కరోనా మహమ్మారి అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తోంది. కరోనా బారిన పడి అట్టుడుకుతున్న దేశాల్లో నిన్న మొన్నటి వరకు ఇటలీ తొలిస్థానంలో ఉండగా ఇప్పుడు అమెరికా ఈ స్థానానికి ఎగబాకింది. కరోనా మృతుల సంఖ్య సహా పాజిటివ్ కేసుల్లోనూ అమెరికా ముందు వరుసలో నిలవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కొవిడ్-19 వైరస్ సోకిన వారిలో గంటకు 83 మంది చొప్పున పిట్టల్లా రాలిపోతున్నట్టు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. ఆదివారం …
Read More »ఖమ్మం జిల్లాలో ఎనిమిదేళ్ళ బాలికకు కరోనా..! ఎలా వచ్చిందంటే..?
తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు ఖమ్మంలో కరోనా ప్రభావం లేదు. అంతా సేఫ్ అని అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు, ప్రజలు భావిస్తున్న సమయంలో కలవరం మొదలైంది. శనివారం వరకు నాలుగు పాజిటివ్ కేసులు నమోదవగా.. ఆదివారం ఓ ఎనిమిదేళ్ల బాలికకు లక్షణాలున్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఖమ్మం ఖిల్లాకు చెందిన ఆ కుటుంబంలో ఇప్పటికే ఇద్దరికి కరోనా రాగా.. అదే కుటుంబానికి చెందిన బాలికకు లక్షణాలు బయటపడటంతో ఆందోళన చెందుతున్నారు. …
Read More »కామారెడ్డిలో 12కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 12కు చేరింది. తాజాగా వచ్చిన 22 మంది రిపోర్టుల్లో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు బాన్సువాడలోనే 11 కేసులు నమోదు అయ్యాయి. కామారెడ్డి పరిధిలోని దేవునిపల్లిలో ఒక కేసు నమోదు అయ్యింది. జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలను అధికారులు మరింత అప్రమత్తం చేస్తున్నారు.
Read More »కరోనా వ్యాప్తి నిరోధానికి ఇదే స్ఫూర్తి కొనసాగాలి
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రస్తుతం అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ను ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. వైరస్ సోకినవారికి చికిత్స అందించడంతోపాటు వారితో కలిసినవారిని గుర్తించి, క్వారంటైన్ చేసే ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. లాక్‌డౌన్ కారణంగా నిత్యావసరాలకు కొరత రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వరికోతలు, ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లు యథావిధిగా కొనసాగించాలని సూచించారు. కరోనా బాధితులకు అందుతున్న చికిత్స, లాక్‌డౌన్ అమలు, వ్యవసాయ …
Read More »లక్ష దాటిన కరోనా మృతులు
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 1,02,696కు చేరింది. కరోనాతో అత్యధికంగా అమెరికాలో 18 వేల మంది మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా 17 లక్షల మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఈ వైరస్ నుంచి ఇప్పటి వరకు 3.69 లక్షల మంది బాధితులు కోలుకున్నారు. అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య …
Read More »లాక్ డౌన్ నిబంధనలను ఉల్లఘించిన బీజేపీ ఎమ్మెల్యే
కరోనా వైరస్ నియంత్రణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. కానీ లాక్‌డౌన్ నిబంధనలు ప్రజాప్రతినిధులే ఉల్లంఘిస్తున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే తప్పటడుగు వేస్తున్నారు. కర్ణాటకకు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే.. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తుముకూరు జిల్లాలోని టురువేకెరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎం జయరాం లాక్‌డౌన్ …
Read More »239కి చేరిన కరోనా మృతుల సంఖ్య
భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశం నలుమూలలకు ఈ వైరస్ వ్యాప్తి చెందింది. కరోనా ధాటికి ఇప్పటి వరకు దేశంలో 239 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 7447 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా నుంచి 643 మంది కోలుకున్నారు. కరోనాతో అత్యధికంగా మహారాష్ట్రలో 110 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1574కు చేరింది. ఢిల్లీలో 14 మంది, మధ్యప్రదేశ్‌లో 36, …
Read More »ఏడాదికి 10 రోజులు ప్రపంచమంతా లాక్‌డౌన్ చేద్దాం
ప్రపంచంలో అనేకదేశాల్లో ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో వాతావరణ కాలుష్యం, భూతాపంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ప్రపంచమంతా ఒప్పుకొంటే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏడాదికి కనీసం పదిరోజులపాటు పరిమితస్థాయిలో లాక్‌డౌన్ ప్రకటిస్తే బాగుంటుందని వినూత్న ప్రతిపాదన చేశారు. కరోనా వ్యాప్తిని కట్టడిచేసేందుకు లాక్‌డౌన్‌ను మరికొంతకాలం కొనసాగించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని, అయితే దీనిపై సమిష్టిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని తెలిపారు. కరోనా మహమ్మారి …
Read More »భారత్‌లో 24 గంటల్లో 40 మంది మృతి
కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. భారత్‌లో గడిచిన 24 గంటల్లో 40 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 1035 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7447కు చేరింది. కరోనాతో అత్యధికంగా మహారాష్ట్రలో 110 మంది …
Read More »అమెరికాలో ఒక్క రోజే 2108 మంది మృతి..
నోవెల్ కరోనా వైరస్ వల్ల ఒక్క రోజే రెండు వేల మందికిపైగా అమెరికాలో మరణించారు. గత 24 గంటల్లో 2108 మంది చనిపోయినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ పేర్కొన్నది. దేశవ్యాప్తంగా వైరస్ సంక్రమించిన వారి సంఖ్య 5 లక్షలు దాటింది. అత్యధికంగా కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య ఇటలీలో ఎక్కువగా ఉన్నది. అయితే త్వరలోనే ఆ దేశాన్ని అమెరికా దాటి వేయనున్నది. కానీ వైట్‌హౌజ్ నిపుణులు మాత్రం …
Read More »