ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ నానాటికీ విజృంభిస్తోంది. అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. తాజాగా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది
Read More »మీరు ఆ మాస్కులనే వాడుతున్నారా..?
వస్త్రం (క్లాత్)తో తయారు చేసిన మాస్కుల కంటే N95 లేదా KN95 మాస్కులు శ్రేయస్కరమని అమెరికా మేరీల్యాండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫహీమ్ యూనస్ చెప్పారు. రెండు N95 లేదా KN95 మాస్కులు కొని ఒక్కో రోజు ఒక్కోటి వాడాలని సూచించారు. ఒకటి వాడిన తర్వాత దానిని పేపర్ బ్యాగులో ఉంచి మరుసటి రోజు వాడాలన్నారు. అవి పాడు కాకపోతే కొన్ని వారాల పాటు వాడుకోవచ్చన్నారు. వస్త్రంతో చేసిన మాస్కులు ధరించవద్దన్నారు.
Read More »దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
దేశంలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా 2 లక్షల 73 వేల 810 మంది వైరస్ బారిన పడ్డారు. వరసగా 5వ రోజూ కేసులు 2 లక్షలు దాటాయి. మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో ఇదే అత్యధికం. ఏకంగా 1,619 మంది మరణించారు. ఒక్క రోజులో సంభవించిన మరణాల్లో కూడా ఇవే అధికం. దేశంలో కరోనా మరింత ప్రమాదకరంగా …
Read More »GHMCలో 705 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం GHMCలో గడచిన 24 గంటల్లో మరో 705 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 90,770కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి కోసం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read More »హీరోయిన్ తో పాటు కుటుంబానికి మొత్తం కరోనా
కరోనా మహమ్మారి ప్రకంపనలు పుట్టిస్తుంది. సెలబ్రిటీలను సైతం కరోనా గజ గజ వణికిస్తుంది. రీసెంట్‌గా బాలీవుడ్ నటి సమీరా రెడ్డి కరోనా బారిన పడింది. ఆదివారం రోజు తాను కరోనా బారిన పడినట్టు తెలియజేసిన సమీరా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాను. నా ముఖం మీద చిరునవ్వు తీసుకొచ్చే ఎందరో నా చుట్టూ ఉన్నారు. ఈ సమయంలో పాజిటివ్‌గా దృడంగా ఉండాలని పేర్కొంది. అయితే సోమవారం ఉదయం నెటిజన్స్ సమీరా పిల్లల …
Read More »తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో తొలిసారి కేసుల సంఖ్య 5వేలు దాటేసింది. తెలంగాణ వ్యాప్తంగా శనివారం 1,29,637 టెస్టులు నిర్వహించగా.. 5,093 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 3,51,424కు పెరిగింది. వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం మరణాలు కూడా అత్యధికంగా నమోదయ్యాయి. గత ఏడాది జూన్ 7, జూలై 31, ఆగస్టు …
Read More »ఢిల్లీలో 7రోజులు లాక్‌డౌన్
దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఈరోజు నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ లాక్‌డౌన్ ఈ రోజు(సోమవారం) రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం అంటే ఏప్రిల్ 26 ఉదయం 6 గంటల వరకూ కొనసాగనుంది. కరోనా చైన్ తెగ్గొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ సర్కారు వెల్లడించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈరోజు ఉదయం …
Read More »కరోనా వాక్సిన్ తీసుకున్న మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ ఆర్టీసీ వర్క్ షాప్ ఆస్పత్రిలోని వాక్సినేషన్ కేంద్రాన్ని మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు… వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్ మొదటి డోస్ టీకా తీసుకున్నారు..కరోనా వాక్సినేషన్ పట్ల ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.ఈ సందర్భంగా అక్కడి సిబ్బందితో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. టీకా కేంద్రంలో ఉన్న సదుపాయాలు, టీకా సరఫరాలపై అధికారులతో చర్చించి నిరంతరం …
Read More »ప్రభుత్వ దవాఖానల్లో పడకల కొరత లేదు : మంత్రి ఈటల
కరోనా రోగులకు చికిత్సనందించే ప్రభుత్వ దవాఖానల్లో పడకల కొరత లేదని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 60వేల పడకలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఆదివారం బీఆర్‌కే భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.కరోనా తగ్గిందనుకున్న సమయంలో రెండో వేవ్ మొదలైందని అన్నారు. సెకండ్ వేవ్‌లో వైరస్ బారినపడిన వారిలో 5 శాతం మందిలో మాత్రమే లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘‘45 సంవత్సరాలు నిండిన …
Read More »మహారాష్ట్రలో కరోనా విజృంభణ
మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా ఒక్కరోజే 67,123 కరోనా కేసులు, 419 మరణాలు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. ఇవాళ 56,783 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 6,47,933 యాక్టివ్ కేసులున్నాయని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కాగా కరోనాతో మహారాష్ట్రలో ఇప్పటివరకు 59,970 మరణాలు సంభవించాయి.
Read More »