తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు వ్యాక్సినేషన్ నిలిపివేస్తూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. సోమవారం నుంచి యథాతథంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. వ్యాక్సినేషన్ నిల్వలు అందుబాటులో లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుండగా.. ప్రజలెవరూ వ్యాక్సినేషన్ కేంద్రాలకు రేపు రావొద్దని ప్రభుత్వం సూచించింది.
Read More »మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్య పరిస్థితి విషమం
మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఇటీవల కరోనా బారినపడిన ఆయన చికిత్స నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. నిన్న రాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి రాష్ట్ర విభజన అనంతరం అధినేత చంద్రబాబుతో విభేదించారు. 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు …
Read More »దేశంలో కరోనా కల్లోలం
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉన్నది. వైరస్ వ్యాప్తి రోజు రోజుకు ఉధృతమవుతున్నది. రోజువారీ కేసులతో పాటు మరణాలు పెరుగుతుండడం కలవరపెడుతున్నది. వరుసగా దేశంలో నాలుగో రోజు రెండు లక్షలకుపైగా కొవిడ్ కేసులు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2,61,500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది.గతంలో ఎన్నడూ లేని విధంగా 1,501 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 1,38,423 మంది …
Read More »తెలంగాణలో కరోనా విజృంభణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. దీంతో ప్రభుత్వం ముమ్మరంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా నిన్న 1,29,637 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 5093 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. వైరస్ బారినపడినవారిలో 15 మంది మరణించగా, మరో 1555 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3.51 లక్షలకు చేరాయి. ఇందులో 3.12 లక్షల మంది డిశ్చార్జీ అవగా, 1824 …
Read More »మున్సిపల్ పట్టణాల్లో సోడియం హైపోక్లోరైట్ స్ప్రే చేయాలి: మంత్రి కేటీఆర్
తెలంగాణరాష్ట్రంలో కోవిడ్ వ్యాధి మళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మరియు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో యుద్ధ ప్రాతిపదికన సోడియం హైపోక్లోరైట్ ద్రావకం పిచికారీ చేయాలని పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ అధికారులను ఆదేశించారు.మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, కమీషనర్ ఎండ్ డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ సత్యనారాయణ, జీ.హెచ్.ఎం.సీ కమీషనర్ లోకేశ్ కుమార్ లతో మంత్రి ఇవ్వాళ ఫోన్‌లో మాట్లాడారు. కోవిడ్ తీవ్రత దృష్ట్యా …
Read More »ఆంధ్రప్రదేశ్ లో కరోనా విశ్వరూపం
ఆంధ్రప్రదేశ్లో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 6,096 కేసులు వచ్చాయి. 24 గంటల్లో కరోనాతో 20మంది మృత్యువాత పడ్డారు. చిత్తూరులో 5, కృష్ణా జిల్లాలో ముగ్గురు, అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,48,231కు చేరింది. మృతుల సంఖ్య 7373కి చేరింది.
Read More »తెలంగాణలో కరోనా విలయ తాండవం
తెలంగాణలో కరోనా విలయ తాండవం చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 4446 కరోనా కేసులు నమోదవగా మరో 12 మంది బాధితులు మరణించారు. 1414 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3.46 లక్షలకు చేరింది. ఇందులో 1,809 మంది బాధితులు వైరస్‌వల్ల మరణించగా, మరో 3.11 లక్షల మంది డిశ్చార్జీ అయ్యారు. …
Read More »దేశంలో కరోనా వైరస్ విలయతాండవం
ప్రస్తుతం మన దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే 2,34,692 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,341 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 1,23,354 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 1,45,26,609కు చేరుకోగా, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 16,79,740. ఇప్పటి వరకు కరోనాతో 1,75,649 మంది చనిపోగా, 1,26,71,220 …
Read More »మహారాష్ట్రలో కరోనా విలయతాండవం
మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండగా.. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 61,695 పాజిటివ్ కేసులు రాగా, 349 మంది చనిపోయారు. 53,335 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 36.39లక్షలను చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6.20 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు
తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,840 కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,41,885కి చేరింది. ఇందులో 30,494 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. ఇప్పటివరకు 3,09,594 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 9 మంది మృతిచెందగా.. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,797కి చేరింది.
Read More »