మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆసీస్ నిర్దేశించిన 70 పరుగుల లక్ష్యాన్ని.. 15.5 ఓవర్లలోనే టీమిండియా ఛేదించింది. మయాంక్, పుజారా ఫెయిలైనా.. గిల్(35), రహానే(27) రాణించారు మ్యాచ్ నాలుగు రోజుల్లోనే ముగిసింది. ఈ ఫలితంతో టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. మూడో టెస్టు సిడ్నీ లేదా మెల్ బోర్న్ లోనే JAN 7 నుంచి JAN 11 …
Read More »రెండో టెస్టులో టీమిండియా రికార్డుల మోత
* మెల్ బోర్న్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా బుమ్రా(4 ఇన్నింగ్స్ లో 15 వికెట్లు) ఘనత సాధించాడు * 2018 బాక్సింగ్ డే టెస్టు తర్వాత ఆసీస్ ను రెండోసారి భారత్ ఓడించింది ఆసియా జట్లలో ఆసీస్ ను ఎక్కువసార్లు ఓడించిన టీంగా భారత్ (8) రికార్డు నెలకొల్పింది * ఆస్ట్రేలియాలో టెస్టు విజయం అందించిన కెప్టెన్లలో ఒకడిగా రహానే నిలిచాడు. గతంలో కోహ్లి, …
Read More »రోహిత్‌శర్మ అరుదైన ఘనతకు మూడేళ్లు!
డిసెంబరు 13, 2017.. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మ జీవితంలో మర్చిపోలేని రోజు. మొహాలీ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ చెలరేగిపోయాడు. అజేయ డబుల్ సెంచరీ (208)తో కదం తొక్కాడు. ఫలితంగా వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ ఘనతకు నేటితో మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ‘స్టార్‌స్పోర్ట్స్’ ట్వీట్ చేయగా, రోహిత్ బదులిస్తూ.. మరిన్ని సెంచరీలు వస్తాయని బదులిచ్చాడు. వన్డే క్రికెట్‌లో మొత్తం …
Read More »దేశంలో 98 లక్షల కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. చాలా కాలం తర్వాత 30 వేల దిగువకు పడిపోయాయి. గత 24 గంటల్లో కొత్తగా 29,398 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటికంటే ఇది 6.7 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 97,96,770కి చేరింది. ఇందులో 92,90,834 మంది బాధితులు కోలుకోగా, కరోనా బారినపడిన పడిన 3,63,749 మంది చికిత్స పొందుతున్నారు. మరో 1,42,186 మంది …
Read More »దేశంలో మళ్లీ కరోనా కలవరం
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 32,080 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటికంటే 21 శాతం ఎక్కువ అని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న దేశంలో 26,567 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 97,35,850కి చేరాయి. ఇందులో 3,78,909 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారినపడినవారిలో ఇప్పటివరకు 92,15,581 మంది బాధితులు కోలుకున్నారు. ఇందులో గత 24 …
Read More »దేశంలో కొత్తగా 45,903 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 45,903 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 85,53,657కి చేరింది. ఇందులో 5,09,673 యాక్టివ్ కేసులు ఉండగా మొత్తం 79,17,373 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 490 మంది కరోనాతో చనిపోగా.. ఇప్పటివరకు 1,26,611 మంది వైరస్ తో మృతి చెందారు
Read More »భారత్‌లో 18లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా బాధితుల సంఖ్య 18 లక్షలు దాటింది. దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 18,03,696లకు చేరింది. గడిచిన 24 గంటల్లో 52,972 పాజిటివ్ కేసులు నమోదు అవగా…771 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 5,79,537 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 11,86,203 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటి వరకు మొత్తం 38,136 మంది …
Read More »ఆర్థిక సంస్కరణలు తప్పా పీవీ ఇంకా ఏమి చేశారంటే..?
దక్షిణ భారత దేశం నుండి తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టిన పీవీ నరసింహారావు గారు దేశానికి ఏం చేశారు? ఆర్థిక సంస్కరణలు రూపొందించి అమలు చేసారు ఇంతేనా అనుకునే వాళ్ళ కోసం రాస్తున్న ఈ ఆర్టికల్. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ ఎలాంటి విధానాన్ని అనుసరించాలని నెహ్రు లాంటి పెద్దలు ఆలోచన చేసి మిశ్రమ ఆర్థిక విధానాన్ని అనుసరించాలని వ్యూహం రచించారు.. ఇక్కడ మిశ్రమ …
Read More »చైనా వస్తువులను నిషేధాలు సాధ్యమా?
గల్వన్ లోయలో జరిగినదానికి ఆగ్రహం కట్టలు తెంచుకోవడం, ఆవేశపడడం, దేశభక్తితో ఉర్రూతలూగిపోవడం సహజమే కావచ్చు. ఆ మనోభావాలను అర్థం చేసుకోవచ్చును. కానీ, జనావేశాలను ఆధారం చేసుకుని యుద్ధాలు చేయడం కానీ, నిషేధాలు ఆంక్షలు విధించడం కానీ జరగవని ప్రజలకు అర్థంకావడానికి సమయం పడుతుంది. బహుశా ప్రభుత్వాలు కూడా, జనం ఆక్రోశం చల్లారనీ అన్నట్టుగా, ఆవేశకావేశాలను కొంత కాలం అనుమతిస్తాయి. ఫలితంగా, ప్రత్యేకంగా ఒక దేశంమీద, అక్కడి ప్రజలమీద, దానికి సంబంధించిన …
Read More »ఇప్పుడు రాజ్ నీతి కాదు రణ్ నీతి కావాలి -సీఎం కేసీఆర్
భారత-చైనా సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో ఏమాత్రం తొందరపాటు ఉండొద్దని, అదే సందర్భంలో దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. చైనాను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంబించాలని ప్రధానమంత్రికి సూచించారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పుడు కావల్సింది రాజకీయం (రాజ్ నీతి) కాదని, యుద్ధనీతి (రణ్ నీతి) కావాలని చెప్పారు. …
Read More »