామిడిని దక్షిణ కొరియాకు తొలిసారి ఎగుమతి చేశారు. విదేశాలకు, వివిధ రాష్ట్రాలకు మామిడి రవాణా అవుతోంది
Read More »మాజీ ఎంపీ సబ్బంహరి ఇక లేరు.
మాజీ ఎంపీ సబ్బంహరి ఇక లేరు. కరోనాతో బాధపడుతున్న ఆయన నేడు పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ 15న సబ్బం హరికి కరోనా సోకడంతో తొలుత ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తరువాత ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అనంతరం సబ్బంహరి పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తున్నారు. నేటి ఉదయం నుంచే ఆయన పరిస్థితి మరింత విషమంగా …
Read More »తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల్లో ఎవరు ముందున్నారు..?
ఏపీలో ఇటీవల జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ఫలితాలు ఈ రోజు ఆదివారం వెలువడుతున్నయి. ఉప ఎన్నికల కౌంటింగ్‌లో అధికార పార్టీ అయిన వైసీపీ భారీ ఆధిక్యతతో దూసుకెళ్తోంది. తిరుమలలో వైసీపీ భారీ ఆధిక్యతలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా తెలిపారు. సుమారు రెండు వేల పైచిలుకు వైసీపీ మెజారిటీలో ఉంది. దీంతో కౌంటింగ్ కేంద్రం బయట ఉన్న వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి అనుచరులు, నేతలు, …
Read More »ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ కేసుల సంఖ్య రికార్డుస్థాయిలో పెరుగుతోంది. గత 24 గంటల్లో 74,748 టెస్టులు చేయగా 14,669 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 10,69,544కు చేరింది. గత 24 గంటల్లో 71 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 7,871గా ఉంది. నిన్న 6,433 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటివరకు 9,54,062 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,07,611గా ఉంది.
Read More »ఎమ్మెల్యే రోజాకి సీఎం కేసీఆర్ ఫోన్
తెలంగాణ రాష్జ్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆరోగ్యం గురించి ఫోను ద్వారా విచారించారని ఏపీలోని నగరి ఎమ్మెల్యే రోజా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆపరేషన్ తర్వాత వైద్యుల సూచనల మేరకు ఆమె చెన్నైలోనే విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. వైద్యుల సలహాలను పాటించాలని, ప్రజలకు చేసిన సేవలే నాయకులకు గుర్తింపును తెస్తాయని కేసీఆర్ చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ ఫోన్ చేసినందుకు సంతోషంగా …
Read More »మీ పేరుపై ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోండి ఇలా..?
మనకు తెలియకుండానే మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను విజయవాడ టెలికాం విభాగం(డీవోటీ) రూపొందించి సోమవారం ప్రారంభించింది. http://tafcop.dgtelecom.gov.in అనే వెబ్‌సైట్‌లో మొబైల్ నంబరు.. దానికి వచ్చే ఓటీపీ నమోదు చేయగానే మన పేరుమీద ఉన్న ఫోన్ నంబర్ల వివరాలన్నీ వస్తాయి. వాటిలో మనకు అవసరం లేనివి, మనకు తెలియకుండా మన పేరుమీద ఉన్న వాటిని సెలక్ట్ చేసి సబ్మిట్ చేస్తే.. టెలికం శాఖ …
Read More »ఏపీలో కొత్తగా 3,309 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా రెండో దశ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 3,309 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 31,929 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. చిత్తూరులో అత్యధికంగా 740 కేసులు వెలుగులోకి వచ్చినట్టు ఆరోగ్య శాఖ బులెటిన్ ద్వారా తెలిపింది. గుంటూరులో 527, విశాఖపట్నంలో 391, కర్నూలులో 296, కృష్ణాలో 278, శ్రీకాకుళంలో 279, ప్రకాశంలో 174 కేసులు వెలుగులోకి …
Read More »కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మృతి
అనంతపురం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత, హిందూపురం మాజీ ఎమ్మెల్యే కామగానహళ్లి తిప్పేస్వామి(80) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. పరిగి మండలం సేవా మందిరంలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1941లో ఏప్రిల్ 6న జన్మించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సేవా మందిర్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి సొంత స్థలంలో …
Read More »ఆంధ్రప్రదేశ్ లో 2765 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది గత 24 గంటల్లో 31,982 శాంపిల్స్ పరీక్షించడం జరిగింది.ఇందులో 2765 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,18,597కి చేరింది. నిన్న కరోనా వల్ల మంది మృతిచెందగా, మొత్తం మరణాల సంఖ్య 7,279కి చేరింది. ప్రస్తుతం 16,422 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 1,245 మంది కరోనా నుంచి కోలుకోగా ఇప్పటివరకు 8,94,896 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Read More »ఏపీలో తగ్గని కరోనా కేసులు
ఏపీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది రాష్ట్రంలో కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి గడిచిన 24 గంటల్లో 30,678 శాంపిల్స్ పరీక్షించారు.. వీటిలో 1,326 కేసులు నమోదయ్యాయి దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 9,09,002కి చేరింది. ఇక తాజాగా ఐదుగురు మృతిచెందారు. మొత్తం మరణాల సంఖ్య 7,244కి చేరింది. ప్రస్తుతం 10,710 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 8,91,048 మంది కరోనా నుంచి కోలుకున్నారు
Read More »