దేశంలో కరోనా వైరస్ కొద్దిగా శాంతించినట్లు కన్పిస్తున్నది. కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. నిన్న 63 వేల పాజిటివ్ కేసులు నమోదవగా, నేడు 62 వేల మందికి కరోనా సోకింది. అదేవిధంగా చాలా రోజుల తర్వాత యాక్టివ్ కేసులు 7 లక్షలకు దిగివచ్చాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 62,212 కరోనా పాటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య …
Read More »కరోనాను ఎదుర్కోవడంలో దక్షిణాది రాష్ర్టాలలోకెల్లా తెలంగాణ టాప్
కొవిడ్‌ను ఎదుర్కోవడంలో దక్షిణాది రాష్ర్టాలలోకెల్లా తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన పనితీరును కనబరిచిందని ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ), ఆస్కి (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా), ఎఫ్‌టీసీసీఐ (ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండ స్ట్రీ) పేర్కొన్నాయి. వైరస్ సోకినవారిని గుర్తించడం, వ్యాధి విస్తరణను నియంత్రించడం, బాధితులకు చికిత్స అందించడంలో దక్షిణాదిలోని ఐదు రాష్ర్టాలకన్నా తెలంగాణ మొదటిస్థానంలో నిలిచిందని …
Read More »డిసెంబరు నాటికి కరోనా కేసులు 4రెట్లు
తెలంగాణ రాష్ట్రంలో రోజుకు దాదాపు 50 శాతం మేర కరోనా పాజిటివ్ కేసులు రిపోర్టు కావడం లేదని, కరోనా లక్షణాలున్నప్పటికీ భయంతో పరీక్షలు చేయించుకునేందుకు జనం ముందుకు రావడం లేదని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ఆస్కీ) సంస్థ అధ్యయనంలో తేలింది. మిగతారాష్ట్రాలతో పొల్చితే రాష్ట్రంలో కరోనా వృద్ధిరేటు తగ్గుతోందని ఆస్కీ తెలిపింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ఆస్కీ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ సుబోధ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సశ్వాత్ …
Read More »తెలంగాణలో కరోనా బాధితుల రికవరీ రేటు 88.45%
తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల రికవరీ రేటు రోజురోజుకూ పెరుగుతున్నది. సోమవారం 88.15 శాతం రికవరీ రేటు ఉండగా, మంగళవారానికి 88.45 శాతానికి పెరిగింది. దేశంలో రికవరీ రేటు 87 శాతంగా నమోదైందని వైద్యారోగ్యశాఖ బుధవారం విడుదలచేసిన బులెటిన్‌లో పేర్కొన్నది. ఇప్పటివరకు మొత్తం 36.64 లక్షల వైరస్ నిర్ధారణ పరీక్షలు పూర్తిచేయగా, 2.16 లక్షల మందికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో 1.91 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 23,728 మంది …
Read More »సెల్ఫ్ క్వారెంటైన్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి వెళ్లారు. రానున్న అయిదు రోజుల పాటు తాను క్వారెంటైన్లో ఉండనున్నట్లు ఆమె ఇవాళ తన ట్విట్టర్లో వెల్లడించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్ తేలడం వల్ల .. తాను క్వారెంటైన్‌లోకి వెళ్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఎన్నికైన కవితను నిన్న ఎమ్మెల్యే సంజయ్ విషెస్ చెప్పేందుకు కలిశారు. తనతో ప్రైమరీ కాంటాక్ట్‌లోకి వచ్చినవారందరూ హోమ్ …
Read More »ఏపీలో తగ్గిన కరోనా కేసులు
ఏపీలో గడిచిన ఇరవై నాలుగంటల్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి.గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 3,224కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,58,951కి చేరింది. ఇందులో 43,983యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. మొత్తం 7,08,712మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే నిన్న ఒక్కరోజులోనే ముప్పై రెండు మంది మృతి చెందారు.దీంతో మొత్తం మృతుల సంఖ్య 6256కి చేరింది.
Read More »మీరు మాస్కులు వాడుతున్నారా..?అయితే జాగ్రత్త..?
మీరు మాస్కులు వాడుతున్నారా..?. అసలుమాస్కు లేకుండా బయటకు వెళ్లడం లేదా..?. కరోనా నుండి కాపాడుకోవాలని మాస్కులను జాగ్రత్తగా వాడుతున్నారా..? అయితే ఈ వార్త ఖచ్చితంగా మీకోసమే. ప్రస్తుతం కరోనా మహమ్మారి నుండి తమను తాము కాపాడుకోవడం కోసం రకరకాల మాస్కులను వాడుతున్నారు. అయితే చాలా మంది వస్త్రంతో తయారు చేసిన మాస్కులను ప్రస్తుతం వాడుతున్నారు. ఈ వస్త్ర మాస్కులను వాష్ చేయకుండా పదే పదే వినియోగిస్తున్నారు. అయితే దీనివలన ప్రమాదం …
Read More »బీజేపీ మంత్రి మృతి
ప్రస్తుతం దేశంలో కరోనా మమ్మారి విజృంభిస్తున్న సంగతి విదితమే. ప్రతి రోజు సుమారు డెబ్బై వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్న వార్తలను మనం చూస్తూనే ఉన్నాము. తాజాగా బీహార్ కి చెందిన మంత్రి,బీజేపీనేత వినోద్ కుమార్ మృతి చెందారు. అయితే గత జూన్ నెలలో కరోనా బారిన పడిన ఆయన కోలుకున్నారు. నెలన్నర తర్వాత అనారోగ్యం బారిన పడిన ఆయన దేశ రాజధాని ఢిల్లీలోని మెదంత ఆసుపత్రిలో చేరారు. …
Read More »తెలంగాణలో కొత్తగా 1,021 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,021 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఆరుగురు మృతి చెందారు. తెలంగాణలో కరోనా కేసులు 2,13,084కి చేరుకుంది. అయితే కరోనా కారణంగా ఇప్పటి వరకూ 1,228 మంది మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 24,514 యాక్టివ్ కేసులుండగా.. 1,87,342 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు తెలంగాణలో 35.77 లక్షల కరోనా టెస్టులను నిర్వహించారు. జీహెచ్ఎంసీ 228, మేడ్చల్ 84, రంగారెడ్డి 68 …
Read More »ఏపీలో కొత్తగా నమోదైన 5,653 కరోనా కేసులు
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం 5 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నారు. గడచిన 24 గంటల వ్యవధిలో ఆ రాష్ట్రంలో కొత్తగా 5,653 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ వైరస్ బారినపడిన వారిలో మరో 35 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,50,517 మంది కరోనా బారినపడగా 6,97,699 మంది కోలుకున్నారు. మరో 46,624 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు …
Read More »