Home / NATIONAL / రేషన్‌ కార్డులకు వెబ్‌ రిజిస్ట్రేషన్‌

రేషన్‌ కార్డులకు వెబ్‌ రిజిస్ట్రేషన్‌

 ఇల్లులేనివారు, అభాగ్యులు, వలసదారులు, ఇతర అర్హులైన వారికి రేషన్‌కార్డులు అందించేందుకు కామన్‌ రిజిస్ట్రేషన్‌ ఫెసిలిటీని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించింది. పైలట్‌ ప్రాజెక్టు కింద 11 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీన్ని ప్రారంభించారు. ఈ నెలాఖరు నాటికి అన్ని రాష్ర్టాల్లోనూ అమలుచేయనున్నారు.

అర్హులైన వారిని వేగంగా గుర్తించి రేషన్‌ కార్డులు అందించడంలో రాష్ర్టాలకు సహకారం అందించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు. వలసదారులు, ఇతర లబ్ధిదారులు ఎవరిసాయమైనా తీసుకొని కామన్‌రిజిస్ట్రేషన్‌ ఫెసిలిటీలో తమ వివరాలు నమోదుచేసుకొని రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వెరిఫికేషన్‌ కోసం ఆ డాటాను సంబంధిత రాష్ర్టాలకు పంపిస్తారు. వారు రేషన్‌ కార్డు పొందాక.. వన్‌రేషన్‌ వన్‌ రేషన్‌ కార్డు ప్రోగ్రామ్‌ కింద దేశంలోని ఏ రేషన్‌ షాపులోనైనా ఆహారధాన్యాలు తీసుకోవచ్చు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat