హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో ఐటీ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆ ప్రాంతంలో రవాణా, ఇతర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో నైట్ ఫ్రాంక్ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నైట్ ఫ్రాంక్ హైదరాబాద్ స్పెషల్ రిపోర్టును కూడా మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్‌తో పాటు నైట్ ఫ్రాంక్ ఇండియా …
Read More »మోహిదీపట్నం స్కైవాక్‌కు మంత్రి కేటీఆర్ ఆమోదం
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. ఈ క్రమంలో హైదరాబాద్‌ను అద్భుతంగా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే దుర్గం చెరువును సుందరంగా తీర్చిదిద్దారు. అక్కడ నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నగరానికి మణిహారంలా మారింది. ఇప్పుడు అలాంటి మరో స్టీల్ వంతెనను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మెహిదీపట్నం వద్ద పాదాచారుల కోసం స్కై వాక్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. …
Read More »ఏక్షణంలోనైన జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు సంబంధించి తుది ఓటరు జాబితా ఈ నెల 13న రానుంది నవంబర్ 13 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారధి తెలిపారు. జీహెచ్ఎంసీ లో 150 వార్డులు, 30 సర్కిళ్లు ఉన్నాయని.. ప్రతీ సర్కిల్ కు ఒక డిప్యూటీ కమిషనర్ ఉన్నారు. 150 డివిజన్లకు 150 మంది ROలను …
Read More »టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నేత రావుల శ్రీధర్ రెడ్డి
టీఆర్ఎస్ పార్టీలో మరో బీజేపీ సీనియర్ నాయకుడు చేరారు. తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీజేపీ నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి గులాబీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన శ్రీధర్ రెడ్డితో పాటు వందలాది మంది బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ …
Read More »జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 104 సీట్లు గెలుస్తాం
త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మొత్తం150 సీట్లలో.. 104 సీట్లలో విజయం సాధిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రతిఒక్కరినీ తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. బాధితులందరికీ పరిహారం అందుతుందని భరోసా ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా …
Read More »తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు మంత్రి హరీష్ దిమ్మతిరిగే షాక్
బీడీ కార్మికులకు ఇచ్చే రూ.2వేల పింఛన్‌లో కేంద్రప్రభుత్వమే రూ.1,600 ఇస్తున్నదంటూ కమలనాథులు గోబెల్స్‌ను మించి ప్రచారం చేస్తున్నారని ఆర్థికమంత్రి టీ హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రప్రభుత్వం అందించే పింఛన్లతోపాటు, కేసీఆర్ కిట్లకిచ్చే డబ్బంతా కేంద్రానిదే అన్నట్టు వారు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దుబ్బాకలో ఎన్నికల పేరుతో బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. ‘బీజేపీనేతలు చేస్తున్న ప్రచారం వాస్తవమైతే, వారు దుబ్బాక బస్టాండ్ సెంటర్‌కు వచ్చి ప్రజల మధ్య నిరూపిస్తే మంత్రి, ఎమ్మెల్యే …
Read More »గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభవార్త
వారం రోజులుగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు, ముంచెత్తుతున్న వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తుండటంతో బాధితులను ఆదుకొనేందుకు నేనున్నానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభయమి చ్చారు. భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన సోమవారం తెలిపారు. వరద ప్రభావానికి గురైన కుటుంబాలకు ఇంటికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. వర్షాలు, వరదల …
Read More »వరద నష్టం రూ.5వేల కోట్లు
భారీ వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు అందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావల్సిన బియ్యం, పప్పుతో పాటు ఇతర నిత్యావసర సరుకులను, ఆహారాన్ని, ప్రతీ ఇంటికి మూడు చొప్పున రగ్గులను ప్రభుత్వ పక్షాన వెంటనే అందించాలని చెప్పారు. హైదరాబాద్ నగర పరిధిలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణం జిహెచ్ఎంసికి 5 …
Read More »వరద సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన చర్యలపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, విపత్తు నిర్వహణ అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. శానిటైజేషన్ చేయాలని, అవసరమైన చోట్ల రసాయనాలు …
Read More »వరదలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై మంత్రులు, అధికారులతో చర్చించనున్నారు. ప్రస్తుతం తీసుకున్న, చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు. నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉన్నందున, ఈ సమావేశానికి వచ్చే అధికారులు అన్ని వివరాలతో సమీక్షకు రావాలని సీఎం ఆదేశించారు. మున్సిపల్, …
Read More »