కోవిడ్ వ్యాక్సిన్ ను తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగవు. అందరూ ధైర్యంగా వ్యాక్సిన్ వేసుకోవాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తెలిపారు. బుధవారం పద్మారావు గౌడ్, సతీమణి స్వరూప సికింద్రాబాద్ దవాఖానలో కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ ను రూపొందించడంలో భారతీయ శాస్త్రవేత్తల కృషి అమోఘమని అన్నారు. వ్యాక్సిన్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు
Read More »దేశంలో కొత్తగా 14,989 మందికి కరోనా
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,989 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,39,516కు చేరింది. అటు నిన్న 98 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,57,346కు పెరిగింది. ఇక నిన్న కరోనా నుంచి13,123 మంది కోలుకోగా ప్రస్తుతం దేశంలో 1,70,126 యాక్టివ్ కేసులున్నాయి…
Read More »మీరు కరోనా వ్యాక్సిన్ తీసుకోబోతున్నారా..?. అయితే ఇది మీకోసమే..?
సాధారణంగా కరోనా వైరస్ నిరోధానికి ఇప్పటివరకు వచ్చిన వ్యాక్సిన్లన్నీ రెండు డోసులుగా తీసుకునేవే. అయితే తొలిసారి కేవలం ఒక డోసుతోనే సమర్థంగా పనిచేసే టీకాను జాన్సన్ అండ్ జాన్సన్ అనే అమెరికా సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెరికాలో టీకా అత్యవసర వినియోగానికి FDA విభాగం ఆమోదముద్ర వేసింది. మూడు ఖండాల్లో ప్రయోగించి ఫలితాలను అధ్యయనం చేశామని, టీకా 85% రక్షణ కల్పిస్తుందని ఆ కంపెనీ పేర్కొంది.
Read More »కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కరోనా టీకా
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కరోనా టీకా వేయించుకున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఆయ కొవార్టిన్ టీకా తొలిడోసు తీసుకోగా.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆయన పక్కనే ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి… అర్హులంతా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, అపోహలు పెట్టుకోవద్దని కోరారు. ప్రధాని సహా ప్రముఖులందరూ వ్యాక్సిన్ తీసుకుని ఆదర్శంగా నిలిచారని కిషన్ పేర్కొన్నారు.
Read More »దేశంలో ఇప్పటికి 85లక్షల మందికి కరోనా వ్యాక్సిన్
ప్రస్తుతం దేశంలో ఇప్పటివరకు 85 లక్షల మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం వచ్చే సైడ్ ఎఫెక్టులు చాలా తక్కువగా ఉన్నాయని కేంద్రమంత్రి హర్షవర్ధన్ చెప్పారు. కరోనా వ్యాక్సిన్ వల్ల ఒక్కరు కూడా మరణించలేదన్న ఆయన.. దేశంలో కరోనా రికవరీ రేటు కూడా 97.29%గా ఉందని, ప్రపంచంలో అత్యంత తక్కువ కరోనా మరణాల రేటు కూడా దేశంలోనే నమోదైందన్నారు. గత 7రోజుల్లో 188 జిల్లాల్లో ఒక్క కరోనా …
Read More »కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ టాప్
కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ దూసుకెళ్తోంది ప్రపంచ దేశాలతో పోలిస్తే తక్కువ రోజుల్లో అత్యధిక టీకాలు పంపిణీ చేసిన దేశంగా భారత్ నిలిచింది. దేశంలో ఇప్పటివరకు 60 లక్షలకు పైగా టీకాలు పంపిణీ చేశారు ఇండియాలో ఈ టీకాల పంపిణీకి 24 రోజుల సమయం పట్టింది. అమెరికాలో 26 రోజులు, యూకేలో 46 రోజుల సమయం పట్టింది. దేశంలో సోమవారం ఒక్కరోజే 2,23,298 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.
Read More »కరోనా వ్యాక్సిన్ పై టర్కీ సంచలన నిర్ణయం
టర్కీ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది కరోనా వ్యాక్సిన్ డోసులకు.. తమ దేశంలో తలదాచుకుంటున్న ఉన్న వీగర్ ముస్లింలను డ్రాగన్ కు అప్పగించేందుకు సిద్ధమైంది. చైనా చెర నుంచి తప్పించుకున్న చాలామంది వీగర్ ముస్లింలు టర్కీలో తలదాచుకుంటున్నారు. శాంతి భద్రతల పేరు చెప్పి చైనా వీరందరినీ బందీలుగా చేస్తోంది. చైనా 10 లక్షల డోసుల టీకాలను ఇంకా టర్కీకి చేరవేయలేదు. ఈ నేపథ్యంలో వీగర్లు ఆందోళన చెందుతున్నారు
Read More »తెలంగాణలో ఈ నెల 13 నుంచి రెండో విడత కరోనా వ్యాక్సిన్
తెలంగాణలో ఈ నెల 13 నుంచి వైద్య సిబ్బందికి రెండో విడత కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. గత నెల 16 నుంచి తొలి విడత డోస్ పొందిన వారికి వరుస క్రమంలో 28వ రోజున రెండో డోసు ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు కోవిన్ యాప్ లో పేర్లు నమోదు చేసుకొని, ఇప్పటివరకూ టీకా తీసుకోకుంటే శనివారం వేయించుకోవాలని.. తొలి డోసు తీసుకోవడానికి ఇదే ఆఖరి అవకాశమని అధికారులు …
Read More »భారత్ లో 30కోట్ల మందికి కరోనా
మొత్తం 135కోట్ల జనాభా ఉన్న ఇండియాలో సుమారు 30 కోట్ల మందికి కరోనా వ్యాపించి ఉండొచ్చని ICMR సర్వేలో తేలింది. వీరిలో చాలా మందికి కరోనా వచ్చి తగ్గిన విషయం కూడా తెలియకపోవచ్చని సెరోలాజికల్ సర్వేకు చెందిన ఓ అధికారి చెప్పారు. తగినంత రోగనిరోధక శక్తి ఉండటం వల్లే లక్షణాలు బయటపడట్లేదన్నారు. 2020 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 30 వేల మందిపై సర్వే నిర్వహిస్తే.. 15 మందికి ఒకరిలో కోవిడ్ …
Read More »ఏపీలో నేటి నుండి మలివిడత కరోనా టీకా పంపిణీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ మలివిడత కార్యక్రమం ఇవాళ మళ్లీ ప్రారంభం కానుంది. ఇవాల్టి నుంచి పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖల్లోని ఉద్యోగులకు టీకాలు ఇవ్వనున్నారు.. కోవిన్ యాప్ లో 5.90 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు తొలి విడతలో 3.88 లక్షల మంది ఆరోగ్య సిబ్బందిలో ఇప్పటివరకు 48.90శాతం మందికి టీకాలు పంపిణీ చేయగా.. 74 మందికి మాత్రమే దుష్ఫలితాలు వచ్చాయి
Read More »