సౌతాఫ్రికా- వెస్టిండీస్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో పరుగుల పరంగానే కాకుండా సిక్సర్లలోనూ ప్రపంచ రికార్డు నమోదైంది. రెండు జట్ల ఆటగాళ్లు ఏకంగా 35 సిక్సర్లు బాదారు.
గతంలో బల్గేరియా-సెర్బియా మ్యాచ్లో 33, ఇండియా-వెస్టిండీస్ మ్యాచ్లో 32 సిక్సర్లు నమోదయ్యాయి. నిన్నటి మ్యాచ్ లో తొలుత విండీస్ 258/5 రన్స్ చేయగా, సౌతాఫ్రికా 18.5 ఓవర్లలో 259/4 రన్స్ చేసి సరికొత్త రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే.