ఫుల్ గా మద్యం సేవించేవారికి శాస్త్రవేత్తలు ఓ హెచ్చరిక చేశారు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా పురుషుల్లో డీఎన్ఏ కూడా మారిపోతుందని స్పష్టంచేశారు. ఈ దురలవాటును మానుకున్నా.. సదరు మార్పులు ఒక పట్టాన సర్దుకోవని చెప్పారు. కనీసం 3 నెలల పాటు కొనసాగుతాయని పేర్కొన్నారు. బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్) శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. మితిమీరిన మద్యపానం వల్ల తొలుత ‘ఆల్కాహల్ …
Read More »ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం వరుసగా ఐదో రోజు పెరిగాయి. గత మంగళవారం నుంచి ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. లీటర్ పెట్రోల్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.88 మార్కును దాటింది. డీజిల్ రికార్డ్ గరిష్టానికి చేరుకుంది. తాజాగా పెట్రోల్ ధరలు వివిధ నగరాల్లో 30 నుంచి 51 పైసలు పెరిగింది. డీజిల్ ధరలు 36 …
Read More »భారత్ లో 30కోట్ల మందికి కరోనా
మొత్తం 135కోట్ల జనాభా ఉన్న ఇండియాలో సుమారు 30 కోట్ల మందికి కరోనా వ్యాపించి ఉండొచ్చని ICMR సర్వేలో తేలింది. వీరిలో చాలా మందికి కరోనా వచ్చి తగ్గిన విషయం కూడా తెలియకపోవచ్చని సెరోలాజికల్ సర్వేకు చెందిన ఓ అధికారి చెప్పారు. తగినంత రోగనిరోధక శక్తి ఉండటం వల్లే లక్షణాలు బయటపడట్లేదన్నారు. 2020 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 30 వేల మందిపై సర్వే నిర్వహిస్తే.. 15 మందికి ఒకరిలో కోవిడ్ …
Read More »బీజేపీ సంచలన నిర్ణయం
గుజరాత్ రాష్ట్ర బీజేపీ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 60 ఏళ్ల వయసు పైబడిన వారితోపాటు రాజకీయనాయకుల బంధువులకు.. అలాగే, ఇప్పటికే మూడుసార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వారికి పార్టీ తరపున నిల్చునేందుకు టికెట్లు ఇచ్చేది లేదని ప్రకటించింది. పార్టీ టికెట్ల కోసం పోటీ పెరగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు BJP గుజరాత్ శ్రేణులు చెబుతున్నాయి
Read More »మద్యం ప్రియులకు శుభవార్త
దేశంలోని మద్యం ప్రియులకు శుభవార్త.. అదేంటంటే పెట్రోల్, డీజిల్ తరహాలోనే మద్యంపై 100శాతం అగ్రి ఇన్ ఫ్రాస్టక్చర్ అండ్ డెవలప్ మెంట్ సెస్ (AIDC) విధించిన కేంద్ర ప్రభుత్వం దీని ద్వారా ధరల్లో ఎలాంటి పెరుగుదల ఉండదని స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం ఇంపోర్టెడ్ మద్యంపై 150శాతం కస్టమ్స్ డ్యూటీ విధిస్తుండగా.. దాన్ని 50శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మద్యంపై కస్టమ్స్ డ్యూటీ, AIDC కలిపి మొత్తంగా 150శాతానికే పరిమితం అవుతుందని …
Read More »కొత్త పథకాన్ని తీసుకొచ్చిన కేంద్రం
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ బడ్జెట్ లో కొత్తగా పీఎం ఆత్మనిర్భర ఆరోగ్య పథకం’ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రూ.64,180 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం ఈ మొత్తంతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామన్నారు అటు దేశంలో కొత్తగా 4 ప్రాంతాల్లో వైరాలజీ ల్యాబులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం పుణెలో మాత్రమే ఈ తరహా ల్యాబ్ ఉంది.
Read More »వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ఎందుకంటే..?
దేశంలోని లబ్ధిదారుల సౌకర్యం కోసమే దేశంలో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీమ్‌ను అమల్లోకి తెచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ పథకంవల్ల లబ్ధిదారుడు ఏ రాష్ట్రం, ఏ ప్రాంతానికి చెందిన వాడైనా మరే ఇతర ప్రాంతం లేదా రాష్ట్రం నుంచైనా సరుకులు తీసుకునే సౌకర్యం కలిగిందని ఆమె తెలిపారు. ముఖ్యంగా బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే వలస కార్మికులకు ఈ పథకం …
Read More »అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూసిన ఎమ్మెల్సీ
కొందరు ప్రజాప్రతినిధులు తమ హోదాను మరిచి.. తాము ఎక్కడ ఉన్నాం.. ఏం చేస్తున్నామన్న ఇంగిత జ్ఞానం మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు.. చట్టసభలో కూర్చొని ప్రజలకు అవసరమైన పనులపై చర్చించాల్సిన నేతలు అశ్లీల వీడియోలు చూస్తున్నారు. అతి జుగుప్సాకరమైన ఘటన కర్ణాటక శాసన మండలిలో శుక్రవారం చోటు చేసుకుంది. గతంలోనూ ముగ్గురు ఎమ్మెల్యేలు కర్ణాటక శాసనభలో పోర్న్ వీడియోలు చూస్తూ కెమెరాలకు చిక్కడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు …
Read More »దేశంలో కొత్తగా 13,203కరోనా కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,203 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,06,67,736కి చేరింది. ఇక నిన్న కరోనాతో 131 మంది ప్రాణాలు కోల్పోయారు.. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 1,53,470కు చేరింది. ప్రస్తుతం 1,84,182 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. ఇప్పటివరకు 1,03,30,084 మంది కోలుకున్నారు.
Read More »అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ చేసిన తొలి పని ఏంటో తెలుసా..?
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ పలు మార్పులకు శ్రీకారం చుడుతున్నారు, ఇందులో భాగంగా హొజ్లోని అధ్యక్ష కార్యాలయం అయిన ఓవల్ ఆఫీస్‌లో వైట్ ట్రంప్ ఏర్పాటు చేసిన సోడా బటనను తొలగించారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఈ బటన్ ఏర్పాటు చేయించారు. చెక్క బాక్సుపై ఉండే ఎర్రటి బటన్ నొక్కగానే సిబ్బంది ఆయనకు వెంటనే సోడా తీసుకొచ్చి ఇచ్చేవారు.
Read More »