కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీకి చెందిన సీనియర్ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సొంత పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేయడాన్ని తప్పుబట్టారు. ‘బెంగాల్ ఎన్నికల ప్రణాళికను షా విడుదల చేయడం నన్ను ఆశ్చర్యపర్చింది. ఇది బీజేపీ ఎన్నికల విధానాలకు వ్యతిరేకం. ఈ నిర్ణయం తప్పుడు సంకేతాలను పంపుతోంది. మేనిఫెస్టోను బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు …
Read More »ఇలా చేస్తే రూ.300 తక్కువకు గ్యాస్ సిలిండర్
గత కొన్ని నెలలుగా గ్యాస్ ధర రూ.200 పెరగడంతో సామాన్యులపై గుదిబండలాగా మారింది అయితే, సబ్సిడీ ద్వారా వంట గ్యాస్ సిలిండర్ రూ.300 తక్కువకు లభిస్తుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. గ్యాస్ సిలిండర్ పై కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద సబ్సిడీని రూ.174 నుంచి రూ.312 రూపాయలకు పెంచింది. స్కీం కింద రిజిస్టరైతే సబ్సిడీ లభిస్తుంది. వార్షిక ఆదాయం రూ.10 లక్షలు అయితే ఈ …
Read More »ఏపీలో కొత్తగా 246 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 31,546 శాంపిల్స్‌ను పరీక్షించగా 246 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 58 మందికి వైరస్ సోకగా చిత్తూరులో 45, కృష్ణాలో 37, విశాఖపట్నంలో 23, తూర్పుగోదావరిలో 20, కర్నూలులో 15 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,90,091కి పెరిగింది. ఒకరోజు వ్యవధిలో 137 మంది కరోనా నుంచి …
Read More »విభిన్న పాత్రలో అందాల రాక్షసి కాజల్
పంజాబీ సొగసరి కాజల్ అగర్వాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ అగ్ర హీరో నాగార్జునతో తొలిసారి జోడీ కట్టబోతున్నది. నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నారాయణదాస్ నారంగ్, పూస్కూర్ రామ్మోహన్‌రావు, శరత్‌మరార్ ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని నిర్మించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో కాజల్ అగర్వాల్‌ను కథానాయికగా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘కాలేజీ రోజుల నుంచి నాగార్జునగారంటే అభిమానం. ఆయనతో …
Read More »ఆధిక్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి
తెలంగాణలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైద్రాబాద్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సరూర్‌నగర్‌లో జరుగుతున్న రెండో ప్రాధాన్యత లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి సురభివాణి దేవి ఆధిక్యంలో ఉన్నారు. రెండో ప్రాధాన్యతా ఓట్లు పొందిన అభ్యర్థుల వివరాలు… వాణీదేవి – 2, 354 రామచంద్రరావు – 1,897 ప్రొఫెసర్ నాగేశ్వర్ – 2,132 చిన్నారెడ్డి – 1,325 ఇప్పటివరకు అభ్యర్తుల మెత్తం ఓట్లు… టీఆర్ఎస్ …
Read More »నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అప్డేట్
తెలంగాణలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 66వ అభ్యర్థి (జయసారథి) ఎలిమినేషన్ అనంతరం అభ్యర్దుల వారిగా వచ్చిన ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1,17,386 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 91,858 ఓట్లు, కోదండరాంకు 79,110 ఓట్లు వచ్చాయి. 25,528 ఓట్లతో పల్లా రాజేశ్వర రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి రాములు నాయక్ …
Read More »చెన్నై భామ త్రిషకు ఘోర అవమానం
తెలుగు ఇండస్ట్రీతో పాటు తమిళంలో చెన్నై భామ త్రిషకు సూపర్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఆమెకు ఏకంగా గుడి కట్టే అభిమానులు ఉన్నారు. దర్శక నిర్మాతలు ఇప్పటికీ ఆమెతో సినిమాలు చేయడానికి పోటీ పడుతుంటారు. మూడేళ్ల కింద విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన 96 ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తెలుగులో వర్కౌట్ కాలేదు కానీ తమిళనాట చరిత్ర సృష్టించింది. …
Read More »నల్గొండ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. 34 మంది అభ్యర్థుల ఎలిమినేషన్
నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. మొదటి ప్రాధాన్య ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. తొలి ప్రాధాన్యం ఓట్లలో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేషన్ చేశారు. ఎన్నికల్లో 71 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. 500 లోపు ఓట్లు వచ్చిన 34 మంది అభ్యర్థులను అధికారులు ఎలిమినేషన్ చేశారు. వారికి వచ్చిన ఓట్లను తొలి ఐదు స్థానాల్లో ఉన్న …
Read More »మళ్లీ పెరిగిన బంగారం ధరలు
తెలంగాణలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఉదయం బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల గ్రాముల బంగారం ధర రూ.210 పెరిగి రూ.46,040కు చేరింది. ఇక 22 క్యారెట్ల గ్రాముల బంగారం ధర రూ.190 పెరిగి రూ.42,200కు చేరింది. ఇక వెండి కేజీపై రూ.900 పెరిగి రూ.72,500గా ఉంది
Read More »రామ్ చరణ్ నిర్మాతగా హీరోగా రవితేజ
మలయాళంలో హిట్ అయిన ‘డ్రైవింగ్ లైసెన్స్” తెలుగు రీమేక్ లో రవితేజ నటించే అవకాశం ఉంది. ఈ మూవీ తెలుగు రైట్స్ పొందిన రామ్ చరణ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన పాత్రలో మాస్ మహారాజ్ అయితే బావుంటుంది అనుకుంటున్నాడట. ఇక మరో కీలక పాత్రలో ఎవరిని నటింపజేయాలనేది ప్రస్తుతం ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాగా రవితేజ ప్రస్తుతం ‘ఖిలాడి’లో నటిస్తున్నాడు
Read More »