ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ గుండెపోటుతో వచ్చే మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో అసలు గుండె పోటు వచ్చే ముందు రెండు ప్రధాన సంకేతాలు స్త్రీ పురుషుల్లో వేర్వేరుగా ఉంటాయని USలోని స్మిడ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ పరిశోధన తెలిపింది.
ఆడవారిలో గుండెపోటుకు ముందు శ్వాస అందకపోవడం, మగవారిలో ఛాతీనొప్పి వస్తుందని పేర్కొంది. అలాగే గుండెదడ, మూర్ఛ, ఫ్లూ మాదిరి లక్షణాలు, ఉన్నఫళంగా చూపు మసకబారడం వంటివి కూడా సంకేతాలని తెలిపింది. వాటిని పసిగట్టి చికిత్స తీసుకుంటే మరణాలను నివారించొచ్చని పరిశోధకులు తెలిపారు.