Home / SLIDER / ఆర్థిక సంస్కరణలు తప్పా పీవీ ఇంకా ఏమి చేశారంటే..?

ఆర్థిక సంస్కరణలు తప్పా పీవీ ఇంకా ఏమి చేశారంటే..?

దక్షిణ భారత దేశం నుండి తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టిన పీవీ నరసింహారావు గారు దేశానికి ఏం చేశారు? ఆర్థిక సంస్కరణలు రూపొందించి అమలు చేసారు ఇంతేనా అనుకునే వాళ్ళ కోసం రాస్తున్న ఈ ఆర్టికల్.

భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ ఎలాంటి విధానాన్ని అనుసరించాలని నెహ్రు లాంటి పెద్దలు ఆలోచన చేసి మిశ్రమ ఆర్థిక విధానాన్ని అనుసరించాలని వ్యూహం రచించారు.. ఇక్కడ మిశ్రమ ఆర్థిక విధానం గురించి తెలుసుకునే ముందు ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న ఇంకొన్ని ఆర్థిక విధానాల గురించి తెలుసుకోవాలి

రష్యా లాంటి దేశాలు సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థను అమెరికా లాంటి దేశాలు పెట్టుబడి దారి ఆర్థిక వ్యవస్థను చైనా లాంటి దేశాలు కమ్యూనిస్టు తరహా ఆర్థిక వ్యవస్థను అనుసరిస్తున్నాయ్

ఇక్కడ సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ అంటే దేశంలోని ఉత్పత్తి పరిశ్రమలను ప్రభుత్వమే ఏర్పాటు చేసి ఆ పరిశ్రమల పైన అజమాయిసి కలిగి ఉండి ఉత్పత్తి ప్రక్రియలను ప్రభుత్వమే నిర్వహించి చేసిన ఉత్పత్తిని పంపిణీ చేసే బాధ్యత కూడా ప్రభుత్వమే కలిగి ఉంటే దాన్ని సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ అంటారు ఇందులో ప్రజా సంక్షేమం అధికంగా లాభాలు తక్కువగా ఉంటాయ్..

ఇలాంటి ఆర్థిక వ్యవస్థలో ప్రజలు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను స్థాపించుకుని ఉత్పత్తి చేసే అవకాశం ఉండదు ప్రభుత్వం దానికి అంగీకరించదు విద్యా వైద్యం నుండి మొదలుకుని అన్ని సంస్థలను అన్ని పరిశ్రమలను ప్రభుత్వమే స్థాపిస్తుంది. దీన్నే సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ లేదా సోషలిస్టు తరహా ఆర్థిక వ్యవస్థ అంటారు

లాభాపేక్ష తక్కువ ఉంటుంది కాబట్టి పారిశ్రామిక సేవా రంగ సంస్థల విస్తరణ వ్యాపార విస్తరణకు పరిమిత అవకాశం మాత్రమే ఉండి ఉద్యోగ అవకాశాలు కూడా తక్కువగానే ఉంటాయి

రెండోది పెట్టుబడి దారి ఆర్థిక వ్యవస్థ ఈ వ్యవస్థ అమెరికా బ్రిటన్ లాంటి దేశాలలో ఉంటుంది ఇక్కడ ప్రభుత్వం చేత ఎటువంటి వస్తు సేవలు ఉత్పత్తి చేయబడవు ఎటువంటి సంస్థలు ప్రభుత్వం చేత నిర్వహించబడవు ప్రభుత్వం నుండి ఎటువంటి పంపిణీ వ్యవస్థ ఉండదు ఈ వ్యవస్థ లో ప్రయివేట్ వ్యక్తులు పెట్టుబడులు పెట్టి ఉత్పత్తి సంస్థలు స్థాపించుకుంటారు ఉత్పత్తి ప్రక్రియ మొత్తం పెట్టుబడి పెట్టిన వ్యక్తుల చేతుల్లో ఉండి ఉత్పత్తి పంపిణీ కూడా పెట్టుబడి దారుల చేతుల్లోనే ఉంటుంది.

ఈ వ్యవస్థలో లాభాపేక్ష ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉత్పత్తి సేవా రంగ సంస్థలకు వ్యాపారణ విస్తరణ అధికంగా ఉండి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి..

ముడోది కమ్యూనిస్టు తరహా ఆర్థిక వ్యవస్థ ఈ వ్యవస్థ లో ఉత్పత్తి ప్రక్రియ మొత్తం కార్మికుల చేతుల్లో ఉండి పంపిణీ వ్యవస్థ కూడా కార్మికుల చేతుల్లోనే ఉంటుంది చైనా ఈ తరహా వ్యవస్థను కలిగి ఉంది

భారత దేశ స్వాతంత్ర్యానంతరం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎంచుకుంది అంటే ఉత్పత్తి లో ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం ఉండే విధానాన్ని ఎంచుకుంది 1948 నుండి 1991 వరకు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ లో కూడా ప్రభుత్వ బాగస్వామ్యమే అధికంగా ఉండేలా అంటే సామ్యవాద తరహా ఆర్థిక విధానాలే ఎక్కువగా అనుసరించి భారత ప్రభుత్వం.

ఇనుము ఉక్కు లాంటి మూలధన పరిశ్రమల స్థాపన బాంకింగ్ రంగం విమానాశ్రయాలు రవాణా రంగం సమాచార రంగం లాంటి అనేక సంస్థలలో పరిశ్రమలలో ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టి ప్రయివేట్ వ్యక్తులకు పెట్టుబడి పెట్టె అవకాశాలను ఇవ్వలేదు దానితో ప్రయివేట్ రంగ వ్యవస్థ దేశంలో అభివృద్ధి చెందలేదు.

ఎక్కువ శాతం పరిశ్రమలు ప్రభుత్వ రంగం లోనే ఉండడం ప్రభుత్వ రంగంలో నెల కొల్పబడిన సంస్థల నిర్వహణ కొరవడి ప్రభుత్వ రంగంలో నెలకొల్పిన వ్యవస్థలు దాదాపుగా అన్ని ఆర్థిక నష్టాలను చవి చూశాయి దానితో లాభాలు లేక ఉత్పత్తి కుంటుబడి పోయి ఇతర దేశాల నుండి దిగుమతులు పెంచుకున్నాం పెరిగిన దిగుమతుల వల్ల ఒకవైపు విదేశీ మారక చెల్లింపులు పెరిగిపోయి మన దగ్గర నిల్వ ఉన్న విదేశీ కరెన్సీ నిల్వలు తగ్గిపోయాయి.

నానాటికి జనాభా పెరుగుతుండడం వల్ల ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి ప్రయివేట్ రంగం అభివృద్ధి చెందక పోవడం వల్ల ఆ రంగం కూడా పెరిగిన జనాభా కు ఉపాధి అవకాశాలు కల్పించలేక పోయింది. దానితో దేశంలో ఒకవైపు పెరుగుతున్న నిరుద్యోగం పేదరికం మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ నుండి దిగుమతులు చేసుకోడానికి ప్రపంచ దేశాల నుండి తెచ్చుకున్న అప్పులు విపరీతంగా పెరిగిపోయి దేశ ఆర్థిక వ్యవస్థ 1991 నాటికి పూర్తి స్థాయిలో పతనం అవడానికి సిద్ధంగా ఉంది.

సరిగ్గా అలాంటి సందర్భంలోనే భారత ప్రభుత్వ పగ్గాలు అందుకున్న తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ నరసింహారావు ప్రధాని హోదాలో ఆర్థిక సంస్కరణలకు నడుం బిగించారు ఆర్థిక సంస్కరణ ల వల్ల ప్రజల నుండి తిరుగుబాటు వస్తున్నప్పటికి వెరవకుండా అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గారిని పిలిచి ఆర్థిక సంస్కరణల అమలుకు పూనుకున్నారు.

ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థలను పరిశ్రమలను అన్నింటిలో ఒక్కొక్కటిగా ప్రభుత్వం పెట్టుబడులను ఉపసంహరించుకునే ఆ సంస్థలలో ప్రయివేట్ బాగస్వామ్యాన్ని పెంచింది లైసెన్స్ రాజ్ విధానాన్ని ఒక్కొక్క రంగం నుండి రద్దు చేస్తూ ప్రయివేట్ వ్యక్తులు పెట్టుబడులు పెట్టి ఉత్పత్తి సంస్థలను నెలకొల్పుకునేలా ప్రభుత్వమే ప్రోత్సహించింది.

అలా విద్యా వైద్యం సమాచార రంగం రవాణా రంగంలో ప్రయివేట్ వ్యక్తుల పెట్టుబడులు పెరిగి ఉత్పత్తి పెరిగి వ్యాపార విస్తరణ జరిగి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తిరిగి దేశంలో నెలకొల్పబడ్డాయి

దేశంలో ప్రయివేట్ రంగం భాగస్వామ్యం పెరగడం వల్ల రవాణా సౌకర్యాలు స్కిల్డ్ లేబర్ లాంటి ఇతర మౌలిక వసతులు పెరిగి విదేశీ పెట్టుబడులు ఆకర్షించబడ్డాయి దానితో మన విదేశీ కరెన్సీ నిల్వలు పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడింది.

ఒకవేళ పీవీ నరసింహారావు లాంటి దమ్మున్న నాయకుడు అప్పుడు లేకుంటే ఈ రోజు దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనం అయి ఉండేది..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat