తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. సెకండ్ వేవ్‌లో రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 7,432 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే కరోనా బారినపడి మరో 33 మంది ప్రాణాలను కోల్పోయారు. మహమ్మారి బారి నుంచి 2,152 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 58,148 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ …
Read More »ఆ గ్రామంలో సగం మందికి కరోనా ..!
కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. నగరాలు, జిల్లా కేంద్రాలే కాకుండా రాష్ట్రంలోని మారుమూల పల్లెలకు కూడా కరోనా ప్రబలుతున్నది. బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా అమనహళ్లి గ్రామంలో కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. అమనహళ్లిలో 300 మంది జనాభా ఉండగా, ఇటీవల ఆ గ్రామంలో అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మొత్తం 144 మందికి పాజిటివ్ వచ్చింది. దాంతో గ్రామంలో దాదాపు సగం మందికి కొవిడ్ …
Read More »దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో
దేశంలోనే తొలిసారిగా ఆక్సిజన్ సరఫరా కోసం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం యుద్ధ విమానాలను ఉపయోగిస్తోంది. ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన యుద్ధ విమానాలు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు ఈ ఉదయం బయల్దేరి వెళ్లాయి. 8 ట్యాంకుల ద్వారా 14.5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌కు యుద్ధ విమానాలు తీసుకురానున్నాయి.
Read More »తెలంగాణలో కరోనా విజృంభణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రోజువారీ కొవిడ్ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 6,206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌బులిటెన్‌లో తెలిపింది. అలాగే 29 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మహమ్మారి నుంచి 3,052 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 52,726 యాక్టివ్ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ …
Read More »మంత్రి కేటీఆర్ కు కరోనా
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకారామారావు కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మంత్రి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు.. ఈ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినట్లు చెప్పారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని, పరీక్షలు చేసుకొని జాగ్రత్తగా ఉండాలని కోరారు.
Read More »దేశంలో కరోనా విలయ తాండవం
దేశంలో కరోనా విలయ కొనసాగుతున్నది. రోజు రోజుకు మహమ్మారి తీవ్రత భారీగా పెరుగుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నిన్న 3లక్షలకుపైగా కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. శుక్రవారం వరుసగా రెండోసారి 3లక్షలకుపైగా కరోనా కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,32,730 కొవిడ్ కేసులు నమోదయ్యాయని, 2,263 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 1,93,279 మంది మహమ్మారి నుంచి …
Read More »ధోనీ తల్లిదండ్రులకు కరోనా
సెకండ్ వేవ్‌లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో ఎన్నడూ లేనంతగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ కరోనా వైరస్ ఎవ్వరిని వదలడం లేదు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులను సైతం కరోనా వదలడం లేదు. ఈ మధ్యే క్రికెట్ దిగ్గజం సచిన్ కూడా కరోనా నుంచి కోలుకున్నాడు. తాజాగా భారత జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ కుటుంబంలో కరోనా కలకలం …
Read More »తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో భారీగా కేసులు రికార్డవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 6,542 పాజిటివ్ కేసులు నమోదవగా.. 20 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారని వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. తాజాగా 2,887 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 46,488 యాక్టివ్ …
Read More »దేశంలో కరోనా మరణ మృదంగం
దేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తున్నది. రోజువారీ పాజిటివ్ కేసులతో పాటు రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొవిడ్ రోజువారీ కేసులు దేశంలో కొత్తగా దాదాపు మూడు లక్షలకు చేరువవగా.. 2,023 మంది మరణించారు. కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి ఇంత మొత్తంలో కరోనా కేసులు, మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. 24 గంటల్లో 2,95,041 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ …
Read More »రాత్రిపూట కర్ఫ్యూతో ఏమి లాభం – విక్రమార్క భట్టీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా రాత్రిపూట కర్ఫ్యూతో ఎలాంటి ఉపయోగం లేదని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. జన సంచారం తక్కువగా ఉండే రాత్రి సమయంలో కర్ఫ్యూ పెట్టి ఏం లాభమని పశ్నించారు. ఈ నిర్ణయం కరోనా వ్యాప్తిని ఎలా అడ్డుకోగలదో అర్థం కావట్లేదన్నారు. కరోనా కట్టడికి పగటి పూట కర్ఫ్యూ విధించాలని సూచించారు. కనీసం 144. సెక్షన్ విధించి నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు. …
Read More »