కరోనా చికిత్స కోసం ‘కొవిఫర్’ ఔషధాన్ని ఆవిష్కరించిన హెటిరో సంస్థ తాజాగా దాని ధరను ప్రకటించింది. 100 మిల్లీ గ్రాముల వయల్ ధరను రూ.5,400 (దాదాపు 71 డాలర్లు)గా నిర్ణయించింది. మొదటివిడుతగా 20వేల వయల్స్‌ను అందుబాటులోకి తేనున్నట్టు తెలిపింది. ఇందులో తొలిబ్యాచ్‌లో 10వేల వయల్స్, తర్వాతి బ్యాచ్‌లో మరో 10వేల వయల్స్‌ను పంపిణీ చేయనుంది. తొలి 10వేల వయల్స్‌ను హైదరాబాద్‌తోపాటు కరోనా తీవ్రత అధికంగా ఉన్న తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, …
Read More »తెలంగాణలో కొత్తగా 920 మందికి కరోనా
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 3,616 మందికి పరీక్షలు చేయగా 920 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 11,364కి చేరింది. ఇందులో 6,446 మంది వివిధ ఆస్పత్రులు, హోంక్వారంటైన్‌లలో చికిత్స పొందుతుండగా.. 4,688 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గురువారం కరోనాతో ఐదుగురు మరణించగా.. …
Read More »కరోనా నుండి మనల్ని రక్షించుకోవాలంటే అదోక్కటే మార్గం…?
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సంగతి విదితమే.అయితే కరోనా నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి నీతి ఆయోగ్ కొన్ని సూచనలను చేసింది. రోగ నిర్ధారణ పరీక్షలతోనే కరోనా కట్టడి సాధ్యమని స్పష్టం చేసింది.కరోనాపై గెలిచిన దేశాలు అనుసరించిన విధానలపై నీతి ఆయోగ్ అధ్యయనం చేసింది. 3టీ(టెస్టింగ్,ట్రేసింగ్,ట్రీట్మెంట్)ఫార్ములాను పాటించాలని సూచించింది.కరోనా ఎదుర్కుని జీవించాలంటే పరీక్షల సంఖ్యను పెంచాలని కేంద్రానికి సూచించింది..
Read More »తెలంగాణలో ఏ జిల్లాలో ఎన్ని కేసులు
తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగంటల్లో 920కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.వీటిలో ఒక్క జీహెచ్ఎంసీలోనే 737 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 86,మేడ్చల్ లో 60కేసులోచ్చాయి.కరీంనగర్ లో 13,రాజన్న సిరిసిల్లలో 4,మహబూబ్ నగర్,నల్లగొండలో 3కేసులు నమోదయ్యాయి. ములుగు,వరంగల్ అర్భన్,మెదక్ జిల్లాలో 2కేసుల చొప్పున నమోదయ్యాయి. వరంగల్ రూరల్,జనగాం ,కామారెడ్డి,సిద్దిపేట,మహబూబాబాద్,అసిఫాబాద్,ఆదిలాబాద్,వికారాబాద్ జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదైంది.
Read More »కరోనా పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా చేపట్టిన కరోనా శాంపిళ్ల సేకరణకు రెండు రోజుల విరామం ప్రకటించారు. ఇప్పటివరకు స్వీకరించిన శాంపిళ్లకు సంబం ధించి అన్ని ఫలితాలు ప్రకటించిన తర్వాతే మళ్లీ నమూనాలు స్వీకరించా లని నిర్ణయించినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇందుకోసం రెండు రోజులపాటు కరోనా శాంపిళ్ల స్వీకరణకు విరామం ఇచ్చామని.. అయితే, కరోనా లక్షణాలు ఉన్నవారికి ఆస్పత్రుల్లో పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని, ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందొద్దని …
Read More »ఐదు రాష్ట్రాలకు తొలి బ్యాచ్ కరోనా ఇంజక్షన్
ఇంజక్షన్ తొలి బ్యాచ్‌ను ఐదు రాష్ట్రాలకు సరాఫరా చేసినట్లు హెటిరో సంస్థ తెలిపింది. హైదరాబాద్ కేంద్రంగా ఔషధాలను తయారు చేస్తున్న ఈ సంస్థ రెమ్డీస్వీర్ జనరిక్ మందును ఇంజక్షన్ రూపంలో తీసుకొస్తున్నది. కోవిఫర్ బ్రాండ్ పేరుతో తొలి బ్యాచ్‌గా తయారు చేసిన 20 వేల ఇంజక్షన్లను తెలంగాణలోని హైదరాబాద్‌తోపాటు కరోనాతో ప్రభావితమైన మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. మరో మూడు, నాలుగు …
Read More »దేశంలో కరోనా సరికొత్త రికార్డు నమోదు
భారత్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. కొత్త కేసుల నమోదులో ఎప్పటికప్పుడు పాత రికార్డులను చెరిపేస్తూ బెంబేలెత్తిస్తోంది. తాజాగా దేశంలో 24 గంటల్లో ఏకంగా 15,968 మంది కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులివే. దేశవ్యాప్తంగా మరణాల ఉద్ధృతి కూడా పెరుగుతోంది. తాజాగా 24 గంటల్లో 465 మంది ప్రాణాలను ఈ వైరస్ బలి తీసుకుంది. ఆది నుంచీ కరోనా ధాటికి వణికిపోతున్న మహారాష్ట్రలో …
Read More »ఏపీలో కొత్తగా 448 కరోనా కేసులు
ఏపీలో కరోనా పరీక్షలు రోజురోజుకు పెరుగుతున్నాయి .అదే సమయంలో కరోనా పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి.మరణాలు కూడా అదికం అవుతున్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో 36,047 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 448 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 37 మందికి, విదేశాల నుంచి వచ్చిన 12 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కరోనా బారిన పడి ఈ రోజు 10 …
Read More »తెలంగాణలో కొత్తగా 891కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు 891. ఇప్పటి వరకు 10444 పాజిటివ్ కేసులు. ఇప్పటి వరకు మృతి చెందిన వారు 225 మంది. డిశ్చార్జ్ అయినవారు 4361 మంది. యాక్టివ్ కేసుల సంఖ్య 5858
Read More »దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది.తాజాగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మొత్తం 15,968కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4,56,183కి చేరుకుంది.ఒక్క మంగళవారమే 465మంది కరోనాతో ప్రాణాలను విడిచారు.ఇప్పటివరకు 14,476మంది కరోనాతో మృతి చెందారు. మరోవైపు ఇరవై నాలుగు గంటల్లో 10,495మంది కరోనా నుండి కోలుకున్నారు.మొత్తం 2,58,685మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.1,83,022మంది చికిత్స పొందుతున్నారు..
Read More »