ప్రస్తుతం చాలా మంది మద్యపానానికి బదులుగా గంజాయి, భాంగ్ ని ప్రోత్సహించాలని ఛత్తీస్ గడ్ రాష్ట్ర బీజేపీకి చెందిన ఎమ్మెల్యే కృష్ణమూర్తి బాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పడమే కాకుండా గతంలో దీనిపై అసెంబ్లీలో కూడా చర్చించానని ఆయన తెలిపారు. గంజాయి తాగినవాళ్లు అత్యాచారం, హత్య, దోపిడీలకు పాల్పడిన దాఖలాలు లేవన్నారు. బాధ్య తాయుతమైన ప్రజాప్రతినిధి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? …
Read More »సోనియా గాంధీ ఏమైనా సూపర్ హ్యూమనా?:
దేశంలో సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో విపక్ష ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో లోక్సభ వాయిదా పడింది. దీనిపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చట్టం ముందు అందరూ సమానమా? కాదా? కాంగ్రెస్ ప్రెసిడెంట్ (సోనియా గాంధీ) ఏమైనా సూపర్ హ్యూమనా? వారు (కాంగ్రెస్) చట్టానికి అతీతం అని భావిస్తున్నారా?’ అని ఎంపీలపై మండిపడ్డారు.
Read More »సామాన్యులకు కేంద్రం మరో షాక్
సామాన్యులకు కేంద్రం మరో షాకిచ్చింది. రైల్వే టికెట్ ధరపై వృద్ధులకిచ్చే (senior citizens) రాయితీని పునరుద్ధరించబోమని స్పష్టంచేసింది. కొవిడ్ పరిస్థితులు నేపథ్యంలో అన్ని రాయితీలనూ (Railway concession) రద్దు చేసిన రైల్వే శాఖ.. కొన్నింటిని మాత్రమే పునరుద్ధరించింది. దీంతో వృద్ధులకిచ్చే రాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ ప్రయాణికుల నుంచి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీల ప్రకటన చేసింది. గతంలో కొనసాగించిన అన్ని రాయితీలనూ తిరిగి పునరుద్ధరించే యోచన లేదని స్పష్టం …
Read More »మీకు ఆధార్ కార్డు ఉందా.. అయితే ఇది మీకోసమే..!
మీకు ఆధార్ కార్డు ఉందా.. అయితే ఇది మీకోసమే..! ఆధార్-ఓటర్ కార్డును ఓటరు ఇష్టానుసారం వాటిని ఆన్లైన్, ఆఫ్లైన్లో లింక్ చేసుకోవచ్చు ఇలా.. > NVSP పోర్టల్లో ఆధార్, ఓటర్ IDని లింక్ చేసుకోవచ్చు. ><ఓటర్ ID నంబర్><Aadhaar_Number> ఫార్మాట్లో టైప్ చేసి 166 లేదా 51969కి SMS పంపి లింక్ చేసుకోవచ్చు. > పని రోజుల్లో ఉ. 10-సా. 5 మధ్య 1950కి కాల్ చేసి వివరాలు తెలిపి …
Read More »కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 9.79 లక్షల ఉద్యోగ ఖాళీలు-కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 2021, మార్చి 1 నాటికి 9.79 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా పార్లమెంట్‌కు తెలిపారు. ఈ మేరకు జితేంద్ర సింగ్ లోక్‌సభలో ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర విభాగాల్లో మొత్తం మంజూరు పోస్టులు సంఖ్య 40.35 లక్షలు కాగా, వాటిలో 9.79 లక్షలు ఖాళీగా ఉన్నాయంటే.. …
Read More »త్రివిధ దళాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు ఎన్నో తెలుసా..?
త్రివిధ దళాల్లో 1,35,784 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కేంద్రం తెలిపింది. ఆర్మీలో 1,16,464, నేవీలో 13,537, ఎయిర్పోర్స్లో 5,723 ఖాళీలున్నట్లు పేర్కొంది. అగ్నివీరుల భర్తీ సంఖ్య కంటే సగటు నియామకాల సంఖ్య ఎక్కువగా ఉందా? అయితే సాయుధ దళాల్లో సిబ్బంది కొరత ఎలా తీరుస్తారు? అన్న ప్రశ్నలకు కేంద్రం సమాధానం ఇవ్వలేదు. ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీం పరిధిలో ఉందని బదులిచ్చింది.
Read More »మహారాష్ట్రలో ఓ దారుణం
మహారాష్ట్రలో ఓ దారుణం జరిగింది. బాలికపై ఓ ఎస్ఐ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నెల జూలై 13న బాలికను కారులో ఎక్కించుకుని నాగ్ పూర్ నగరం మొత్తం తిప్పి చూపించిన ఎస్సై అనంతరం ఆమెకు మద్యం తాగించి, హోటల్ రూంకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మరుసటి రోజు ఇంటికి తిరిగెళ్లిన బాలిక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లైంగిక దాడికి పాల్పడిన …
Read More »ఆహార పదార్థాలపై జీఎస్టీపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ
దేశ వ్యాప్తంగా నిన్నటి నుంచి ఆహార పదార్థాలపై కొత్త జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. పప్పు ధాన్యాలు, గోధుమలు, గోధుమ పిండి, ఓట్స్, మొక్కజొన్న, బియ్యం, మరమరాలు, రవ్వ, మైదా పిండి, శనగ పిండి, పెరుగు, లస్సీ, మజ్జిగ వంటి ఆహార ఉత్పత్తుల్ని ప్యాక్ చేయకుండా లేదా లేబుల్ వేయకుండా విక్రయిస్తే జీఎస్టీ వర్తించదని ట్విటర్లో పేర్కొన్నారు.
Read More »ఎంపీగా పిటీ ఉష ప్రమాణం
ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ పీటీ ఉష ఈ రోజు బుధవారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. హిందీ భాషలో ఆమె ప్రమాణం చేయడం ఇక్కడ విశేషం. లెజండరీ అథ్లెట్ పీటీ ఉషతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా, ఫిల్మ్ రైటర్ వీ విజయేంద్ర ప్రసాద్, ఆధ్యాత్మిక నేత వీరేంద్ర హెగ్డేలను రాజ్యసభకు కేంద్రం నామినేట్ చేసిన విషయం తెలిసిందే.
Read More »రాష్ట్రపతి పదవి విరమణ తర్వాత రామ్‌నాథ్ కోవింద్ కు ఏమి ఏమిస్తారో తెలుసా..?
ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం ఈ నెల 25న ముగియనుంది. ఈ నెల 24న ఆయనకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు హాజరుకానున్నారు. ఈ నెల 25న రాష్ట్రపతి భవన్ ఖాళీ చేయాల్సి ఉన్నా రెండ్రోజుల ముందే ఆయన తన ఇంటి సామాను 12 జన్‌పథ్ బంగ్లాకు తరలించాలని …
Read More »