సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీ పయనమవుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఇటీవలే కేంద్రానికి వ్యతిరేకంగా హస్తినలో ధర్నా చేసిన ఆయన.. బీజేపీపై పోరులో భాగంగా రెండు రోజుల్లో మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈసారి వారం రోజులు అక్కడే ఉండి కొత్త వ్యవసాయ చట్టాలపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆయన యూపీ వెళ్లి లఖింపూర్ ఖేరీ ఘటనలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి, ఆర్థిక సాయం చేసే అవకాశం ఉంది.
Read More »చేతికి ఎముక లేదడానికి ట్రేడ్‌మార్క్ కేసీఆర్: సీజేఐ ఎన్వీ రమణ
చేతికి ఎముక లేదడానికి ట్రేడ్‌మార్క్ సీఎం కేసీఆర్ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించాలని కేంద్రం, ఇతర రాష్ట్రాలు భావిస్తుంటాయని, తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ 4320కిపైగా ఉద్యోగాలు సృష్టించారన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో జరిగిన న్యాయాధికారుల సదస్సుకు సీజేఐ ఎన్వీ రమణ, హైకోర్టు సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ …
Read More »24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాలో తెలంగాణ ఘనత-నీతి ఆయోగ్ నివేదిక..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్న నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం విద్యుత్ లభ్యత, ధర, విశ్వసనీయతలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యుత్, పర్యావరణ సూచిక రౌండ్-1 ర్యాంకింగులో కేరళ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రాష్ట్రం రెండో …
Read More »యావత్ భారతావని అబ్బురపడే వార్త చెప్పిన ప్రధాని మోదీ
దేశ ప్రజలు అబ్బురపడే ఓ గొప్ప వరాన్ని ప్రధానమంత్రి నరేందర్ మోదీ ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ తన ట్విట్టర్ సాక్షిగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశంలో 3 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తికానుందని.. ఈ ఇళ్లు ‘మహిళా సాధికారతకు చిహ్నం’ అని ఆయన ట్వీట్ చేశారు. దేశంలో ఉన్న “పేదలకు పక్కా ఇళ్లు అందించే కార్యక్రమంలో మనం కీలక అడుగు వేశాం. ప్రజా …
Read More »ప్రధాని పదవిని కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్
పాకిస్థాన్ పార్లమెంట్ ను రద్దు చేసి ఎన్నికలకు వెళ్తున్నట్లు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు..దీంతో ఇమ్రాన్ ఖాన్ తన ప్రధాని పదవి కోల్పోయారు. పాక్ కేబినెట్ జారీ చేసిన సర్క్యూలర్ లో ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను పాక్ ప్రధానిగా డినోటిఫై చేశారు. దీంతో పాక్ రాజ్యాంగం ప్రకారం తాత్కాలిక ప్రధానిని నియమించే 15 రోజుల వరకు ఇమ్రాన్ ప్రధానిగా కొనసాగుతారు. అయితే రానున్న 90 రోజుల్లో …
Read More »ఢిల్లీకి సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత,వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రేపు దేశ రాజధాని మహానగరం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా ప్రధానమంత్రి నరేందర్ మోదీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రేపు సాయంత్రం భేటీ కానున్నారు.. ఈ భేటీలో ప్రధానమంత్రి నరేందర్ మోదీతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు అని సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ పలువురు కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. …
Read More »పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం
పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రతిపక్ష పార్టీ ప్రవేశ పెట్టనున్న అవిశ్వాస తీర్మానంపై రేపు గురువారం రోజు జరగనున్న చర్చలో భాగంగా ఓటింగ్ నేపథ్యంలో తమ పార్టీకి చెందిన ఎంపీలు ఓటింగ్ లో పాల్గొనకుండా ఇమ్రాన్ ఖాన్ తన పార్టీకి చెందిన ఎంపీలకు విప్ జారీ చేశాడు. …
Read More »ఉక్రెయిన్లపై రష్యా యుద్ధాన్ని ఆపేందుకు రంగంలోకి ప్రధాని మోడీ
ఉక్రెయిన్లపై రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. యుద్ధంపై భారత వైఖరిని క్వాడ్ సభ్యదేశాలు ( JAPAN, USA, AUS, IND) అంగీకరించినట్టు ఆస్ట్రేలియా వెల్లడించింది. తన కాంటాక్టుల ద్వారా. మోడీ యుద్ధాన్ని ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. యుద్ధంపై భారత్ తటస్థ వైఖరిని అనుసరిస్తోంది. నేటి మోడీ.. AUS ప్రధాని స్కాట్ మారిసన్ భేటీలో యుద్ధం అంశం ప్రస్తావనకు రానుంది.
Read More »పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదవీగండం
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదవీగండం ఏర్పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో దీనిపై ఏ క్షణమైనా ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇమ్రాన్ కు షాకిస్తూ 24 మంది ఎంపీలు, ముగ్గురు మంత్రులు రాజీనామా చేశారు. దీంతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అవిశ్వాసం నెగ్గాలంటే 172 సీట్లు కావాలి. కానీ ఇమ్రాన్ ప్రభుత్వానికి ప్రస్తుతం 155 సీట్లు మాత్రమే ఉన్నాయి.
Read More »BJPలో చేరేందుకు ప్రధాని మోదీతో కోమటిరెడ్డి బ్రదర్స్ భేటీ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి ,ప్రస్తుత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి,మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీలో చేరబోతున్నారా..?. గతంలో తిరుమల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీలో చేరతానని ప్రకటించిన వార్త ఇప్పుడు నిజం కాబోతుందా..?. అంటే అవుననే అంటున్నారు తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు …
Read More »