కరోనా నేపథ్యంలో తొలిసారి డిజిటల్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. స్వదేశీ ‘బాహి ఖాతా (బడ్జెట్)’ను టాబ్లెట్‌లో సమర్పించారు. పసిడి వర్ణంతో కూడిన మూడుచక్రాల జాతీయ చిహ్నంతో రూపొందించిన రెడ్ కలర్ బ్యాగ్‌లో బడ్జెట్ రూపొందించిన టాబ్లెట్‌ను తీసుకుని పార్లమెంట్‌కు వెళ్లారు. రెడ్ అండ్ క్రీమ్ కలర్ చీర ధరించి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఇతర ఆర్థిక శాఖ అధికారులు వెంటరాగాపార్లమెంట్‌లో అడుగు …
Read More »మా ఓపిక నశిస్తే,బీజేపీ నేతలు కనీసం బయట తిరగలేరు-అనిల్ కూర్మాచలం
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఎన్నారై టీ.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తీవ్రంగా ఖండించారు. ఇలాంటి భౌతిక దాడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటివని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంపై నోరుమెదపలేని బిజెపి నాయకులకు మతవిద్వేషాలు రెచ్చగొట్టే విషయాల్లో అనవసరమైన అత్యుసాహాన్ని ప్రదర్శిస్తున్నారని అనిల్ కూర్మాచలం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు సైతం లెక్క చెయ్యకుండా పోరాటం చేసిన చరిత్ర టీ.ఆర్.యాస్ పార్టీదని, ఇలా ప్రజలని …
Read More »బీజేపీకి మంత్రి కేటీఆర్ వార్నింగ్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణులు చేసిన దాడులను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు ఏ మాత్రం చోటు లేదన్నారు. బీజేపీ తీరును ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని ఆదివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలోనూ బీజేపీ భౌతిక దాడులకు ప్రయత్నించిందని విమర్శించారు. టీఆర్‌ఎస్ శ్రేణులను, ప్రతి కార్యకర్తను కాపాడుకునే శక్తి, …
Read More »తెలంగాణలో ఈ రైల్వే స్టేషన్లు మూసివేత.. ఎందుకంటే..?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణికుల రద్దీ, ఆదాయం లేని రైల్వేస్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లుగా దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో 29 స్టేషన్లను మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో నవాడ్గి, అంక్షాపూర్, మారుగుట్టి, పోడూరు, మామిడిపల్లి, కట్టాలి, కట్లకుంట మేడిపల్లి, మైలారం, మహాగనాన్, కొత్తపల్లి హావేలి, చిట్టహాల్ట్, నందగాన్ హాల్లి, గేట్ కారేపల్లి, నూకనపల్లిమల్యాల్, నగేశ్‌వాడి హాల్ట్, మృట్టి హాల్ట్, వలివేడు, …
Read More »రైతులకు మద్ధతు ఇచ్చేవారు ఉగ్రవాదులే
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపే ప్రతి ఒక్కరూ ఉగ్రవాదులేనని వ్యాఖ్యానించింది. ట్రాక్టర్ల ర్యాలీలో ఉద్రిక్తతలపై స్పందించిన కంగనా రనౌత్. ఈ ఆందోళనలతో మనం ప్రపంచం ముందు నవ్వులపాలవుతున్నాం. దేశమంటే గౌరవం లేకుండా పోయింది. రైతులుగా పిలవబడుతున్న వారికి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరూ ఉగ్రవాదులతో సమానం. వారిని జైల్లో వేయాలి’ అని అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read More »మీ దగ్గర పాత రూ.100 నోట్లు ఉన్నాయా..?
ఈ ఏడాది మార్చి నుంచి పాత రూ.100 నోట్లను ఉపసంహరించనున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది కొత్త రూ. 100 నోట్లు మాత్రమే చలామణీలో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామంది. పాత సిరీస్ నోట్లలో నకిలీ నోట్లు అధికంగా ఉన్నట్లు RBI వర్గాలు తెలిపాయి ఈ నేపథ్యంలోనే ఆ నోట్లను రద్దు చేస్తున్నారు. అటు ఇప్పటికే పాత సిరీస్ నోట్ల ముద్రణను 6 నెలలుగా బ్యాంకు ఆపేసింది.
Read More »జీహెచ్‌ఎంసీ నూతన మేయర్ ఎన్నికకు ముహుర్తం ఖరారు
తెలంగాణ రాష్ట్రంలోని జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌తో పాటు దీనికి సంబంధించిన విధానపరమైన సూచనలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేసింది. ప్రత్యేక సమావేశ౦ నిర్వహించేందుకు ప్రిసైడింగ్ అధికారిని నియమించనున్నారు. ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 11.00 గంటలకు నూతనంగా ఎన్నికైన జీహెచ్ఎంసీ వార్డు మెంబర్లతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక …
Read More »టీఆర్ఎస్ లోకి వలసలు
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. జిల్లాలోని ఆర్మూరు మండలానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు గులాబీ కండువా కప్పుకున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లుగా వారు తెలిపారు
Read More »తిరుపతిలో పోటీపై పవన్ క్లారీటీ
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం తిరుపతిలో జరిగింది. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థినే బరిలోకి దింపాలని సమావేశంలో కమిటీ అభిప్రాయపడింది. రానున్న ఎన్నికల్లో పార్టీ పోటీ చేయాలని సభ్యులు గట్టిగా డిమాండ్ చేశారు. బీజేపీ అధిష్టానంతో చర్చించి వారం రోజుల్లో ఈ అంశాన్ని తేలుద్దామని అధినేత పవన్ కల్యాణ్ చెప్పారట. అభ్యర్థి ఎవరైనా గెలుపు కోసం కలిసి పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు.
Read More »ప్రధాని మోదీ,సీఎంలకు రెండో దశలో వ్యాక్సిన్
ప్రధాని మోదీతో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలు రెండో దశలో కోవిడ్ టీకా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో మాట్లాడిన ప్రధాని మోదీ.. రాజకీయవేత్తలతో పాటు 50 ఏళ్లు దాటిన వారు రెండవ రౌండ్‌లో టీకా తీసుకోవాలన్న సూచన చేశారు. తొలి దశలో కేవలం ఫ్రంట్‌లైన్, హెల్త్ వర్కర్లకు మాత్రమే టీకా వేస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో టీకా పంపిణీ జోరుగా సాగుతోంది. …
Read More »