Home / Tag Archives: slider (page 480)

Tag Archives: slider

బాలయ్య అభిమానులకు శుభవార్త

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో..యువరత్న బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో శ్రీకాంత్ విలన్ గా వచ్చిన చిత్రం అఖండ. బాలకృష్ణ నటించిన అఖండ సినిమాకు సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని డైరెక్టర్ బోయపాటి శ్రీను చెప్పాడు. అందుకు కావాల్సిన లీడ్ సినిమాలో చూపించానని, సీక్వెల్ ఎప్పుడుంటుందనేది తర్వాత చెబుతామని తెలిపాడు. అఖండ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న బోయపాటి.. ఈ సినిమా ద్వారా తాను తెలుగు రాష్ట్రాల్లోని …

Read More »

మోదీకి మంత్రి కేటీఆర్ షాకింగ్ ట్వీట్

భారత ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ఈ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ యువత, విద్యార్థుల తరపున మీరు త్వరగా సవరణలు చేయవలసిందిగా కోరుతున్నాను. గత 7 సంవత్సరాలలో రాష్ట్రం నుంచి అనేక అభ్యర్థనలు ఉన్నప్పటికీ, NDA ప్రభుత్వం తెలంగాణకు ఒక్క విద్యా సంస్థను కూడా మంజూరు చేయలేదు’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. దేశంలో మంజూరైన విద్యాసంస్థల వివరాలను కేటీఆర్ పంచుకున్నారు.

Read More »

కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డు

సౌతాఫ్రికా ఇండియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ ఇండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్లో 100 టెస్టు క్యాచ్లు అందుకొని కొత్త మైలురాయిని అధిగమించాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున టెస్టుల్లో అజారుద్దిన్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు. నాలుగో ఆటగాడిగా కోహ్లి నిలిచాడు.

Read More »

210పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్

కేప్టాన్ లో జరుగుతున్న నిర్ణయాత్మక 3వ టెస్టులో సౌతాఫ్రికా బ్యాట్స్మెన్ని భారత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో సఫారీ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ 210పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో పీటర్సన్-72 రాణించాడు. మిగిలిన బ్యాట్స్మెన్ పెద్దగా పరుగులు చేయలేదు. భారత బౌలర్లలో బుమ్రా-5, ఉమేశ్ యాదవ్-2, షమీ-2, శార్దూల్ ఠాకూర్-1 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ భారత్ 223రన్స్ చేసింది. 13పరుగులు ముందంజలో ఉంది.

Read More »

సంక్రాంతి నాడు గొబ్బెమ్మలెందుకెడతారో తెలుసా..?

సంక్రాంతికి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఎంతో అందంగా ముగ్గులు వేసి రంగులతో అలంకరించి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మను గౌరిమాతగా కొలుస్తారు. తయారు చేయడానికి ఆవు పేడను ఉపయోగిస్తారు. సాధారణంగా వీటిని పెళ్లికాని అమ్మాయిలు తయారు చేస్తే త్వరగా పెండ్లి అవుతుందని నమ్ముతారు. పేడతో చేసే గొబ్బెమ్మల్లో క్రిమి కీటకాలను నాశనం చేసి, ప్రకృతికి మేలు చేసే గుణాలు ఉన్నాయని సైన్స్ చెబుతోంది.

Read More »

తెలంగాణలో కొత్తగా 2,319కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 90,021 టెస్టులు చేయగా కొత్తగా 2,319 మందికి కరోనా నిర్ధారణ అయింది. నిన్నటితో పోలిస్తే 399 కేసులు పెరిగాయి. మంగళవారం 1,920 కేసులు నమోదయ్యాయి. ఇక మహమ్మారితో ఇద్దరు మరణించారు. మరోవైపు కరోనా నుంచి 474 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,339 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు గత 24 గంటల్లో GHMC పరిధిలో 1,275 …

Read More »

మంత్రి కొడాలి నానికి కరోనా

ఏపీ అధికార వైసీపీకి చెందిన సీనియర్ నేత, మంత్రి కొడాలి నాని కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. నాని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అటు టీడీపీ నేత వంగవీటి రాధాకు సైతం కరోనా సోకింది. స్వల్ప లక్షణాలున్నాయి. ఆయన కూడా ఏఐజీ ఆస్పత్రిలో చేరారు.

Read More »

ఎక్కువ సేపు మొబైల్ వాడుతున్నారా ..అయితే ఇది మీకోసమే..?

ఎక్కువసేపు మొబైల్ వాడితే వచ్చే రోగాలు చాలా ఉన్నాయంటున్నారు వైద్యులు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. స్క్రీన్ ఎక్కువ సేపు చూడటం వల్ల కంటి  చూపు తగ్గుతుంది. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది. ఒత్తిడి, డ్రై ఐస్, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. 2. గంటల కొద్దీ కదలకుండా కూర్చోవడం వల్ల ఊబకాయం వస్తుంది. కొన్ని వారాల్లో బరువు పెరిగిపోతారు. 3. ఫోన్ లైట్ వల్ల నిద్ర తగ్గిపోతుంది. …

Read More »

ఒమిక్రాన్ కు వ్యాక్సిన్

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్ వేరియంటు కి మార్చి నాటికి టీకాను తీసుకురానున్నట్లు ఫైజర్ కంపెనీ తెలిపింది. ఇప్పటికే తాము తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ను ప్రపంచ దేశాలు వినియోగిస్తున్నాయని వెల్లడించింది. ఇప్పుడు మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు ఫైజర్ నుంచి రెండు డోసుల టీకాతో పాటు బూస్టర్ డోసు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. వ్యాక్సిన్ను తీసుకోవడంతో పాటు ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపింది.

Read More »

కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ కాని ఆపరేషన్లను నిలిపివేయాలని నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసరం కాని సర్జరీలను తగ్గించాలని ఆదేశించింది. అత్యవసర సర్జరీలకు ఎలాంటి ఆటంకం ఉండదని పేర్కొంది. కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో బెడ్ల లభ్యత ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat