సహజంగా నిద్రలో గురక మాములే. కానీ గురక వల్ల గుండెకు ప్రమాదమా కాదా అనే అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాము.. నిద్రలో గురక పెట్టే అలవాటు ఉంటే మధ్య వయసు దాటాక స్ట్రోక్ గుండెపోటు తప్పదని అంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు.
అమెరికా దేశ వ్యాప్తంగా ఇరవై నుండియాబై ఏండ్ల మధ్య ఉన్న దాదాపు ఏడు లక్షల అరవై ఆరు వేల మందిపై పరిశోధకులు అధ్యయనం చేశారు. గురకపెట్టే యువకులకు మధ్య వయసులోనే స్ట్రోక్ వచ్చే ముప్పు అరవై శాతం ఉంటుందని తేల్చి చెప్పారు.
గురక పెట్టని వారితో పోల్చిస్తే గుండె సంబంధిత సమస్యల భారీన పడే ప్రమాదం ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుందని ఈ పరిశోధనలో గుర్తించారు. ఈ అధ్యయన ఫలితాలను అమ్ స్టర్ డామ్ లో నిర్వహించిన యురోపియన్ సోసైటీ ఆఫ్ కార్డియాలజీ కాంగ్రెస్ లొ సమర్పించారు పరిశోధకులు.