దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పాజిటివ్ కేసులు, ఇవాళ రికార్డుస్థాయికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 46,951 కరోనా కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల్లో ఈ ఏడాది ఇదే అత్యధికం కావడం విశేషం. అదేవిధంగా చాలా రోజుల తర్వాత మరణాలు రెండు వందలు దాటాయి. నిన్న ఉదయం నుంచి ఇప్పటివకు 212 మంది మృతిచెందారు.దీంతో మొత్తం కేసులు 1,16,46,081కు …
Read More »లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కరోనా సోకింది. ఈ నెల 19న ఆయన కొవిడ్ పాజిటివ్ అని తేలిందని, శనివారం ఆయన ఎయిమ్స్‌లో చేరినట్లు ఆ ఆసుపత్రి వెల్లడించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని ఆదివారం రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో తెలిపింది.
Read More »గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 47 కరోనా కేసులు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గడిచిన 24 గంటల్లో మరో 47 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 81,440 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు.
Read More »తెలంగాణలో కొత్తగా 313 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 313 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనా నుంచి 142 మంది బయటపడగా, మరో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,360కి చేరుకోగా, 2,98,262 మంది కోలుకున్నారు. ఇప్పటిరకు మహమ్మారివల్ల 1664 మంది మృతిచెందారు. మరో 2434 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇందులో 943 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా, రాష్ట్రంలో కరోనా మృతుల రేటు 0.55 …
Read More »దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ
ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. రోజురోజుకు పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్నది. నిన్న దాదాపు 36వేలకుపైగా కొత్త కేసులు రికార్డవగా.. తాజాగా 40వేలకు చేరాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 39,726 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,15,14,331కు పెరిగింది. కొత్తగా 20,654 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,10,83,679 డిశ్చార్జి అయ్యారని …
Read More »తెలంగాణలో కొత్తగా 278 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 278 పాజిటివ్ కేసులు నమోదవగా, 111 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,047కు చేరింది. ఇందులో 2,98,120 మంది బాధితులు మహమ్మారి బారినుంచి కోలుకోగా, 1662 మంది మృతిచెందారు. ఇంకా 2265 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 830 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా, రాష్ట్రంలో రికవరీ రేటు 98.69 శాతంగా ఉందని, మృతుల …
Read More »కామారెడ్డి జిల్లాలో కరోనా కలవరం
తెలంగాణలో కామారెడ్డి జిల్లా కేంద్రం పరిధిలోని టేక్రియాల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలకు చెందిన 32 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పాఠశాలలోని ఆరుగురు టీచర్లకు కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. పాఠశాల విద్యార్థినులకూ పరీక్షలు నిర్వహించగా 32 మందికి పాజిటివ్ వచ్చింది. కానీ విద్యార్థినుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి …
Read More »కరోనా టీకా తీసుకున్న మంత్రికి కరోనా పాజిటివ్
ఇటీవల కరోనా టీకా తీసుకున్నప్పటికీ ఓ మంత్రికి కొవిడ్ టెస్టులో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గుజరాత్‌కు చెందిన మంత్రి ఈశ్వర్‌సిన్హ్ పటేల్ కొద్ది రోజుల క్రితం కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని మంత్రి తన ట్విటర్ పేజీలో వెల్లడించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన …
Read More »దేశంలో తగ్గని కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా రోజువారీ కేసులు క్రమంగా అధికమవుతూ వస్తున్నాయి. నిన్న 25 వేల పైచిలుకు కేసులు నమోదవగా, ఇవాళ ఆ సంఖ్య 26 వేలు దాటింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 26,291 పాజిటివ్ కేసులు నమోదవగా, 118 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,13,85,339గా ఉండగా, మరణాలు 1,58,725కు చేరుకున్నాయి. మొత్తం కేసుల్లో …
Read More »జీహెచ్ఎంసీలో తగ్గిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గడిచిన 24 గంటల్లో మరో 35 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 81,292 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో టెస్టులు చేయించుకోవాలని సూచించారు
Read More »