తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం ఈ రోజు సోమవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీలో చేరడంతో ఆ పార్టీ …
Read More »ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు ఏంటి.. ఏమి లభిస్తాయి..?
భారత నూతన ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్ ధన్‌కఢ్ఘ నవిజయం సాధించారు. ఆయన గెలుపును లోక్‌సభ జనరల్ సెక్రటరీ ఉత్పల్ కె.సింగ్ అధికారికంగా ప్రకటించారు. 346 ఓట్ల ఆధిక్యంతో ధన్‌కఢ్ గెలుపొందారు. మొత్తం పోలైన 725 ఓట్లలో 528 ఓట్లను ఆయన సొంతం చేసుకున్నారు. 15 ఓట్లు చెల్లలేదు. ధన్‌కఢ్‌పై విపక్షాల అభ్యర్థిగా పోటీ చేసిన మార్గరెట్ ఆల్వాకు 182 ఓట్లు వచ్చాయి.ఉపరాష్ట్రపతిగా అతనికి ఏమి ఏమి వసతులు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. …
Read More »మాజీ సీఎం ఉద్దవ్ థాక్రేకు భారీ షాక్
మహరాష్ట్రలో రాజకీయ వివాదం తర్వాత ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామంటూ ఆ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే-బీజేపీ కూటమికి తొలి నుంచి సవాల్ విసురుతున్న శివసేన చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ థాక్రేకు భారీ షాక్ తగిలింది. తాజాగా 62 మండలాల్లోని 271 పంచాయితీలకు ఓటింగ్ జరిగింది. ఇందులో బీజేపీ మద్దతుదారులు 82 స్థానాలు కైవసం చేసుకున్నారు. NCP 53, శివసేన (షిండే వర్గం) 40 స్థానాలు గెలుచుకుంది. శివసేన …
Read More »మోదీకి షాకిచ్చిన నితీశ్ కుమార్
ప్రధానమంత్రి నరేందర్ మోదీ అధ్యక్షతన ఈరోజు ఆదివారం జరుగనున్న నీతిఆయోగ్ సమావేశాన్ని బీహార్ సీఎం నితీశ్‌కుమార్ బహిష్కరించారు. తొలుత డిప్యూటీ సీఎంను సమావేశానికి పంపాలని భావించినా.. ఆ సమావేశానికి సీఎంలు మాత్రమే హాజరుకావాలని కేంద్రం కచ్చితంగా చెప్పడంతో బీహార్ తరఫున ఎవరూ వెళ్లట్లేదు. ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన సమావేశానికి ఇటీవల నితీశ్ గైర్హాజరయ్యారు. కాగా, గత కొద్ది నెలలుగా వాయిదా పడుతున్న …
Read More »దేశవ్యాప్తంగా చర్చ జరగాలి.. అందుకే బాయ్‌కాట్ చేస్తున్నా: కేసీఆర్ ఫైర్
సమాఖ్య, సహకార స్ఫూర్తిని భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని.. మహాత్మాగాంధీ చరిత్రను మలినం చేయాలని చూస్తున్నారని టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేంద్ర ప్రభుత్వం, భాజపా వైఖరిపై తీవ్రస్థాయిలో కేసీఆర్ మండిపడ్డారు. గాంధీకి లేని అవలక్షణాలను ఆయనకు అంటగట్టి హేళన చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. గత ఆర్థిక సంవత్సరంలో పథకాల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.1.90లక్షల కోట్లు ఖర్చు చేస్తే.. కేంద్ర ప్రభుత్వం …
Read More »రేషన్ కార్డులకు వెబ్ రిజిస్ట్రేషన్
ఇల్లులేనివారు, అభాగ్యులు, వలసదారులు, ఇతర అర్హులైన వారికి రేషన్‌కార్డులు అందించేందుకు కామన్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్టు కింద 11 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీన్ని ప్రారంభించారు. ఈ నెలాఖరు నాటికి అన్ని రాష్ర్టాల్లోనూ అమలుచేయనున్నారు. అర్హులైన వారిని వేగంగా గుర్తించి రేషన్ కార్డులు అందించడంలో రాష్ర్టాలకు సహకారం అందించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు. వలసదారులు, ఇతర లబ్ధిదారులు ఎవరిసాయమైనా తీసుకొని కామన్‌రిజిస్ట్రేషన్ ఫెసిలిటీలో …
Read More »అమిత్‌షాను కలిసిన కోమటిరెడ్డి బ్రదర్స్
కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో కోమటిరెడ్డి బ్రదర్స్ భేటీ అయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వేర్వేరుగా అమిత్‌షాతో సమావేశమయ్యారు. తెలంగాణ వరద సాయం కోసం అమిత్‌షాను కలిసిన ట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. వరదలతో రూ. 1,400 కోట్ల నష్టం వాటిల్లిందని.. ఆ విషయంపై అమిత్‌షాతో చర్చించినట్లు తెలిపారు. పదవుల కోసం వెంటపడే …
Read More »ఓటర్ కు ఆధార్ అనుసంధానం అఖరి గడవు అప్పుడే..?
దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో పేరున్న అందరూ 2023 ఏప్రిల్ 1లోగా తమ ఓటరు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని కేంద్రం ప్రకటించింది. ప్రతి ఒక్కరూ 6B ఫారం ద్వారా తమ ఆధార్ నంబర్ ను సంబంధిత ఎన్నికల అధికారికి ఇవ్వాలని సూచించింది. అయితే ఈ అనుసంధాన ప్రక్రియ ఐచ్ఛికమే అని.. ఒకవేళ ఎవరి దగ్గరైనా ఆధార్ లేకపోతే ఎన్నికల అధికారులు కోరే ఇతర డాక్యుమెంట్లను 6B ఫారం …
Read More »టోల్ ప్లాజాలను ఎత్తేసి కొత్త వ్యవస్థ ఏర్పాటు
దేశ వ్యాప్తంగా ఉన్న నేషనల్ హైవేలపై 6 నెలల్లో టోల్ ప్లాజాలను ఎత్తేసి కొత్త వ్యవస్థ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫాస్టాగ్ స్థానంలో GPS లేదా నంబర్ ప్లేట్ ఆధారిత విధానాలను పరిశీలిస్తున్నామన్నారు. ఇందుకోసం పార్లమెంటులో చట్టం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే వచ్చే మూడేళ్లలో 26 గ్రీన్ ఎక్స్ప్రెస్వేలను నిర్మిస్తామని తెలిపారు. రెండేళ్లలో దేశంలోని రోడ్లు USతో సమానంగా ఉంటాయన్నారు.
Read More »రేవంత్.. అప్పుడేం పీకావ్?.. రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్ష పదవిని డబ్బులిచ్చి కొనుక్కున్నారని.. సీఎం అయిపోయి రాష్ట్రాన్ని దోచుకోవాలని ఆయన చూస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన రాజగోపాల్‌రెడ్డి.. రేవంత్ తనపై చేసిన విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. కాంట్రాక్టుల కోసమే తాను పార్టీ మారుతున్నట్లు రేవంత్ ఆరోపించారని.. అదే …
Read More »