ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 51 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,89,010కి చేరింది. ఇందులో 609 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 8,81,238 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఇద్దరు చనిపోగా… మొత్తం 7,165 మరణాలు సంభవించాయి..
Read More »ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన ఆదేశాలు జారీ చేసింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని ఆదేశించిన SEC.. ఈ నెల వరకు మంత్రి పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని స్పష్టం చేసింది. పెద్దిరెడ్డికి మీడియాతో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దన్న SEC ప్రజలు నిర్భయంగా ఓటు వేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఆదేశాలు అమలు చేయాలని డీజీపీకి సూచించింది.
Read More »మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ వైసీపీ సర్పంచ్ అభ్యర్థి అప్పన్నను బెదిరించిన కేసులో అచ్చెన్నను అదుపులోకి తీసుకున్నరు పోలీసులు. అనంతరం ఆయన్ని కోటబొమ్మాళి PSకు తరలించారు. అటు అప్పన్నను పరామర్శించేందుకు అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కాసేపట్లో నిమ్మాడకు రానున్నారు.
Read More »ఏపీలో మొత్తం ఓటర్లు 2,77,17,784 మంది
ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో ఈసారి 2,77,17,784 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2019 ప్రకారం జాబితా సిద్ధం చేయగా.. అత్యధికంగా తూ.గో.లో 16.18లక్షల మంది ఓటర్లున్నారు. ఇక తర్వాతి స్థానాల్లో గుంటూరు, ప.గో. ఉన్నాయి పలు కారణాలతో కొన్ని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. ఇవి పోగా 13,371 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించవచ్చని కలెక్టర్లు నిర్ణయించారు. ఇవాళ SECతో భేటీలో ఈ విషయం తెలపనున్నారు
Read More »తిరుమలలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు బుధవారం దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. తన మొక్కులను చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలు, పట్టువస్త్రాలను పొంగులేటి గారి దంపతులకు అందజేశారు. స్వామివారి దర్శనం …
Read More »ఏపీ-జంట హత్య కేసులో ట్విస్ట్
ఏపీలో చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 4 రోజులుగా ఇంట్లోనే క్ుద్ర పూజలు చేసినట్లు తెలుస్తోంది. చిన్న కూతురు దివ్యను తల్లి డంబెల్ కొట్టి చంపింది.. ఆ తర్వాత దివ్య మృతదేహం చుట్టూ పురుషోత్తం, పద్మజు, అలేఖ్య నగ్నంగా పూజలు చేశారు. అలేఖ్యను పూజగదిలో తండ్రి చంపాడు, ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏ1గా పురుషోత్తం, ఏ2గా పద్మజ …
Read More »షర్మిల పార్టీపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై ‘ఏబీఎన్’తో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులుగా తాను తప్ప ఎవరూ ఉండకూడదని జగన్మోహన్‌రెడ్డి భావిస్తున్నాడని వీహెచ్ అభిప్రాయపడ్డారు. షర్మిలలో ప్రవహిస్తున్నది కూడా వైఎస్ రక్తమేనని, అందుకే ఆమె పార్టీ ఆలోచన చేస్తున్నట్లు ఉన్నారని వీహెచ్ వ్యాఖ్యానించారు. షర్మిలకు విశాఖ టికెట్ ఇవ్వకుండా …
Read More »తిరుపతిలో పోటీపై పవన్ క్లారీటీ
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం తిరుపతిలో జరిగింది. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థినే బరిలోకి దింపాలని సమావేశంలో కమిటీ అభిప్రాయపడింది. రానున్న ఎన్నికల్లో పార్టీ పోటీ చేయాలని సభ్యులు గట్టిగా డిమాండ్ చేశారు. బీజేపీ అధిష్టానంతో చర్చించి వారం రోజుల్లో ఈ అంశాన్ని తేలుద్దామని అధినేత పవన్ కల్యాణ్ చెప్పారట. అభ్యర్థి ఎవరైనా గెలుపు కోసం కలిసి పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు.
Read More »ఏకైక ఎమ్మెల్సీ వైసీపీ వశం
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఖాళీ అయిన స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థి పోతుల సునీత ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు ఆమోదించారు. అయితే ఈ స్థానానికి ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో సునీత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి 21న అధికారిక ప్రకటన వెలువడనుంది.
Read More »మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్.
ఏపీలో కృష్ణా జిల్లాలోని గొల్లపూడి సెంటర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నేత కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా దీక్షకు యత్నించారు. TDP నేత దేవినేని ఉమ. కోవిడ్ నేపథ్యంలో ధర్నాకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు అనంతరం ఆందోళన చేస్తున్న ఉమను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలతో ఆ ప్రాంతమంతా రణరంగంలా మారింది. దీంతో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు.
Read More »