తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లింగాపూర్‌కు చెందిన మహిళ.. భర్త, కూతురితో కలిసి సోమవారం వచ్చింది.
సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దర్శనం చేసుకోవడం కుదర్లేదు. దీంతో రాత్రి ఆలయ ప్రాంగణంలోనే నిద్రించి.. తెల్లవారుజామున దర్శనం చేసుకోవాలని అనుకున్నారు. మంగళవారం తెల్లవారుజామునే లేచి దర్శనానికి బయల్దేరారు.
ఈ క్రమంలో క్యూలైన్‌లో నిల్చున్న మహిళ ఛాతిలో నొప్పితో అకస్మాత్తుగా కుప్పకూలింది. అది చూసి కుటుంబసభ్యులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. గమనించిన ఆలయ సిబ్బంది, వైద్య సిబ్బంది ఆమెను పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది.