కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, శుభకార్యాలకు హాజరు కావాలని ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read More »తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికే ఆదర్శప్రాయం…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో జీడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదటగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇండస్ట్రియల్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సందర్శించి.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గడిచిన తొమ్మది ఏళ్లలో పారిశ్రామిక రంగం సాధించిన విజయాలను వివరిస్తూ …
Read More »సికింద్రాబాద్ పరిధిలో విద్యుత్ సేవలను ముమ్మరం చేయాలి
రానున్న వర్షా కాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని ప్రభుత్వ విభాగాలు అప్రమత్తంగా వ్యవహరించాలని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ పరిధిలో జీ హెచ్ ఎం సీ ఇంజినీరింగ్ విభాగం ఏర్పాటు చేసిన మాన్సూన్ టీం వాహనాల బృందాలను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మంగళవారం సితాఫలమండీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీ హెచ్ ఎం సీ …
Read More »వార్నర్ చాలా డేంజరస్
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ చాలా ప్రమాదకరమని టీమిండియా లెజండ్రీ ఆటగాడు.. డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి అన్నారు. ‘వార్నర్ ఆస్ట్రేలియాకు ఇంపాక్ట్ ప్లేయర్. అతడు ఫాంలో ఉంటే చాలా తొందరగా ఆటను మన నుంచి లాగేసుకుంటాడు. అది ప్రత్యర్థులను చాలా బాధపెడుతుంది. తొందరగా ఔట్ చేయకుంటే ఫలితం మరోలా ఉంటుంది. అతడు చాలా డేంజరస్. ఆస్ట్రేలియా తరపున ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ లు ఆడాడు’ అని …
Read More »గ్రేమ్ స్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇంగ్లాండ్ కి చెందిన మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. WTC ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయం సాధిస్తే సెలబ్రేట్ చేసుకుంటానని అన్నారు. ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగనున్న ఓవల్ మైదానంలో పిచ్ ఫ్లాట్ గా ఉంటుంది. దీంతో పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని స్వాన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అయితే భారత్, ఆస్ట్రేలియా రెండు వరల్డ్ క్లాస్ జట్లని పేర్కొన్నారు. భారత్ జట్టులోనూ అద్భుతమైన పేసర్లు …
Read More »వేములవాడ రాజన్న ఆలయంలో విషాదం
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లింగాపూర్‌కు చెందిన మహిళ.. భర్త, కూతురితో కలిసి సోమవారం వచ్చింది. సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దర్శనం చేసుకోవడం కుదర్లేదు. దీంతో రాత్రి ఆలయ ప్రాంగణంలోనే నిద్రించి.. తెల్లవారుజామున దర్శనం చేసుకోవాలని అనుకున్నారు. మంగళవారం తెల్లవారుజామునే లేచి దర్శనానికి బయల్దేరారు. ఈ క్రమంలో క్యూలైన్‌లో నిల్చున్న మహిళ ఛాతిలో …
Read More »ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలోఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
ఇచ్చొడ మండలంలోని ధాభ – కే గ్రామ పంచాయతీ పరిధిలో గల భాధిగూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ దేవాలయ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు హాజరయి ఆలయాన్ని ప్రారంభించారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఎంతో మంది నాయకులం చూసాం కానీ మా ఈయోక్క చిన్న గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోయేదని ఈరోజు గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారి కృషితో …
Read More »