తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. జూన్ 2న నాగోల్ బండ్లగూడలో బీజేపీ ఆధ్వర్యంలో ‘అమరుల యాదిలో’ సభను నిర్వహించారు. ఈ సభలో కేసీఆర్, ప్రభుత్వ పథకాలను కించపరుస్తూ ఓ స్కిట్ వేశారు. ఈ వ్యవహారంలో బీజేపీ నేతలు రాణిరుద్రమ, దరువు ఎల్లన్నను పోలీసులు అరెస్ట్ చేయగా.. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి …
Read More »మంత్రులు, ఎంపీలతో కేసీఆర్ కీలక భేటీ..
రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరుగుతోంది. రాష్ట్రంలో తాజా పరిణామాలు, పాలన. రాజకీయ పరమైన అంశాలపై నేతలతో సీఎం చర్చిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై నేతల అభిప్రాయాలను కేసీఆర్ తెలుసుకుంటున్నట్లు సమాచారం.
Read More »దాంతో తెలంగాణకు కేంద్రం పెద్ద దెబ్బ కొట్టింది: కేటీఆర్
ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గతంలో హామీ ఇచ్చారని.. అది ఏమైందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిలదీశారు. ఈ మేరకు ప్రధానికి ఆయన లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 16లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 1.32లక్షల జాబ్స్ భర్తీ చేసిందని.. త్వరలో మరో లక్ష చేస్తుందని చెప్పారు. ప్రైవేట్ …
Read More »నిఖత్ జరీన్, ఇషా సింగ్‌కు కేసీఆర్ భారీ నజరానా
వరల్డ్ ఉమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు సీఎం కేసీఆర్ భారీ నజరానా ప్రకటించారు. ఆమెతో పాటు ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించిన ఇషా సింగ్‌కు కూడా నజరానా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరికీ చెరో రూ.2కోట్ల చొప్పున నగదు.. జూబ్లీహిల్స్ లేదా బంజారాహిల్స్‌లో ఇంటి లం కేటాయించాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.
Read More »ఆరోజు నుంచే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి..: మంత్రి మల్లారెడ్డి
రానున్న దసరా రోజు నుంచి దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ వెళ్తారని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. ఆయనకు ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు. దసరా రోజున వరంగల్‌లని భద్రకాళి అమ్మవారికి పూజలు చేసి నేషనల్ పాలిటిక్స్‌లో కేసీఆర్ అడుగుపెడతారని చెప్పారు. హనుమకొండ జిల్లా కాజీపేటలో నిర్వహించి కార్మిక సదస్సులో మల్లారెడ్డి మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఉండగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు పథకాన్ని …
Read More »తెలంగాణలో ఆలయాలకు మహర్దశ
తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలో సీతారాంపురం కాలనీలో రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవస్థానం (గీతా మందిర్) ప్రతిష్ట కార్యక్రమ కరపత్రాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం లక్షరూపాయల విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేసారు. అనంతరం భాస్కర్ రావు మాట్లాడారు. సనాతన హిందూ ధర్మరక్ష పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని …
Read More »మోదీజీ.. ఇది గుజరాత్ కాదు.. పోరాటాల గడ్డ తెలంగాణ: హరీశ్‌రావు
తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ప్రధాని నరేంద్రమోడీకి లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన 8 ఏళ్లలో రాష్ట్రానికి ఇచ్చిందేంటో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పర్యటనో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రధాని విమర్శలు చేసిన నేపథ్యంలో హరీశ్‌రావు స్పందించారు. సిద్దిపేటలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ ఆ పార్టీ నేతలు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ …
Read More »రెండు మూడు నెలల్లోనే సంచలన వార్త వింటారు: కేసీఆర్
కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశంలో ఎవరూ సంతోషంగా లేరని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికే సాగునీరు, తాగునీరు, విద్యుత్ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని చెప్పారు. బెంగళూరులో జనతాదళ్ (ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో ఆయన భేటీ అయ్యారు. వారి నివాసంలో మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత వివిధ …
Read More »తెలంగాణలో అధికారంలోకి వస్తాం: ప్రధాని మోడీ ధీమా
కుటుంబ పార్టీలను తరిమికొడితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. హైదరాబాద్‌లోని ఐఎస్‌బీ వార్షికోత్సవానికి వచ్చిన ఆయన.. బేగంపేట ఎయిర్‌పోర్టు సమీపంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో వేలమంది అమరులయ్యారని.. వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు చెప్పారు. అమరవీరుల ఆశయాలు నెరవేరడం లేదని.. కుటుంబపాలనలో తెలంగాణ బందీ అయిందని మోడీ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ హవా కనిపిస్తోందని.. అధికారంలోకి వచ్చితీరుతామని ఆయన ధీమా …
Read More »టీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీగా వద్దిరాజు రవిచంద్ర ఎన్నిక ఏకగ్రీవం
టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. బండ ప్రకాష్ రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా రవిచంద్రను ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాజ్యసభ స్థానం గెలుపొందేందుకు పూర్తిస్థాయిలో మెజార్టీ టీఆర్‌ఎస్ పార్టీకి ఉంది. దీంతో మిగతా పార్టీలు అభ్యర్థిని నిలబెట్టలేదు. ఈ నేపథ్యంలో వద్దిరాజు రవిచంద్ర ఒక్కరే నామినేషన్ వేయడంతో …
Read More »