ప్రగతి భవన్ లో మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కరోనా కట్టడి, లాక్ డౌన్ విధింపు తదితర అంశాలకు సంబంధించి ఈ క్రింది నిర్ణయాలు తీసుకుంది. క్యాబినెట్ నిర్ణయాలు : – మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి.. 10 రోజులపాటు లాక్ డౌన్ విధించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి …
Read More »రికార్డ్ స్థాయిలో పోలవరం పనులు
మా హాయాంలో పోలవరం పనులు పరుగులుపెట్టాయి,ప్రతి సోమవారం పోలవరం అంటూ మా చంద్రబాబు ఇంజనీర్లను పరుగులు పెట్టించాడు అంటూ డప్పులు కొట్టుకోవడమే కాదు జనాలను సైతం బస్సుల్లో తరలించి భజనలు కూడా చేయించుకున్నారు నాటి పాలకులు.అదిగో పోలవరం పూర్తి చేసేస్తున్నామంటూ జనాలకు గ్రాఫిక్స్ చూపిస్తే వాళ్ళు మాత్రం పచ్చబ్యాచ్ కి త్రీడి సినిమానే చూపించారు. రెండేళ్ళ క్రితం వరకు ప్రాజెక్టు మన తరంలో పూర్తవుతుందా అంటూ చూసొచ్చినోళ్ళందరూ నోరెళ్ళబెట్టుకుంటే అధికారంలోకి …
Read More »జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనాకు గురయ్యారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా చెబుతూ.. ఆయన ట్వీట్ చేశారు. ‘‘నేను కొవిడ్ 19 బారిన పడ్డాను. దయచేసి ఎవరూ బాధపడకండి. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను. నేను మరియు నా ఫ్యామిలీ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి.. డాక్టర్స్ సమక్షంలో కరోనా ప్రొటోకాల్స్ పాటిస్తున్నాము. కొద్దిరోజులుగా నన్ను కాంటాక్ట్ అయినవారంతా.. టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరూ క్షేమంగా …
Read More »కంగనా రనౌత్ కి ఇన్‌స్టాగ్రామ్ భారీ షాక్
బాలీవుడ్ అందాల రాక్షసి.. వివాదస్పద నటి కంగనా రనౌత్ అకౌంట్‌ను ట్విట్టర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ షాక్ నుంచి కాంట్రవర్సీ క్వీన్ బయట పడక ముందే, మరో ప్రధాన సోషల్ మీడియా మాధ్యమ ఇన్‌స్టాగ్రామ్ ఆమెకు షాకిచ్చింది. వివరాల్లోకి వెళితే రెండు రోజుల ముందు తాను కరోనా బారిన పడ్డానంటూ కంగన పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కంగన తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తుందంటూ విమర్శలు …
Read More »లస్సీతో లాభాలు
లస్సీతో లాభాలు ఏమి ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం -లస్సీలో ఉండే ఓ రకమైన బ్యాక్టీరియా తినే ఆహారాన్ని జీర్ణం అయ్యేలా చేస్తుంది. – లస్సీలోని కాల్షియం, ప్రోటీన్స్ కండరాలకు శక్తిని,పెరుగుదలను ఇస్తాయి. – లస్సీలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. మన శరీరాన్ని తేమగా ఉంచుతాయి. ఎండలో తిరిగినా చర్మం కమిలిపోకుండా ఉంటుంది. – లస్సీలో ఉండే లాక్టిన్, విటమిన్ D ఇమ్యూనిటీని పెంచి, ఎముకలకు బలాన్ని ఇస్తాయి.
Read More »తెలంగాణలో 7ఎమ్మెల్సీలు ఖాళీ
తెలంగాణ రాష్ట్రంలో జూన్ నెలలో ఏడు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి. వీటిలో 6 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ల పదవీ కాలం జూన్ 3న పూర్తి కానుండగా, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవీ కాలం జూన్ 16న పూర్తవుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం ఈసీ వచ్చే వారం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. అధికార టీఆర్ఎస్ ఖాతాలోని ఈ స్థానాలు తిరిగి ఆ …
Read More »సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా వరంగల్ జైలు
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ సెంట్రల్ జైలును యుద్ధప్రాతిపదికన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుతమున్న ఎంజీఎం సరిపోకపోవడంతో 73 ఎకరాల్లో విస్తరించి ఉన్న జైలు ప్రాంగణంలో ఆస్పత్రి నిర్మించాలన్నారు. ఐసీయూలు, ఆక్సిజన్ ప్లాంట్, క్రిటికల్ కేర్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని చెప్పారు. జైలును వరంగల్ శివారులోని ధర్మసాగర్ పరిసర ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
Read More »మాజీ డీజీపీ బి. ప్రసాదరావు కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ బి. ప్రసాదరావు కన్నుమూశారు. అమెరికాలో ఉంటున్న ఆయనకు ఛాతి నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1979 IPS బ్యాచ్కు చెందిన ప్రసాదరావు ఏసీబీ డీజీ, హైదరాబాద్ సీపీ, విశాఖ ఎస్పీగానూ పనిచేశారు. 1997లో భారత పోలీసు పతకం, 2006లో రాష్ట్రపతి పతకం అందుకున్నారు. ‘వర్డ్ పవర్ టు మైండ్ పవర్’ అనే పుస్తకాన్ని రాశారు.
Read More »వాహనదారులకు భారీ షాక్
బ్రేక్ లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్ లీటర్కు 26 పైసలు, డీజిల్ లీటర్కు 34 పైసలు పెంచాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.95.13కు చేరగా డీజిల్ ధర రూ.89.47గా ఉంది. వ్యాట్ ఎక్కువగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ధరలు రూ.100 దాటాయి. కొవిడ్ సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.
Read More »మామిడి పండ్లను పంపుతున్న పూజా హెగ్డే
సినీ ఇండస్ట్రీలోని తన సన్నిహితులకు హీరోయిన్, అందాల రాక్షసి పూజా హెగ్దే మామిడి పండ్లు పంపుతోంది. కర్ణాటకలోని మంగళూరు వద్ద ఆమెకు మామిడి తోట ఉండగా.. ఈ సారి మంచి దిగుబడి వచ్చింది. దీంతో పరిశ్రమలో తెలిసిన వారికి మామిడి పండ్లు పంపుతుండగా.. తొలిరోజు ఒకరిద్దరు నిర్మాతలు, దర్శకులకు ఈ పండ్ల గిఫ్టులు అందగా, అందుకోవాల్సిన వారు ఇంకా చాలామందే ఉన్నారట.
Read More »