‘తెలంగాణకు హరితహారం’ నాలుగో విడత కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బుధవారం తన సొంత నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్ లో మొక్కలు నాటుతారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఒకే రోజు లక్షా నూటా పదహారు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. ములుగు సమీపంలో రాజీవ్ రహదారిపై ఒక చోట, గజ్వేల్ పట్టణ పరిధిలో రెండు చోట్ల మొక్కలు నాటుతారు. ప్రజ్ఞాపూర్ చౌరస్తాకు సమీపంలో ఒకటి, …
Read More »జెన్ కో – ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావును అభినందించిన సీఎం కేసీఆర్
10,000 మెగావాట్ల రికార్డు డిమాండ్ దాటిన సందర్భంగా జెన్ కో – ట్రాన్స్ కో సిఎండి డి. ప్రభాకర్ రావును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభినందించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం ఉదయం 10,429 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ఏర్పడి, కొత్త రికార్డు నమోదైంది. గరిష్ట డిమాండ్ నమోదైనా రాష్ట్రంలో ఎక్కడా ఒక్క నిమిషం కూడా విద్యుత్ కోత విధించకుండా సమర్థవంతంగా సరఫరా …
Read More »మాట ఇస్తే నిలబెట్టుకునేది టీఆర్ఎస్ ప్రభుత్వం
మాట ఇస్తే నిలబెట్టుకునేది ఈ తెలంగాణ ప్రభుత్వమని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో పేదలకు నాణ్యమైన విద్యను అందించడానికి గురుకుల విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తున్నామన్నారు. ఈ రోజు వరంగల్ రూరల్ జిల్లా, నెక్కొండలో గురుకుల పాఠశాలను జూనియర్ కాలేజీగా అప్ గ్రేడ్ చేసి, అక్కడ విద్యార్థినిల వసతి కోసం నిర్మించిన డార్మెట్రీని ప్రారంభించారు. అనంతరం విద్యార్థినిలకు జూనియర్ ఇంటర్ …
Read More »ముల్కనూర్ లైబ్రరీ దేశానికే మోడల్ లైబ్రరీ కావాలి
ముల్కనూరు గ్రామం సహకార ఉద్యమానికి పెట్టింది పేరని…ఈ స్పూర్తితో ఈ లైబ్రరీ కూడా దేశానికి మోడల్ లైబ్రరీగా అభివృద్ధి చేయాలని ఉపముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. ముల్కనూర్ ప్రజా గ్రంథాలయాన్ని పూర్తి చేసేందుకు తన ఎమ్మెల్సీ నిధుల నుంచి 15 లక్షల రూపాయలను ఇస్తున్నట్లు ప్రకటించారు. నేడు ముల్కనూర్ లో నిర్మించిన ఫిష్ మార్కెట్, షాపింగ్ కాంప్లెక్సు, ప్రజా గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ …
Read More »పర్యాటక కేంద్రంగా షామీర్ పేట..!!
హైదరాబాద్ – కరీంనగర్ రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న షామీర్ పేట చెరువు, దాని పరిసర ప్రాంతాలను మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. చెరువు 365 రోజుల పాటు నీళ్లతో నిండి ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని, పర్యాటకుల ఆహ్లాదం, ఆనందం కోసం ఏర్పాట్లు చేయాలని చెప్పారు. నెలరోజుల్లోగా షామీర్ పేటను పర్యాటక కేంద్రంగా మార్చే ప్రణాళిక రూపొందించి, పూర్తి నివేదిక …
Read More »దివ్యాంగులకు అండగా కేసీఆర్ ప్రభుత్వం.
తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందరికీ చేరాలన్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ కల నెరవేరుతోంది. అంగవైకల్యం అభివృద్ధికి అవరోధం కావద్దు అని దివ్యాంగుల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. డిగ్రీ చదువుతున్న దివ్యాంగుల కోసం వారికి మరింత ప్రోత్సాహాన్ని అందించడానికి వారికి అవసరమైన ల్యాప్ టాపులు, స్మార్ట్ ఫోన్లు, ప్రత్యేక స్కూటర్లు ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వికలాంగుల కార్పొరేషన్ …
Read More »ఐదు లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దేశాలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా మరో బృహత్తర పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో దేశం మొత్తంలో తెలంగాణ శభాష్ అనిపించుకుని, ఇప్పుడు ఈ పథకాన్ని కాలేజీ విద్యార్థులకు కూడా వర్తింపజేయడానికి సిద్దమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మధ్యాహ్న భోజన …
Read More »ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసీఫాబాద్ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్..!!
ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసీఫాబాద్ జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హమీ మేరకు 18 కొత్త చెరువులకు ఇవాళ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. 4539 ఎకరాలకు ఈ కొత్త చెరువుల ద్వారా నీరందనుంది. ఈ 18 కొత్త చెరువుల స్టేజ్ -1 అనుమతుల కోసం 23.42 కోట్లు మంజూరు చేసింది. స్టేజ్ -1 అనుమతుల్లో భాగంగా ఈ కొత్త …
Read More »గ్రామాలను గొప్పగా తీర్చిదిద్దాలి..సీఎం కేసీఆర్ పిలుపు
ఆగస్టు 2 నుంచి రాష్ట్రంలో కొత్త గ్రామ పంచాయితీలు మనుగడలోకి వస్తున్నసందర్భాన్ని మంచి అవకాశంగా తీసుకుని గ్రామాలను గొప్పగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలని, గ్రామాలు అభివృద్ది చెందితే దేశం, రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అన్నారు. అన్ని గ్రామ పంచాయితీలకు పర్సన్ ఇన్‌చార్జులు వస్తున్నారని, ప్రతీ గ్రామానికి ఒక గ్రామ కార్యదర్శి ఖచ్చితంగా ఉండే విధంగా కొత్తగా నియామకాలు చేస్తున్నామని వెల్లడించారు. పర్సన్ …
Read More »సీఎం కేసీఆర్ కలకు..పారిశ్రామిక రంగం మద్దతు
పర్యావరణ రక్షణకు, మెరుగైన జీవన విధానం కోసం తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన అన్ని కార్యాక్రమాలకు మద్దతు పెరుగుతోంది. హరితహారం పేరుతో ఆకుపచ్చ తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి పెటాప్సీ గవర్నింగ్ బాడీ ప్రతినిధులు తమ సంపూర్ణ మద్దుతు ప్రకటించారు. పరిశ్రమల ద్వారా వాణిజ్యం చేస్తున్న తాము సమాజం నుంచి మేలుపొందామని ఇప్పుడు అదే సమాజానికి సామాజిక బాధ్యతలో భాగంగా తోడ్పాటునందిస్తామని వెల్లడించారు. నాలుగో విడత హరితహారంపై అరణ్య …
Read More »