Home / ANDHRAPRADESH / తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల్లో ఎవరు ముందున్నారు..?

తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల్లో ఎవరు ముందున్నారు..?

ఏపీలో ఇటీవల జరిగిన తిరుపతి లోక్ సభ  ఉప ఎన్నికల ఫలితాలు ఈ రోజు ఆదివారం వెలువడుతున్నయి. ఉప ఎన్నికల  కౌంటింగ్‌లో అధికార పార్టీ అయిన వైసీపీ భారీ ఆధిక్యతతో దూసుకెళ్తోంది. తిరుమలలో వైసీపీ భారీ ఆధిక్యతలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా తెలిపారు.

సుమారు రెండు వేల పైచిలుకు వైసీపీ మెజారిటీలో ఉంది. దీంతో కౌంటింగ్ కేంద్రం బయట ఉన్న వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి అనుచరులు, నేతలు, వైసీపీ కార్యకర్తలు ఆనందంలో మునిగితేలుతున్నారు.

ఈ ఆధిక్యతపై తిరుపతి టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ.. ఏ పార్టీకి ఏజెంట్లు లేకుండా వన్‌సైడ్‌గా పోలింగ్ జరిగిందని విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. ఎన్నికల రోజు ఎన్నికల ఏజెంట్ తనను కూడా స్వయంగా తిరుమలకు పంపలేదని ఆమె చెప్పుకొచ్చారు.