ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు నిన్నటి కంటే స్వల్పంగా తగ్గాయి. తాజాగా 130 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో కొవిడ్తో ఒకరు చనిపోయారు. 97 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య- 20,76,979.మరణాల సంఖ్య- 14,493. మొత్తం కోలుకున్న వారి సంఖ్య- 20,61,405 ప్రస్తుతం యాక్టివ్ కేసులు- 1,081
Read More »నోరా ఫతేహికి కోవిడ్
బాలీవుడ్ నటి నోరా ఫతేహికి కోవిడ్ సోకింది. తాను కోవిడ్ తో తీవ్రంగా బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో ఆమె పేర్కొంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని తెలిపిన నోరా.. అందరూ జాగ్రత్తగా ఉండాలి.. మాస్కులు ధరించాలని కోరింది. వైరస్ వేగంగా వ్యాపిస్తోందన్న ఫతేహి.. ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏదీ లేదని తెలిపింది. కాగా ప్రభాస్ ‘బాహుబలి’లో స్పెషల్ సాంగ్లో ఈమె నటించింది.
Read More »అమెరికాలో ఒక్కరోజే 6లక్షల కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. గత 24 గంటల్లో ఒక్క అమెరికాలోనే 6 లక్షల కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల్లో ఇదే ప్రపంచ రికార్డు అని, ఇప్పటివరకు ఒక్క రోజులో ఇన్ని కేసులు ఎప్పుడూ రాలేదని అక్కడి అధికారులు తెలిపారు. కరోనా కాటుకు 1300 మంది మరణించారు. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇక ఫ్రాన్స్లో 2.06 లక్షలు, UKలో 1.90 లక్షల …
Read More »ముంబైలో కరోనా అలజడి
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా అలజడి సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో ముంబైలో 3,671 కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం ముంబైలో 2,510 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఇవాళ 1100 కేసులు పెరిగాయి. ఇక థారావిలో మే 18 తర్వాత అత్యధికంగా ఇవాళ 20 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండగా.. కరోనా కట్టడికి ఆంక్షలు విధించడంపై సీఎం ఉద్దవ్ థాక్రే అధికారులతో …
Read More »తెలంగాణలో కొత్తగా మరో ఐదు ఒమిక్రాన్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 67కు పెరిగింది. వీరిలో 22మంది కొత్త వేరియంట్ నుంచి కోలుకున్నారు. కాగా గత 24 గంటల్లో కొత్తగా 280 కరోనా కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. మహమ్మారి వల్ల ఒకరు చనిపోయారు. నిన్న మరో 206 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,563 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య …
Read More »గోంగూర ఉపయోగాలివే..
గోంగూర ఉపయోగాలివే.. – గోంగూరలో పొటాషియం, ఐరన్ లాంటి ఖనిజ లవణాలుంటాయి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. -రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. – విటమిన్ ఎ, బి 1, బి 2, బి 9, సి ఎక్కువగా ఉంటుంది. – విటమిన్ ఎ తో కంటి సమస్యలు, బి కాంప్లెక్స్లో -దంత సమస్యలు దూరమవుతాయి. – ఎముకలు పటిష్టమవుతాయి. – ఫోలిక్ యాసిడ్, మినరల్స్ అధికంగా …
Read More »కొత్తిమీరతో అనేక ప్రయోజనాలు
కొత్తిమీరతో ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కొత్తిమీర కంటి చూపును పెంచడంలో సాయపడుతుంది కొత్తిమీర ఆకుల్లో మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నాయి కొత్తిమీర తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సాయపడుతుంది కొత్తిమీర తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది
Read More »Bollywood ఎంట్రీపై సాయిపల్లవి క్లారిటీ
తెలుగు, తమిళ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయిపల్లవి. తాజాగా శ్యామ్ సింగరాయ్ మూవీలో దేవదాసి పాత్రలో నటించి మెప్పించిన ఆమె.. బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుందనే ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన సాయిపల్లవి.. ‘బాలీవుడ్ లో నటించేందుకు సిద్ధంగా ఉన్నా. అయితేస్క్రిప్ట్ ఎంతో ముఖ్యం. ఇప్పటికిప్పుడు బాలీవుడ్లోకి అడుగుపెట్టలేను. మంచి కథ, పాత్ర ఎంతో అవసరం’ అని చెప్పింది.
Read More »న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో పలు ఆంక్షలు
న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో పలు ఆంక్షలు విధించిన పోలీసులు.. క్యాబ్ డ్రైవర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. క్యాబ్ డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలన్న పోలీసులు.. రాత్రి వేళల్లో క్యాబ్ బుక్ చేస్తే, డ్రైవర్లు రద్దు చేయటానికి వీల్లేదన్నారు. క్యాబ్ సర్వీసును రద్దు చేస్తే రూ.500 జరిమానా వేస్తామన్న పోలీసులు.. సమస్య వస్తే 9490617111 నెంబర్కు వాట్సాప్లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.
Read More »టెస్ట్ క్రికెట్ కు క్వింటన్ డీకాక్ వీడ్కోలు
సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్ డీకాక్ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. భారత్ తో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు డీకాక్ ప్రకటించాడు. వన్డేలు, టీ20లు ఆడనున్నట్లు ఈ 29 ఏళ్ల వికెట్ కీపర్ తెలిపాడు. కాగా, ఇప్పటివరకు 54 టెస్టులు ఆడిన డీకాక్.. 3,300 రన్స్ చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 22 …
Read More »