భారత టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లి చేసిన ప్రకటనపై బీసీసీఐ స్పందించింది. ‘కోహ్లికి ధన్యవాదాలు. అద్భుతమైన నాయకత్వ లక్షణాలతో భారత జట్టును ఎన్నో శిఖరాలకు తీసుకెళ్లావు. 68 టెస్టుల్లో 40 విజయాలతో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచావు కోహ్లి’ అని బీసీసీఐ తెలిపింది.
Read More »విహారికి కూడా అవకాశాలు ఇవ్వాలి
దక్షిణాఫ్రికా, ఇండియా మధ్య కేప్టాన్ లో జరగాల్సిన టెస్టు మ్యాచ్ లో అజింక్య రహానెకు బదులుగా విహారిని జట్టులో తీసుకోవాలని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. రెండో టెస్టుకు కోహ్లి దూరమవడంతో విహారికి అవకాశం ఇచ్చారు. మూడో టెస్టు కోసం కోహ్లి తిరిగి జట్టులో చేరనున్న నేపథ్యంలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. విహారికి కూడా అవకాశాలు ఇవ్వాలని, రహానె ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడని గౌతీ చెప్పాడు.
Read More »Ms Dhone పై హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్
ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. తనను గతంలో తప్పించడంపై కీలక వ్యాఖ్యలు నుంచి చేశాడు. ‘నేను 400వ టెస్ట్ వికెట్ తీసినప్పుడు నాకు 31 ఏళ్లు. తర్వాత మరో వంద వికెట్లు తీస్తానని భావించా. కానీ 2016 తర్వాత నన్ను జట్టులోకి తీసుకోలేదు. ఇదే విషయమై ధోనీని అసలు ఏం జరిగింది. నేను టీంలో ఉండటం ఎవరికి ఇష్టంలేదు? అని అడిగా. కానీ ధోనీ …
Read More »కోలుకుంటున్న దాదా
ఇటీవల కరోనా బారిన పడిన మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని కోల్‌కతాలోని వుడ్అండ్ ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుతానికి ఆయనకు జ్వరం లేదని తెలిపింది. నిపుణులైన వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని, భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. గంగూలీకి కొన్ని నెలల కిందట యాంజియోప్లాస్టీ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నారు.
Read More »ఇర్ఫాన్ పఠాన్ ఇంటికి వారసుడోచ్చాడు
భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మరోసారి తండ్రయ్యాడు. తనకు మరో కుమారుడు జన్మించినట్లు పఠాన్ వెల్లడించాడు. కీలక ఆల్‌రౌండర్‌గా టీమ్ ఇండియాకు ఎన్నో విజయాలు అందించిన ఇర్ఫాన్.. 2016లో హైదరాబాద్ మోడల్ సాఫా బైగ్ ను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇప్పటికే కుమారుడు (ఇమ్రాన్ ఖాన్ పఠాన్) ఉన్నాడు. తమ రెండో కుమారుడికి సులేమాన్ ఖాన్ అని పేరు పెట్టినట్లు పఠాన్ వెల్లడించాడు.
Read More »రిషబ్ పంత్ అరుదైన రికార్డు
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన రికార్డు సృష్టించాడు. తక్కువ టెస్టు మ్యాచ్‌లో 100 మందిని ఔట్ చేసిన భారత కీపర్ గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో పంత్.. ధోని, సాహా రికార్డులను బ్రేక్ చేశాడు. ధోనీ, సాహా 36 టెస్టుల్లో ఈ ఘనత సాధించగా పంత్ కేవలం 26 టెస్టుల్లోనే 100 మందిని ఔట్ చేశాడు. ఇక కేవలం 21 టెస్టుల్లోనే 100 మందిని ఔట్ చేసిన …
Read More »కపిల్ దేవ్ రికార్డుపై రవిచంద్రన్ అశ్విన్ గురి
టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. కపిల్ దేవ్ రికార్డుపై గురిపెట్టాడు. 81 టెస్టుల్లో 427 వికెట్లు తీసిన అశ్విన్.. సఫారీలతో టెస్టు సిరీస్ లో సీనియర్ మాజీ ఆటగాడు కపిల్ దేవ్ (434) రికార్డును దాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక పేస్ బౌలర్ మహమ్మద్ షమి ఈ టెస్టు సిరీస్‌లో 200 వికెట్ల మైలురాయిని చేరుకోవాలని ఆశిస్తున్నాడు. ఇప్పటివరకు 54 టెస్టులు ఆడిన షమి… 195 వికెట్లు పడగొట్టాడు.
Read More »ద్రవిడ్ రికార్డుపై.. టెస్టు కెప్టెన్ కోహ్లి కన్ను
టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ రికార్డుపై.. టెస్టు కెప్టెన్ కోహ్లి కన్నేశాడు. సౌతాఫ్రికా గడ్డపై ద్రవిడ్ 22 ఇన్నింగ్స్‌లో 624 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లి ఈ రికార్డుకు చేరువలో ఉన్నాడు. సౌతాఫ్రికాలో కోహ్లి 10 ఇన్నింగ్స్‌లో 558 పరుగులు చేశాడు. ద్రవిడ్ రికార్డును అధిగమించేందుకు కోహ్లి మరో 66 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇక సౌతాఫ్రికాలో సచిన్ 1161 పరుగులతో టాప్‌లో …
Read More »‘అలాంటివారివల్లే ప్రపంచం ఇంత అందంగా ఉంటోంది
ఒకప్పటి Team India బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన సహృదయతను మరోసారి చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదానికి గురైన తన స్నేహితురాలిని కాపాడిన ట్రాఫిక్ పోలీసును వ్యక్తిగతంగా కలిసి థ్యాంక్స్ చెప్పాడు. ఇటీవల సచిన్ ఫ్రెండ్ ఒకరు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసు వెంటనే స్పందించి ఆమెను ఆటోలో జాగ్రత్తగా ఆసుపత్రికి చేర్చాడు. దాంతో ఆ మహిళకు ప్రాణాపాయం తప్పింది. …
Read More »వన్డే కెప్టెన్సీ తొలగింపుపై సునీల్ గవాస్కర్ Hot Comments
టీమిండియా క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్సీ తొలగింపుపై విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించాడు. వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కోహ్లి చెప్తున్న దానికి ఎక్కడా పొంతన లేదు. ఈ వివాదానికి తెరపడాలంటే వారిద్దరూ మీడియా ముందుకు వచ్చి.. వివరించాలి. అలాగే, సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ కూడా కోహ్లిని ఎందుకు తప్పించాల్సి వచ్చిందో చెప్పాలి’ అని అన్నాడు.
Read More »