Home / CRIME / అమ్మాయి నిండు ప్రాణాల‌ను  బ‌లిగొన్న‌వాట్సాప్ స్టేట‌స్

అమ్మాయి నిండు ప్రాణాల‌ను  బ‌లిగొన్న‌వాట్సాప్ స్టేట‌స్

ఓ ఫ్రెండ్ వాట్సాప్ స్టేట‌స్ ఒక అమ్మాయి నిండు ప్రాణాల‌ను  బ‌లిగొన్న‌ది. ఈ ఘ‌ట‌న తాండూర్ మండలం అచ్చలాపూర్ లోని కొమ్ముగూడెంలో బుధ‌వారం అర్ధ‌రాత్రి చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.వివ‌రాల్లోకి వెళ్తే.. కొమ్ముగూడెంకు చెందిన‌ గంధం రాజ‌య్య కూతురు లత(17) హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఉగాది పండుగ‌కు ల‌త ఇంటికొచ్చింది.

అయితే అదే గ్రామానికి చెందిన అజయ్ అనే యువకుడు లతతో దిగిన‌ ఫోటోలను బుధ‌వారం వాట్సాప్ స్టేటస్ లో పెట్టాడు. ఇది తెలుసుకున్న లత తల్లిదండ్రులు ఆ ఫోటోల‌ను స్టేట‌స్ నుంచి తొల‌గించాల‌ని అజ‌య్‌ను కోరారు. అత‌ను వినిపించుకోలేదు. పైగా ఆ అమ్మాయి త‌ల్లిదండ్రుల‌ను వేధింపుల‌కు గురి చేశాడు.

ఈ క్ర‌మంలో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన ల‌త బుధ‌వారం అర్ధ‌రాత్రి ఇంట్లోనే పురుగుల మందు తాగింది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన త‌ల్లిదండ్రులు ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లిచంగా, అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అజ‌య్‌పై ల‌త తండ్రి రాజయ్య పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat