Home / ANDHRAPRADESH / మాజీ ఎంపీ సబ్బంహరి ఇక లేరు.

మాజీ ఎంపీ సబ్బంహరి ఇక లేరు.

మాజీ ఎంపీ సబ్బంహరి ఇక లేరు. కరోనాతో బాధపడుతున్న ఆయన నేడు పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ 15న సబ్బం హరికి కరోనా సోకడంతో తొలుత ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తరువాత ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అనంతరం సబ్బంహరి పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తున్నారు. నేటి ఉదయం నుంచే ఆయన పరిస్థితి మరింత విషమంగా మారింది. దీంతో ఆయన కన్నుమూసినట్టు వైద్యులు వెల్లడించారు.

సబ్బం హరి జూన్ 1, 1952న బంగారునాయడు, అచ్చియమ్మ దంపతులకు విశాఖపట్టణంలోని చిట్టివలసలో జన్మించారు. ఆరుగురు సంతానంలో చివరివాడు. సొంతూరులోని తన పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఇంటర్, డిగ్రీ ఏవీఎన్ కళాశాలలో పూర్తి చేశారు. డిగ్రీ ఫైనలియర్ చదువుతూనే అనేక వ్యాపారాలు చేశారు. నష్టం రావడంతో అన్ని బిజినెస్‌లకు గుడ్‌బై చెప్పారు. 1955 విశాఖ మేయర్ ఎన్నికల్లో పోటి చేశారు.

మేయర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. అవినీతి ఆరోపణలు లేకుండా మేయర్‌గా పరిపాలన కొనసాగించారు. పారిశుద్ధ్యాన్ని ప్రైవేటీకరణ చేసిన తొలి నగరంగా విశాఖను సబ్బం హరి మలిచారు. విశాఖ కాంగ్రెస్ కమిటీలో కార్యదర్శిగా.. అనంతరం నగర యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా సబ్బం నియామకమయ్యారు. 1970 అక్టోబర్ 15న లక్ష్మిని ప్రేమ వివాహం చేసుకున్నారు. సబ్బంకు అవని, అర్చన అనే ఇద్దరు కుమార్తెలున్నారు. కుమారుడు వెంకట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. 15వ లోక్‌సభకు అనకాపల్లి ఎంపీగా కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat