వరంగల్ తూర్పు నియోజకవర్గం వ్యాపారాలకు కేరాఫ్ అడ్రస్..అదిక సంఖ్యలో వ్యాపారాలు చేస్తూ జీవిస్తారు..వ్యాపార సముదాయాల్లో సిబ్బంది,హమాలీలు,గుమస్తాలు తమ జీవనోపాది కోసం పనిచేస్తుంటారు..వారి సర్వీస్ ద్వారా ప్రజలకు ఎంతో సేవ చేస్తారు.. కరోనా బారిన పడేందుకు,వ్యాది వ్యాప్తి చెందేందుకు ఇక్కడ నుండి ఆస్కారం ఉంటుంది.. కరోనా నివారణ చర్యల్లో బాగంగా వారి ఆరోగ్యం,ప్రజల ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశ్యంతో వరంగల్ తూర్పు లోని వ్యాపార,వాణిజ్య,చాంబర్ ఆఫ్ కామర్స్,గుమస్తాలకు,సిబ్బందికి వాక్సినేషన్ ప్రక్రియను 28 వ …
Read More »తెలంగాణలో తగ్గని కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 2,070 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 18 మంది మహమ్మారికి బలయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 3,762 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,89,734కు చేరింది. ఇప్పటికీ 5,57,162 మంది కోలుకున్నారు. మొత్తం ఇప్పటివరకూ కరోనాతో 3,364 మంది చనిపోయారు. యాక్టివ్ కేసులు 29,208 ఉన్నాయి. ఒక్కరోజు వ్యవధిలో 1,38,182 టెస్టుల చేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
Read More »అమ్మ పెట్టదు, అడుక్కొనివ్వదు అన్న రీతిలో కేంద్రం వ్యవహారం
సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట బాలాజీ ఫంక్షన్ హాలులో శనివారం ఉదయం సిద్దిపేట జిల్లాలో హై రిస్క్ లకు కోవిడ్-19 వ్యాక్సినేషన్ టీకా కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు ప్రారంభించారు. ఈసందర్భంగా మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. మంత్రి శ్రీ హరీశ్ రావు కామెంట్స్: – వాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనాలోచిత, అసందర్భ, తప్పుడు నిర్ణయాలతో దేశ, తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. …
Read More »విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్
ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత వల్ల రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన సాధారణ యువతకు వ్యాక్సిన్ వేయట్లేదు. అయితే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మాత్రం వ్యాక్సినేషన్లో ప్రాధాన్యం ఇస్తామని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విదేశాలకు వెళ్లే వారికి టీకాలు ఇస్తే.. కరోనా బారిన పడకుండా సురక్షితంగా ప్రయాణం చేస్తారని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Read More »దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 1,52,734 కేసులు, 3,128 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,80,47,534కు పెరగ్గా, ఇప్పటివరకు 3,29,100 మంది కరోనా ధాటికి చనిపోయారు. మరో 2,38,022 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 2,56,92,342కు చేరింది. ప్రస్తుతం దేశంలో 20,26,092 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపు
కరోనా మహమ్మారి నివారణకు తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం విదితమే. నేటితో ముగియనున్న లాక్‌డౌన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నది. జూన్ 9వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ మంత్రివర్గం నిర్ణయించింది. నేటి వరకు రోజుకు 4 గంటలు మాత్రమే మినహాయింపు ఇవ్వగా, ఆ సమయాన్ని మరో మూడు గంటల పాటు పొడిగించారు. ఇక ప్రతీ …
Read More »ఆనందయ్య మందుపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
కరోనా వైరస్ ప్రస్తుతం విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ఏదైన అద్భుతం జరిగితే బాగుండు అని ప్రజలందరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆనందయ్య అనే పేరు అందరిలో ఓ ఆశను కలిగించిది. ఆనందయ్య వేస్తున్న మందు వలన చాలా మంది కోలుకుంటున్నారని అందరు కృష్ణపట్నంకు క్యూలు కట్టారు. అయితే దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు ఇది నాటు మందు …
Read More »రాజయ్య కుటుంబానికి మంత్రి కేటీఆర్ పరామర్శ
తెలంగాణలోని రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఇటీవల మృతి చెందిన ఎంఈవో మంకు రాజయ్య మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల పర్యటన సందర్భంగా మంత్రి రాజయ్య కుటుంబాన్ని పరామర్శించారు. రాజయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాజన్న చివరి శ్వాస వరకు విద్య కోసం పని చేశారని కొనియాడారు. ఇటీవలే ఎడ్యుకేషన్ సబ్ కమిటీ సమావేశం రోజు …
Read More »మోదీకి ఢిల్లీ సీఎం క్రేజీ ఫంచ్
దేశంలో వ్యాక్సినేషన్ కొరతపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం ఎందుకు టీకాలు కొనడం లేదని ప్రశ్నించారు. ఒకవేళ పాకిస్తాన్ దేశంపై దాడులు చేస్తే, రక్షించుకునే బాధ్యతను కూడా రాష్ట్రాలకే వదిలేస్తారా? సొంతంగా యుద్ధ ట్యాంకులు కొనుక్కోమని అంటారా? అంటూ మండిపడ్డారు. ఇతర దేశాల లాగా కాకుండా దేశంలో 6 నెలలు ఆలస్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని విమర్శించారు.
Read More »ఏపీలో కాస్త తగ్గిన కరోనా కేసులు
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 58,835 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 12,994 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి 96 మంది మృతి చెందారు. మరోవైపు కరోనా నుంచి కోలుకొని 18,373 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,03,762 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా గత 24 గంటల్లో తూర్పు గోదావరిలో అత్యధికంగా 2652 కేసులు రాగా.. అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 274 కేసులు నమోదయ్యాయి.
Read More »