తెలంగాణ వ్యాప్తంగా వచ్చే నెల 3 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న సంగతి తెల్సిందే. వచ్చే నెలలో జరిగే టెన్త్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. పదో తరగతి హాల్టికెట్లు విడుదల www.bse.telangana.gov.in వెబ్సైట్లో విద్యార్థులు తమ హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిపై HM సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతిస్తామని పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే తెలిపింది. ఈసారి 4.94 లక్షల మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు …
Read More »మార్చి 29న ఆవిర్భావ దినోత్సవ భారీ బహిరంగ సభ
ఏపీలో తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం 42వ ఆవిర్భావ దినోత్సవ సభను ఈ నెల 29న తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించేందుకు ఆ పార్టీ తెలంగాణ విభాగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల నుంచి ప్రతినిధులు హాజరవుతారని పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల …
Read More »ఏపీ మండలిలో బలం పెంచుకున్న వైసీపీ
ఏపీలో నిన్న ఎమ్మెల్యే కోటాలో ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ ఏడు స్థానాలు.. ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ ఒక స్థానంలో గెలుపొందాయి. దీంతో శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58. తాజాగా జరిగిన స్థానిక సంస్థలు, టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వైసీపీ బలం భారీగా పెరిగి 44కు(గవర్నర్ కోటాతో కలిపి) చేరనుంది. ప్రధానప్రతిపక్షమైన టీడీపీ సభ్యుల సంఖ్య 17 …
Read More »భారత్ లో మళ్లీ కరోనా కలవరం
భారతదేశంలో నాలుగున్నర నెలల తర్వాత అంటే దాదాపు 140 రోజుల తర్వాత భారీగా కరోనా పాజిటీవ్ కేసులు పెరిగాయి. గడిచిన గత 24 గంటల వ్యవధిలో 1,300 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోలిస్తే 166 కేసులు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 7,605గా ఉంది. ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,99,418 …
Read More »ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు- ఓటు హక్కు వినియోగించుకున్న 130 మంది ఎమ్మెల్యేలు
ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అసెంబ్లీ హాలులో కొనసాగుతోంది. వైసీపీ అధినేత.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం సహా ఇప్పటి వరకు 130 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే మరోవైపు ప్రధానప్రతిపక్షమైన టీడీపీ అధినేత.. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతోపాటు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాసేపట్లో ఓటు వేయనున్నారు. మొత్తం 7 ఎమ్మెల్సీల స్థానాలకు …
Read More »వైసీపీకి షాకిచ్చిన రెబల్ ఎమ్మెల్యే
ఏపీలో అమరావతిలో జరుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఓటు వేసేందుకు వైసీపీకి చెందిన రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వైసీపీపై అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమేనని ఆయన అన్నారు. వైసీపీకి దూరంగానే ఉన్నానని తెలిపారు. ‘నేను ఎవరికి ఓటు వేస్తాననేది ముందుగా చెప్పను. ఓటు గురించి టీడీపీ, వైసీపీ వాళ్లు నాతో మాట్లాడలేదు’ …
Read More »భారత్‌లో రేపట్నుంచి రంజాన్ ఉపవాసాలు
భారత్‌లో బుధవారం సాయంత్రం నెలవంక కనిపించకపోవడంతో రంజాన్ నెల ఉపవాసాలు శుక్రవారం ఉదయం నుంచి మొదలుకానున్నాయి. దిల్లీలోని బహదూర్‌షా జఫర్ మార్గ్‌లో జరిగిన రుయత్ ఏ హిలాల్, ఇమారత్ ఏ షరియా-హింద్ కమిటీల సమావేశంలో ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. దేశ రాజధాని దిల్లీలో కానీ, మరే ప్రాంతంలో కానీ భారత్‌లో బుధవారం రాత్రి నెలవంక కనిపించలేదని జమియత్ ఉలేమా ఏ హింద్ ప్రకటించింది. కాగా, ప్రపంచంలో అత్యధిక …
Read More »రావినూతలకు చేరుకున్న సీఎం కేసీఆర్
వర్షప్రభావిత ప్రాంతాల్లో గురువారం సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను హెలికాప్టర్ నుంచే పరిశీలించారు. ఖమ్మం జిల్లాలో పర్యటన అనంతరం మహబూబాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు.
Read More »రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో గుజరాత్ సూరత్ కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన న్యాయస్థానం.. రెండేండ్లు జైలు శిక్ష విధించింది.మోదీ ఇంటి పేరును ఉద్దేశించి కర్ణాటకలో 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. దొంగలందరి ఇంటిపేరు మోదీయే ఎందుకంటూ..? ఆయన …
Read More »చింతల్ డివిజన్ చంద్రానగర్, ఓల్డ్ చింతల్ కాలనీల్లో పాదయాత్ర
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్ 128 డివిజన్ లో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 29వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రానగర్, ఓల్డ్ చింతల్ కాలనీల్లో పాదయాత్ర చేస్తూ దాదాపు పూర్తి చేసిన సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ తదితర పనులు పరిశీలించారు. కాగా చంద్రానగర్ లో రూ.1.90 కోట్లతో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసిన నేపథ్యంలో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ …
Read More »