మన వెంట్రుకలకు సహాజంగానే వానకాలం శత్రువు లాంటిది. మనకు తెలియకుండానే జుట్టు రాలిపోతుంది. జడ పలచబడిపోతుంది. తడి వాతావరణంలో చుట్టుపక్కల కాలుష్యమంతా తల మీద పోగైపోతుంది.
దీంతో చర్మ రోగాలు పుట్టుకొస్తాయి. చుండ్రు తిష్టవేస్తుంది. జుట్టు జిడ్డుగా మారుతుంది. కొందరిలో విపరీతంగా పొడిబారుతుంది. దురదగానూ అనిపించవచ్చు. తగిన జాగ్రత్తలతో ఈ సమస్యల్ని నివారించడం సాధ్యమే.
- వర్షంలో తడవకండి. తడిసినా వెంటనే పొడి తువ్వాలుతో తుడుచుకోండి. అప్పుడు కూడా ఎక్కువ ఒత్తిడి వద్దు.
- వారానికి కనీసం మూడుసార్లు తలస్నానం చేయండి. దీంతో వ్యర్థాలు పేరుకుపోకుండా ఉంటాయి.
- హెయిర్ డ్రయర్ వాడకపోవడమే మంచిది. దీనివల్ల ఉత్పత్తి అయ్యే వేడి జుట్టుకు హాని చేస్తుంది.
- తలకు రసాయన షాంపూ హానికరం. సాధ్యమైనంత వరకూ సహజమైన ఉత్పత్తులే వాడండి.
- మంచి కండిషనర్ ఉపయోగించండి.
- ఒత్తిడి తగ్గించుకోండి.
- పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వండి.
- తీవ్రంగా జుట్టు రాలుతున్నా, చుండ్రు వేధిస్తున్నా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.