మహమ్మారి కరోనా శరవేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రం మొత్తాన్ని చుట్టేసింది. జాగ్రత్తలెన్ని తీసుకున్నా ముప్పు ఏ మూల.. ఎవరి నుంచి వస్తుందో..? తెలియక ప్రజలు కలవరపడుతున్నారు. భయం భయంగా జీవనం సాగిస్తున్నారు. సామాన్య జనం.. ఉద్యోగులు.. ప్రజాప్రతినిధులు.. రాజకీయ నాయకులు.. ఎవ్వరూ కరోనాకు అతీతులు కారు. అందరిపై దాడి చేస్తోంది. ఇప్పుడు టీఆర్‌ఎస్ కేబినెట్‌ను కరోనా వణికిస్తోంది. హోం మంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా సోకిన విషయం …
Read More »తెలంగాణలో వరుసగా మూడో రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరగుతున్నాయి.. వరుసగా మూడో రోజు 2వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 77,513కు చేరుకుంది. కరోనా నుంచి కొత్తగా 1091 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య …
Read More »మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కరోనా
తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా ఎల్‌బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన కుటుంబసభ్యులకు, పనిమనిషికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఎమ్మెల్యే భార్య, ఇద్దరు కొడుకులు, వంటమనిషికి కరోనా సోకినట్టు అధికారులు నిర్ధారించారు. వైద్యుల సలహా మేరకు ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్‌లో ఉన్నారు
Read More »కరోనా వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్ చెప్పిన రష్యా
కరోనా వ్యాక్సిన్‌పై జరుగుతున్న పరిశోధనల్లో రష్యా గొప్ప పురోగతి సాధించింది. ఈ నెల 12న వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఓలెగ్ గృందేవ్ ప్రకటించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆ రోజు జరగనుందని తెలిపారు. దీంతో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తున్న తొలి దేశంగా రష్యా చరిత్ర సృష్టించనుంది. గామలేయా సెంటర్‌లో దీనికి సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయని, మూడో దశలో ఉందని తెలిపారు. ముందుగా వైద్య వృత్తిలో …
Read More »కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూశారు. జూలై 29న అనారోగ్యంతో నిమ్స్‌లో చేరిన నంది ఎల్లయ్య.. శనివారం ఉదయం 10.30 గంటలకు తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధ పడుతూ నిమ్స్‌లో చేరగా పరీక్షల అనంతరం కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. 10 రోజుల పాటు చికిత్స అనంతరం మృతి చెందారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. నంది ఎల్లయ్య లోక్‌సభ ఎంపీగా ఆరు సార్లు గెలుపొందారు. …
Read More »తెలంగాణలో 75వేలు దాటిన కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 2,207 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 75,257కు చేరింది. కరోనా నుంచి కొత్తగా 1136 మంది పూర్తిగా కోలుకున్నారు .. డిశ్చార్జి అయినవారి సంఖ్య 53,239గా ఉంది. గత 24 గంటల్లో కరోనాతో 12 మంది మృతి చెందడంతో.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 601కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,417 …
Read More »20లక్షలు దాటిన కరోనా కేసులు!
భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం రికార్డుస్థాయిలో కొవిడ్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే అత్యధికంగా 62,498 కేసులు నమోదయ్యాయి. భారత్లో ఒక్కరోజులోనే 60వేల కేసులు దాటడం ఇదే తొలిసారి. అంతకుముందు జులై 31న అత్యధికంగా 57,151 కేసులు బయటపడ్డాయి. దీంతో శుక్రవారం నాటికి దేశంలో మొత్తం కరోనా కేసులసంఖ్య 20,27,034కు చేరింది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 13లక్షల 78వేల మంది కోలుకోగా, మరో 6లక్షల …
Read More »ఆంధ్రజ్యోతికి ఛాలెంజ్ విసిరిన సీఎంఓ కార్యాలయం
ఆంధ్రజ్యోతికి ఛాలెంజ్ విసిరిన సీఎంఓ కార్యాలయం ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాయడం, ప్రజలను మభ్యపెట్టడం, టీడీపీకి వంతపాడటం.. కొన్ని మీడియా సంస్థలకు ఇది నిత్యకృత్యంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. వాస్తవాలు మరుగున పెట్టినా పర్వాలేదు కానీ, కుట్రపూరితంగా అవాస్తవాలు ప్రచారం చేయడం మాత్రం నిజంగా శిక్షార్హమే. తాజాగా ఇలాంటి తప్పుడు కథనాల్ని ప్రచారం చేస్తున్న ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఛానెల్ పై సీఎంఓ అధికారులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓపెన్ ఛాలెంజ్ …
Read More »కరోనాపై మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వర్ … ఎనాలసిస్
ఇంతటితో ప్రపంచం అంతం అవుతుందని అనుకోవడం సరికాదు. WHO అభిప్రాయం లో కోవిడ్ -19 వైరస్ సోకిన వారిలో 3-4% మాత్రమే మృత్యువాత పడుతున్నారు. కొన్నిదేశాలలోఈ శాతం కొంచెం ఎక్కువుగా ఉండవచ్చు.చార్లెస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం కొత్తగా పుట్టే జీవులు ఇంతకముందే వున్న జీవుల తగ్గుదల కు లేదా అంతానికి కారణం కావచ్చు. ఇది ప్రకృతిలో సాధారణం. మనుషుల వల్ల ఇప్పటికే చాలా జీవజాతులు అంతరించిపోయాయి. వైరల్ …
Read More »2.2 కోట్ల మందికి కరోనా పరీక్షలు
దేశంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రోజువారీ కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యం పెంచాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,21,49,351 మందికి కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) గురువారం ట్విట్టర్లో తెలిపింది. బుధవారం ఒక్కరోజే 6,64,949 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. ఇదిలాఉండగా దేశంలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు వేలల్లో పెరుగున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 56,282 పాజిటివ్ కేసులు నమోదు కాగా …
Read More »