Home / Tag Archives: carona (page 20)

Tag Archives: carona

తమిళనాడుకు పాకిన ఒమిక్రాన్

ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు వ్యాపించేలా కనిపిస్తోంది. తాజాగా తమిళనాడులో ఒమిక్రాన్ తొలి కేసు నమోదైంది. నైజీరియా నుంచి తిరిగి వచ్చిన 47 ఏళ్ల చెన్నై వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ వెల్లడించారు. మరోవైపు UKలో ఒమిక్రాన్ విజృంభిస్తోంది.ఇప్పటికే 10వేల కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 20వేల మంది ఈ వైరస్ బారిన పడ్డారు.

Read More »

యూకేలో తీవ్రం రూపం దాల్చిన కరోనా మహమ్మారి

యూకేలో కరోనా మహమ్మారి తీవ్రం రూపం దాల్చింది. ఇవాళ ఒక్కరోజే ఆ దేశంలో ఏకంగా 78,610 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి దేశంలో ఒకే రోజు ఇన్ని కేసులు రావడం ఇదే అత్యధికం. మరోవైపు కరోనా కారణంగా 165 మంది మరణించారు. ఇప్పటి వరకు యూకేలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,46,791కి చేరింది. ఇదిలా ఉండగా.. 10,017 ఓమిక్రాన్ వేరియంట్ కేసులతో దేశం …

Read More »

గవర్నర్ కు సీఎం జగన్ పరామర్శ

ఏపీలోని రాజ్ భవన్ కు రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ అధినేత, సీఎం జగన్ దంపతులు వెళ్లారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందను మర్యాదపూర్వకంగా కలిసారు. గవర్నర్ దంపతులు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నామని గవర్నర్ తెలిపారు. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సీఎం జగన్ ఈ సందర్భంగా గవర్నరు సూచించారు. కాగా గవర్నర్ దంపతులు కరోనా బారినపడి ఇటీవల కోలుకున్న సంగతి తెలిసిందే.

Read More »

దేశంలో కొత్తగా 7,974 కరోనా కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో 7,974 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. 343 మంది వైరస్లో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,76,478కి చేరింది. మరోవైపు తాజాగా 7,948 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,41,54,879గా ఉంది. ప్రస్తుతం దేశంలో 87,245 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 135.25 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.

Read More »

వెస్టిండీస్ జట్టులో కరోనా కలకలం

పాకిస్తాన్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టులో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే ముగ్గురు ప్లేయర్లకు కరోనా సోకగా తాజాగా మరో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. ప్లేయర్లు హోప్, హుసేన్, గ్రీప్తో పాటు అసిస్టెంట్ కోచ్, టీమ్ ఫిజీషియన్కు వైరస్ సోకిందని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అంతకుముందు కాట్రెల్, మేయర్స్, ఛేజ్కు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ టీంలో కరోనా సోకిన వారి సంఖ్య 8కి చేరింది.

Read More »

దేశంలో ఒమిక్రాన్ కలవరం

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో 4 ఒమిక్రాన్ కేసులు వచ్చినట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. దీంతో ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10కి చేరింది. కాగా ఒమిక్రాన్ వేరియంట్ సాధారణ కరోనా వైరస్ కంటే 70% వేగంగా వ్యాప్తి చెందుతుందని హాంగ్కాంగ్ చేసిన ఓ అధ్యయనం తెలిపింది.

Read More »

ఏపీలో కొత్తగా 132 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 29,228 కరోనా టెస్టులు చేయగా 132 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఒకరు మరణించారు. మొత్తం కేసులు సంఖ్య 20,75,108కు చేరగా ఇప్పటివరకు 14,468 మంది చనిపోయారు. గత 24 గంటల్లో 186 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,823 యాక్టివ్ కేసులున్నాయి.

Read More »

హీరో అర్జున్ కు కరోనా

క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ గుబులు పుట్టిస్తుంది. సామాన్యులే కాక సెల‌బ్రిటీలు సైతం క‌రోనా బారిన ప‌డుతున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్‌ బేబో, స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్ కి కరోనా సోకింది. కరీనాతోపాటు ఆమె స్నేహితురాలు అమృత అరోరాకి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్ర‌స్తుతం వారు క్వారంటైన్‌లో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం లోక‌నాయ‌కుడు కమల్ హాసన్ కరోనా బారిన ప‌డి కోలుకున్నారు. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ …

Read More »

దేశంలో కొత్తగా 7774 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 7774 కరోనా పాజిటివ్‌ కేసులు  నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,90,510కి చేరింది. ఇందులో 3,41,22,795 మంది కరోనా నుంచి కోలుకోగా, 92,281 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,75,434 మంది మహమ్మారికి బలయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో కొత్తగా 306 మంది మరణించగా, 8464 మంది కోలుకున్నారని తెలిపింది.దేశంలో యాక్టివ్‌ కేసులు 560 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయని పేర్కొంది. మొత్తం …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీలో మరో మైలురాయి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ మరో మైలురాయిని అధిగమించింది. గురువారం ఉదయం వరకు కరోనా వ్యాక్సినేషన్‌ 4 కోట్ల మార్కును దాటింది. ఇప్పటివరకు అర్హులైన 95 శాతం మందికి మొదటి డోసు పంపిణీ చేశారు. రెండో డోసు 50 శాతం పూర్తయిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి 16న కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభమయింది. అప్పటి నుంచి 165 రోజుల్లో కోటి డోసులను పంపిణీ చేశారు. వ్యాక్సినేషన్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat