ప్రధాని మోదీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి లేఖ రాశారు. మెడికల్ ఆక్సిజన్, రెమిడెసివిర్పై 28 నుంచి 12శాతానికి తగ్గించిన జీఎస్టీని సున్నా శాతం స్లాబ్లోకి తీసుకురావాలని కోరారు. అంబులెన్సులపై ఉన్న 28శాతం జీఎస్టీని కూడా పూర్తిగా తొలగించాలన్నారు. కరోనా తగ్గే వరకూ సున్నాశాతం స్లాబు కొనసాగించాలన్న ఆయన.. వెంటనే జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు.
Read More »ఏపీలో 20,065 కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్న వచ్చిన కేసులతో పోలిస్తే.. ఇవాళ కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో 1,01,571 టెస్టులు చేయగా 20,065 మందికి పాజిటివ్ వచ్చింది. నిన్న 96 మంది కరోనాతో చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 8,615కు చేరింది. గత 24 గంటల్లో 19,272 మంది కరోనాను జయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,87,392 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »ఆక్సిజన్ సిలిండర్లను అందించడానికి మేఘా ముందుకు
కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ఆసుపత్రుల్లో రోగులకు ఆక్సిజన్ అత్యవసరంగా మారింది. దాంతో సహజంగానే ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ పెరిగిపోయింది. ఉత్పత్తి సరైన స్థాయిలో లేకపోవడంతో ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా అవసరమైన మేరకు జరగడం లేదు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌లోని ప్రఖ్యాత నిమ్స్, అపోలో, సరోజినిదేవి వంటి ఆస్పత్రుల నుంచి మేఘా ఇంజినీరింగ్ సంస్థకు ఆక్సిజన్ అందించమని అభ్యర్థనలు వచ్చాయి.. వచ్చిందే తడవుగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఆక్సిజన్ సిలిండర్లను …
Read More »తెలంగాణలో రెండు వారాల్లోనే లక్షకు పైగా కేసులు
తెలంగాణలో కరోనా చాలా వేగంగా వ్యాపిస్తోంది.రాష్ట్రంలో గడచిన రెండు వారాల్లోనే లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా టెస్టుల నిర్వహణ మరో పెద్ద సమస్యగా మారింది. టెస్టులు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. కిట్ల కొరతే ఇందుకు కారణమని వైద్య, ఆరోగ్య శాఖ చెబుతోంది. దీంతో లక్షణాలున్న వారు పరీక్షలు చేయించుకోలేకపోతున్నారు. టెస్ట్ జరగకపోవడంతో అందరితో కలిసి ఉంటున్నారు.. దీంతో వైరస్ ఇతరులకు వ్యాపిస్తోంది.
Read More »18ఏళ్ల పైబడినవారికి ఎప్పుడంటే టీకా.?
తెలంగాణలో కొవిడ్ టీకాలలో రెండో డోసు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో.. 18ఏళ్లు దాటినవారు మరికొన్ని రోజులు ఆగాల్సివస్తోంది. ఈ నెల 15 వరకు స్లాట్ బుకింగ్ ఉండదని, తర్వాత పరిస్థితుల్ని బట్టీ నిర్ణయిస్తామని వైద్యారోగ్యశాఖ చెప్పింది. ఆర్డర్ చేసినన్ని డోసులు వస్తే 18ఏళ్ల వారికి టీకాలు ఇవ్వనున్నారు. ఇక నేటి నుంచి రెండో డోసు కోసం స్లాట్ బుకింగ్తో సంబంధం లేకుండా వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లవచ్చు.
Read More »తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల బెడ్స్ కోసం ప్రజలు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు
కరోనా రోజురోజుకు మరింత కర్కషంగా వ్యవహరిస్తున్నది. వైరస్ సోకినవాళ్లలో కొద్దిమంది రోజుల వ్యవధిలోనే దవాఖానల్లో చేరాల్సి వస్తున్నది. మెరుగైన చికిత్స, ఆక్సిజన్, వెంటిలేటర్ అవసరం అవుతున్నాయి. ఏ దవాఖానలో బెడ్స్ ఖాళీగా ఉన్నాయి ? ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడికివెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంటున్నది. ఈ నేపథ్యంలో బెడ్స్ కోసం ప్రజలు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు, వివరాలు ప్రభుత్వ దవాఖానలు టిమ్స్, గచ్చిబౌలి – 9494902900 గాంధీ హాస్పిటల్ – 9392249569, …
Read More »కరోనాను సులువుగా జయించడానికి 13 సూత్రాలు.
కరోనాను సులువుగా జయించడానికి 13 సూత్రాలు. 1. లక్షణాలు కనబడిన మొదటి రోజే హోమ్ ఐసోలేషన్ లో ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. 2. లక్షణాలు కనబడిన మొదటి రోజే ఒక డాక్టర్(online/offline) పర్యవేక్షణ లో ఉండండి. 3. లక్షణాలు కనబడిన రెండో రోజు RTPCR test ఇవ్వండి. దాని రిజల్ట్ గురించి ఆందోళన వద్దు. RTPCR లో పాజిటివ్ రాగానే కంగారు పడుతూ హాస్పిటల్స్ కి పరిగెత్తకండి. RTPCR లో …
Read More »కరోనా చికిత్సలో తొలి 5 రోజులు గోల్డెన్ టైం..
మీకు స్వల్ప జ్వరం ఉందా? కాస్త తలనొప్పి, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు కూడా ఉన్నాయా? వీటిలో ఏ ఒక్కటి ఉన్నా ఏమీ కాదులే అని లాపర్వా చేస్తున్నారా? తీరికలేని పని కారణంగా వచ్చాయని, ఎండలతో వచ్చాయని, విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని తేలిగ్గా తీసుకుంటున్నారా? మీకు మీరుగా తీసుకునే ఈ నిర్ణయాలే అటు తరిగి ఇటు తిరిగి చివరికి ప్రాణాలకే ముప్పుగా పరిణమించవచ్చు. అవును.. కరోనా చికత్సలో తొలి ఐదు …
Read More »దేశంలో 4,12,262 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో ఏకంగా 4,12,262 కేసులు, 3,980 మరణాలు నమోదయ్యాయి. ఫలితంగా దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,10,77,410కి చేరింది. మరణాల సంఖ్య 2,30,168కి పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,72,80,844 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 35,66,398 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »KYC అప్డేట్ పై ఆర్బీఐ కీలక ప్రకటన
అన్ని ప్రభుత్వ ప్రయివేట్ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వినియోగదారులు KYC అప్డేట్ తప్పనిసరిగా చేయాలని గతంలో RBI సూచించింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో 2021 డిసెంబర్ 31 వరకు కేవైసీ అప్డేట్ చేయడంలో విఫలమైన వినియోగదారులపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలను RBI తాజాగా కోరింది. దీంతో డిసెంబర్ 31 వరకు KYC అప్ డేట్ చేసుకోకపోయినా.. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
Read More »